ఈ జూన్‌లో పరిచయంకానున్న 5 అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లు!

|

ప్రస్తుత రోజుల్లో స్మార్ట్‌ఫోన్ ఎంపిక ఆషామాషీ కాదు. వందల కొలది మోడళ్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఏది మంచిదో తెలుసుకోవటానికి ఆన్‌లైన్ వెబ్‌సైట్‌‍లను ఆశ్రయించాల్సిన పరిస్థితులు నెలకున్నాయి.

 

స్మార్ట్‌ఫోన్‌ను ఎంపిక చేసుకునే ముందు సదరు డివైజ్ ఆపరేటింగ్ సిస్టంకు సంబంధించి ఓ అవగాహనకు రండి. ప్రస్తుత మార్కెట్లో ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఓఎస్ కొత్తదిగా ఉంది. మరో వైపు యాపిల్ ఐవోఎస్, బ్లాక్‍‌బెర్రీ 10 ఇంకా విండోస్ 8 ఓఎస్ ఆధారిత డివైజ్‌లు లభ్యమవుతున్నాయి. వివిధ స్ర్కీన్ వేరియంట్‌లతో కూడిన స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. స్మార్ట్‌ఫోన్ స్ర్కీన్ పొడవు 4 అంగుళాల ఉన్నట్లయితే ఇంటర్నెట్ సర్ఫింగ్ ఇంకా స్ర్కీన్ రిసల్యూషన్ బాగుంటుంది. కంపెనీ బట్టి స్మార్ట్‌ఫోన్ క్వాలిటీ ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఫోన్ ఎంపిక సంబంధించి ముందుగానే బ్రాండ్ ఎంచుకోండి. మీరు కొనుగోలు చేయబోయే స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి బ్యాటరీ బ్యాకప్ విషయంలో ముందుగానే ఓ నిర్థిష్ట అవగాహనకు రండి. మీ ట్యాబ్లెట్ 4000ఎమ్ఏహెచ్ సామర్ధ్యం గల బ్యాటరీని కలిగి ఉన్నట్లయితే ప్రయాణాల్లో సైతం బేషుగ్గా స్పందిస్తుంది.

నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఈ జూన్‌లో ప్రపంచనాకి పరిచయం కాబోతున్న 5 అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లను మీకు పరిచయం చేస్తున్నాం.

ఈ జూన్‌లో పరిచయంకానున్న 5 అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లు!

ఈ జూన్‌లో పరిచయంకానున్న 5 అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లు!

1.) ఐఫోన్ 5ఎస్ (iPhone 5S):

ఐఫోన్5కు సక్సెసర్ వర్సన్‌గా విడుదల కాబోతున్న ఐఫోన్ 5ఎస్‌ను యాపిల్ జూన్ 10న ఆవిష్కరించనుంది. స్పెసిఫికేషన్‌ల అంచనా:

4 అంగుళా‌ల డిస్‌ప్లే,
ఏ7ఎక్స్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్, ఫింగర్ ప్రింట్ సెన్సార్,
12 మెగా పిక్సల్ కెమెరా,
మెరుగైన బ్యాటరీ లైఫ్,
4జీ ఎల్‌టీఈ కనెక్టువిటీ,
3జీ, వై-ఫై.

 

 ఈ జూన్‌లో పరిచయంకానున్న 5 అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లు!

ఈ జూన్‌లో పరిచయంకానున్న 5 అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లు!

2.) సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 జూమ్:

గెలాక్సీ ఎస్4 విడుదలతో మంది జోష్ మీదున్న సామ్‌సంగ్ కెమెరా ప్రియుల కోసం గెలాక్సీ ఎస్4జూమ్ పేరుతో సరికొత్త హ్యాండ్‌సెట్‌ను ఆవిష్కరించనుంది. ఈ డివైజ్‌ను కెమెరా అలానే స్మార్ట్‌ఫోన్‌లా ఉపయోగించుకోవచ్చు. ఫీచర్లు:

16 మెగా పిక్సల్ కెమెరా (10ఎక్స్ జూమ్),
4.3 అంగుళాల డిస్‌ప్లే,
1.6గిగాహెట్జ్ డ్యూయల్-కోర్ ప్రాసెసర్,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం.

 

ఈ జూన్‌లో పరిచయంకానున్న 5 అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లు!
 

ఈ జూన్‌లో పరిచయంకానున్న 5 అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లు!

3.) తక్కువ ధర ఐఫోన్:

ఇండియా, చైనా ఇంకా లాటిన్ అమెరికా మార్కెట్ల పై దృష్టిసారించిన యాపిల్ బడ్జెట్ బ్రెండ్లీ ధరల్లో యాపిల్ ఫోన్‌లను ఉత్పత్తి చేసేందుకు సిద్ధమవుతున్న సమాచారం. ఓ తక్కువ ధర యాపిల్ ఐఫోన్‌కు సంబంధించిన సమాచారాన్ని త్వరలో జరిగే డబ్ల్యూడబ్ల్యూడీసీ 2013 కార్యక్రమంలో యాపిల్ ప్రకటించనుందట.

 

 ఈ జూన్‌లో పరిచయంకానున్న 5 అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లు!

ఈ జూన్‌లో పరిచయంకానున్న 5 అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లు!

4.) హెచ్‌టీసీ వన్ మినీ ఎమ్4 (HTC One Mini M4):

వివాదస్పద ఫోన్ హెచ్‌టీసీ వన్‌కు మినీ వర్షన్‌గా హెచ్‌టీసీ వన్ మీనీ ఎమ్4‌ను హెచ్‌టీసీ ఈ నెలలో విడుదల చేయనుంది. ఫీచర్లను పరిశీలించినట్లయితే..... 4.3 అంగుళాల 720 పిక్సల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే, డ్యూయల్-కోర్ ప్రాసెసర్, అల్ట్రాపిక్సల్ కెమెరా
మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

 

ఈ జూన్‌లో పరిచయంకానున్న 5 అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లు!

ఈ జూన్‌లో పరిచయంకానున్న 5 అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లు!

5.) సోనీ ఎక్స్‌పీరియా జడ్ యూ:

ఎక్స్‌పీరియా జడ్ యూ పేరుతో సరికొత్త ఫాబ్లెట్‌ను సోనీ ఈ నెల 25న ఆవిష్కరించనుంది. డివైజ్ ఫీచర్లను పరిశీలించినట్లియతే...6.44 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్800 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, ఎస్ పెన్, 4జీ ఎల్ టీఈ కనెక్టువిటీ.

 

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X