త్వరలో విడుదల కాబోతున్న 5 క్యూహెచ్‌డి డిస్‌ప్లే స్మార్ట్‌ఫోన్‌లు

Posted By:

కమ్యూనికేషన్ ప్రపంచంలో క్రియాశీలక పాత్రపోషిస్తోన్న స్మార్ట్‌ఫోన్‌లు మారుమూల ప్రాంతాలకు సైతం విస్తరిస్తున్నాయి. వినియోగదారుల అభిరుచులను దృష్టిలో ఉంచుకుని పూటకో కొత్త మోడల్ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీలు అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే క్వాలిటీని మరింత పటిష్టం చేస్తూ యాపిల్ కంపెనీ 2010లో రెటీనా డిస్‌ప్లే కలిగిన ఐఫోన్ 4ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ఆ తరువాతి కాలంలో యాపిల్‌ను అనుసరిస్తూ అనేక అంతర్జాతీయ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు హైక్వాలిటీ డిస్‌ప్లే స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకురావటం జరిగింది. 2014 క్యూహైడెఫినిషన్ డిస్‌ప్లే స్మార్ట్‌ఫోన్‌లకు వేదికగా నిలిచింది. క్యూహెచ్‌డి డిస్‌ప్లేలు 2560 x 1440పిక్సల్ రిసల్యూషన్‌ను కలిగి ఉంటాయి. 720 పిక్సల్ హైడెఫినిషన్ డిస్‌ప్లేతో పోలిస్తే ఇది నాలుగు రెట్లు అధికమనమాట. ప్రస్తుతం మార్కెట్లో లభ్యమవుతున్న ఎల్‌జీ జీ3 స్మార్ట్‌ఫోన్ క్యూహైడెఫినిషన్ స్ర్కీన్‌తో లభ్యమవుతోంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా త్వరలో విడుదల కాబోతున్న 5 క్యూహెచ్‌డి డిస్‌ప్లే స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం....

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Samsung Galaxy Note 4

త్వరలో విడుదల కాబోతున్న 5 క్యూహెచ్‌డి డిస్‌ప్లే స్మార్ట్‌ఫోన్‌లు

Samsung Galaxy Note 4

క్వాడ్ హైడెఫినిషన్ అమోల్డ్ డిస్‌ప్లే‌తో ఈ ఫాబ్లెట్ లభ్యంకానుంది. ఐఎఫ్ఏ 2014 టెక్నాలజీ ప్రదర్శనలో సామ్‌సంగ్ ఈ డివైస్‌ను ఆవిష్కరించనుంది.

 

Google Nexus 6

త్వరలో విడుదల కాబోతున్న 5 క్యూహెచ్‌డి డిస్‌ప్లే స్మార్ట్‌ఫోన్‌లు

Google Nexus 6

5.2 అంగుళాల క్యూహైడెఫినిషన్ డిస్‌ప్లేతో ఈ ఫోన్ లభ్యంకానుంది. విడుదల తేదీ తెలియాల్సి ఉంది.

 

HTC One Max 2

త్వరలో విడుదల కాబోతున్న 5 క్యూహెచ్‌డి డిస్‌ప్లే స్మార్ట్‌ఫోన్‌లు

HTC One Max 2

క్వాడ్ హైడెఫినిషన్ స్ర్కీన్‌తో ఈ ఫోన్ లభ్యంకానుంది. 18.8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాతో లభ్యంకానున్న ఈ ఫోన్ విడుదల తేదీ ఖరారు కావల్సి ఉంది.

 

Alcatel One Touch D820

త్వరలో విడుదల కాబోతున్న 5 క్యూహెచ్‌డి డిస్‌ప్లే స్మార్ట్‌ఫోన్‌లు

Alcatel One Touch D820

4.6 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ డిస్‌ప్లేతో ఈ ఫోన్ అందుబాటలోకి రానుంది. 3జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, క్వాడ్‌కోర్ మీడియాటెక్ ఎంటీ6795 ప్రాసెసర్ వంటి శక్తివంతమైన స్పెసిఫికేషన్‌లు ఈ ఫోన్‌లో ఉన్నట్లు రూమర్స్ మిల్స్ అంచనా.

 

Huawei Ascend Mate 7

త్వరలో విడుదల కాబోతున్న 5 క్యూహెచ్‌డి డిస్‌ప్లే స్మార్ట్‌ఫోన్‌లు

Huawei Ascend Mate 7

క్వాడ్ హైడెఫినిషన్ డిస్‌ప్లే వేరియంట్‌లో ఈ ఫోన్ లభ్యంకానుంది. 13 మెగా పిక్సల్ కెమెరా, ఆక్టా కోర్ కిరిన్ 920 ప్రాసెసర్, 3జీబి ర్యామ్ వంటి శక్తివంతమైన స్పెసిఫికేషన్‌లను ఈ ఫోన్‌లో ఉంచినట్లు సమాచారం.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top 5 Upcoming Smartphones With QHD Displays. Read more in Telugu Gizbot......
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting