Home
Mobile

రూ.8 వేల కంటే తక్కువ ధరలో స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలని భావిస్తున్నారా?

పండుగ సీజన్‌ సందర్భంగా అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌, ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ 2025 సేల్‌ ను నిర్వహిస్తున్నాయి. నిన్న అమెజాన్‌ ప్రైమ్‌, ఫ్లిప్‌కార్ట్ బ్లా్క్‌ మరియు ప్లస్‌ మెంబర్లకు అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ సేల్స్‌లో స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌, ఇతర గ్యాడ్జెట్స్‌ సహా గృహోపకరణాలను డిస్కౌంట్ ధరకు సొంతం చేసుకోవచ్చు. దీంతోపాటు ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై 10 శాతం అదనపు డిస్కౌంట్‌ను అందిస్తున్నాయి.

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పండుగ సీజన్‌ సేల్స్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్‌లపై అనేక బ్రాండ్స్‌ భారీ డిస్కౌంట్‌లను అందిస్తున్నాయి. ఈ సేల్‌లో భాగంగా రూ.8 వేల కంటే తక్కువ ధరలో (Smartphones Under Rs8000 Price) అనేక మోడల్స్‌ ఉన్నాయి. ఈ జాబితాలో పోకో C75, రెడ్‌మి A4 5G, మోటోరోలా G05, వివో V19e, రెడ్‌మి A5 వంటి స్మార్ట్‌ఫోన్‌లున్నాయి.

Best 5 Smartphones under Rs8000 price in india

పోకో C75 5G స్మార్ట్‌ఫోన్‌ :
ఫ్లిప్‌కార్ట్‌ (Poco C75 Smartphone) ఈ ఫోన్‌ 4GB/64GB ప్రారంభ ధర రూ.7399, 4GB/128GB ధర రూ.8299 గా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.88 అంగుళాల HD+ భారీ డిస్‌ప్లేను కలిగి ఉంది. 18W ఛార్జింగ్‌ సపోర్టుతో 5160mAh బ్యాటరీని కలిగి ఉంది.

ఈ ఫోన్‌ స్నాప్‌డ్రాగన్‌ 4s జెన్‌ 2 చిప్‌సెట్‌, ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత HyperOS పైన పనిచేస్తోంది. కెమెరా విభాగం పరంగా 50MP ప్రైమరీ కెమెరా, మరో కెమెరాతోపాటు 5MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్‌ ఆక్వా బ్లూ, సిల్వర్ స్టార్‌ డస్ట్‌, ఎన్‌ఛాంటెడ్‌ గ్రీన్‌ కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది.

Best 5 Smartphones under Rs8000 price in india

రెడ్‌మి A4 5G స్మార్ట్‌ఫోన్‌ :
ఈ ఫోన్‌లో (Redmi A4 5G Smartphone) అమెజాన్‌లో 4GB/64GB ధర రూ.7499, 4GB/128GB ధర రూ.8299, రూ.8999 గా ఉంది. ఈ హ్యాండ్‌సెట్ గ్లాస్‌ బ్యాక్‌ ప్యానల్‌ను కలిగి ఉంది. మరియు 6.88 అంగుళాల HD+ IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది.

ఈ ఫోన్ 4nm స్నాప్‌డ్రాగన్‌ 4s జెన్‌ 2 ప్రాసెసర్‌, ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత HyperOS పైన పనిచేస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ 18W ఛార్జింగ్ సపోర్టుతో 5160mAh బ్యాటరీతో పనిచేస్తుంది. కెమెరా విభాగం పరంగా 50MP ప్రైమరీ కెమెరా, మరో కెమెరా, 5MP సెల్ఫీ కెమెరాలను కలిగి ఉంది.

మోటోరోలా G05 స్మార్ట్‌ఫోన్ :
ఫ్లిప్‌కార్ట్‌లో 4GB/64GB వేరియంట్‌ ధర రూ.6999 గా ఉంది. ఈ ఫోన్ (Motorola G05 Smartphone) 6.67 అంగుళాల LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్‌ వేగాన్‌ లెదర్‌ ఫినిష్‌ను కలిగి ఉంది. 18W వైర్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5200mAh బ్యాటరీతో పనిచేస్తోంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌ మీడియాటెక్‌ హీలియో G81 Extreme SoC ప్రాసెసర్‌, ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత Hello UI పైన పనిచేస్తోంది. కెమెరా విభాగం పరంగా క్వాడ్‌ పిక్సల్‌ టెక్నాలజీతో 50MP ప్రైమరీ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరాను అమర్చారు.

Best 5 Smartphones under Rs8000 price in india

వివో Y19e స్మార్ట్‌ఫోన్ :
వివో వెబ్‌సైట్‌లో 4GB/64GB వేరియంట్ ధర రూ.7970 గా ఉంది. ఈ ఫోన్‌ (Vivo Y19e SmartPhone) 6.74 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. SGS, మిలిటరీ గ్రేడ్‌ సర్టిఫికేషన్‌లను కలిగి ఉంది. Unisoc T7225 ప్రాసెసర్‌, ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత Funtouch OS 14 పైన పనిచేస్తోంది.

కెమెరా విభాగం పరంగా 13MP, 5MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. 15W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5500mAh బ్యాటరీని కలిగి ఉంది. దీంతోపాటు అనేక ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఫీచర్‌లను కలిగి ఉంది. IP64 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది.

రెడ్‌మి A5 స్మార్ట్‌ఫోన్ :
అమెజాన్‌లో రూ.3GB/64GB ధర రూ.6,478, 4GB/128GB ధర రూ.7498 గా ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ 6.88 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. Unisoc T7250 చిప్‌సెట్‌, ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత Go Edition OS పైన పనిచేస్తోంది.

కెమెరా విభాగం పరంగా 32MP ప్రైమరీ కెమెరా, మరో లెన్స్‌, 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్‌ (Redmi A5 Smartphone) 15W ఛార్జింగ్‌ సపోర్టుతో 5200mAh బ్యాటరీని కలిగి ఉంది.

Best Mobiles in India

English summary
Top 5 Smartphones under Rs8000 Price in india here is the list and sale details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X