భారత్‌లో లభ్యమవుతోన్న5 పెద్ద డిస్‌ప్లే ఫోన్‌‍లు

|

స్మార్ట్‌ఫోన్ మనిషి జీవన విధానాలనే మార్చేసింది. నేటి కమ్యూనికేషన్ ప్రపంచంలో క్రియాశీలక పాత్ర పోషిస్తోన్న స్మార్ట్‌ఫోన్ మానవ సంబంధాల పై తీవ్రంగాప్రభావం చూపుతోంది. సన్నిహితులు, మిత్రులు, బంధువులు, కుటుంబ సభ్యులు ఇలా ఎవరి దగ్గర చూసినా స్మార్ట్‌ఫోన్‌లు కనిపిస్తున్నాయి. మొబైల్ కమ్యూనికేషన్, పోర్టబుల్ కంప్యూటింగ్, సోషల్ మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ ఇలా అనేక అవసరాలను స్మార్ట్‌ఫోన్ తీరుస్తున్న నేపధ్యంలో వీటిని వినియోగించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. వినియోగదారుల అభిరుచులను దృష్టిలో ఉంచుకుని స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు అనేక మోడళ్లలో స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లో పెడుతున్నాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా భారత్ మార్కెట్లలో లభ్యమవుతున్న 5 పెద్ద డిస్‍‌‌ప్లే స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం....

 

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

భారత్‌లో లభ్యమవుతోన్న5 పెద్ద డిస్‌ప్లే ఫోన్‌‍లు

భారత్‌లో లభ్యమవుతోన్న5 పెద్ద డిస్‌ప్లే ఫోన్‌‍లు

LG G3

ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం పై స్పందించే జీ3 స్మార్ట్ మొబైలింగ్ డివైస్‌లో 5.5 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ డిస్‌ప్లేను ఏర్పాటు చేసారు. ఫోన్ వెనుక భాగంలో ఏర్పాటు చేసిన 12 మెగా పిక్సల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజైషన్ కెమెరా ఆకట్టుకుంటుంది. వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు ఫోన్ ముందు భాగంగా 2.1 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా వ్యవస్థను ఏర్పాటు చేసారు. 16 ఇంకా 32జీబి మెమరీ వేరియంట్ లలో జీ3 లభ్యమవుతోంది. మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకోవచ్చు. 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ ఫోన్‌కు శక్తిని సమకూరుస్తుంది. ఫోన్ ధర రూ.47,000.

 

భారత్‌లో లభ్యమవుతోన్న5 పెద్ద డిస్‌ప్లే ఫోన్‌‍లు
 

భారత్‌లో లభ్యమవుతోన్న5 పెద్ద డిస్‌ప్లే ఫోన్‌‍లు

Oppo Find 7

మార్కెట్లో ఇటీవల విడుదలైన ఓపో ఫైండ్ 7 స్మార్ట్‌ఫోన్ ఫీచర్లను పరిశీలించినట్లయితే.. 5.5 అంగుళాల ఐపీఎస్ ప్యానల్, క్వాడ్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 2560 x 1440పిక్సల్స్, 539 పీపీఐ పిక్సల్ డెన్సిటీ), గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 2.5గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 801 క్వాడ్‌కోర్ (ఎమ్ఎస్ఎమ్8974ఏసీ) సాక్, అడ్రినో 330 గ్రాఫిక్ యూనిట్, 3జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.3 ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా రూపొందించిన కంపెనీ ప్రొప్రైటరీ ఆపరేటింగ్ సిస్టం పై డివైస్ రన్ అవుతుంది. 13 మెగా పిక్సల్ కెమెరా (సోనీ ఐఎమ్ఎక్స్214 సీఎమ్ఓఎస్ సెన్సార్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), కనెక్టువిటీ ఫీచర్లు (యూఎస్బీ, బ్లూటూత్, 5జీ వై-ఫై, జీపీఎస్, గ్లోనాస్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేన్), 3000 ఎమ్ఏహెచ్ లై-పో బ్యాటరీ. ఫోన్ ధర రూ.37,000.

 

భారత్‌లో లభ్యమవుతోన్న5 పెద్ద డిస్‌ప్లే ఫోన్‌‍లు

భారత్‌లో లభ్యమవుతోన్న5 పెద్ద డిస్‌ప్లే ఫోన్‌‍లు

Asus ZenFone 6

అసుస్ జెన్‌ఫోన్ 6 కీలక స్పెసిఫికేషన్‌‌లను పరిశీలించినట్లయితే... 6 అంగుళాల కెపాసిటివ్ మల్టీటచ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), 2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ఇంటెల్ ఆటమ్ జెడ్2580 ప్రాసెసర్, పవర్ వీఆర్‌ఎస్ జీఎక్స్ 544 ఎంపీ2 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం (ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ అప్ గ్రేడబుల్), జెన్ యూజర్ ఇంటర్‌ఫేస్, డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ (మైక్రోసిమ్), 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 9.9 మిల్లీమీటర్ల మందం, బరువు 196 గ్రాములు, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 3జీ HSPA+, వై-ఫై 802.11 బీ/జీ/ఎన్), బ్లూటూత్ 4.0, జీపీఎస్ కనెక్టువిటీ, 3300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ ధర రూ.16,990.

 

భారత్‌లో లభ్యమవుతోన్న5 పెద్ద డిస్‌ప్లే ఫోన్‌‍లు

భారత్‌లో లభ్యమవుతోన్న5 పెద్ద డిస్‌ప్లే ఫోన్‌‍లు

Sony Xperia T2 Ultra

సోనీ ఎక్స్‌పీరియా టీ2 అల్ట్రా కీలక స్పెసిఫికేషన్‌లు... 6 అంగుళాల హైడెఫినిషన్ ట్రైలూమినస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 720 x 1080పిక్సల్స్), 1.4గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, అడ్రినో 305 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (సోనీ ఎక్స్‌‍మార్ ఆర్ఎస్ సెన్సార్, ఎల్ఈడి ఫ్లాష్, 1080 పిక్సల్ వీడియో రికార్డింగ్), 1.1 మెగా పిక్సల్ హైడెఫినిషన్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 4జీ ఎల్టీఈ, 3జీ కనెక్టువిటీ, వై-ఫై, బ్లూటూత్, డ్యుయల్ సిమ్ స్లాట్, 3000ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ ధర రూ.23,000.

 

భారత్‌లో లభ్యమవుతోన్న5 పెద్ద డిస్‌ప్లే ఫోన్‌‍లు

భారత్‌లో లభ్యమవుతోన్న5 పెద్ద డిస్‌ప్లే ఫోన్‌‍లు

Micromax Canvas Gold A300

మైక్రోమాక్స్ గోల్డ్ ఎ300 స్మార్ట్‌ఫోన్ కీలక స్పెసిఫికేషన్లు క్లుప్తంగా... పూర్తి హైడెఫినిషన్ రిసల్యూషన్‌తో కూడిన 5.5 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ సామర్థ్యం 1920 x 1080పిక్సల్స్), 2గిగాహెట్జ్ ఆక్టా కోర్ మీడియాటెక్ ఎంటీ6592టీ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 16 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), కనెక్టువిటీ ఫీచర్లు (3జీ HSPA+, వై-ఫై 802.11 b/g/n, బ్లూటూత్ 4.0, డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ), 32జీబి ఇంటర్నల్ మెమరీ, 2300ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Best Mobiles in India

English summary
Top 5 Smartphones with Biggest Displays to Buy in India. Read more in Telugu Gizbot....

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X