ధర రూ.10,000 కంటే తక్కువ ధరలో 5G స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా. ఈ లిస్ట్ చెక్ చేయండి!
భారత్ మార్కెట్‌లో స్మార్ట్‌ఫోన్‌లకు భారీ డిమాండ్ ఉంది. అన్‌లిమిటెడ్ డేటా ప్లాన్‌లు అందుబాటులోకి వచ్చాక.. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య పెరిగింది. దీంతోపాటు ప్రైవేటు టెలికాం సంస్థలు 5G నెట్‌వర్క్‌లు ఇప్పటికే 5G నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఫలితంగా అనేక మంది 5G స్మార్ట్‌ఫోన్‌లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం అనేక సంస్థలు రూ.10,000 కంటే తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్‌లను అందుబాటులోకి (5G Smartphones Under RS10,000) తీసుకొచ్చాయి.
ప్రస్తుతం రూ.10,000 కంటే తక్కువ ధరలో అందుబాటులో ఉన్న కొన్ని 5G స్మార్ట్‌ఫోన్ల స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు, ధర, సేల్ వివరాలు. ఈ జాబితాలో శాంసంగ్, వివో, మోటోరోలా, ఐకూ, లావా వంటి బ్రాండ్‌ల హ్యాండ్‌సెట్‌లు ఉన్నాయి. ప్రముఖ ఇ-కామర్స్ సంస్థలు సహా సంస్థల అధికారిక వెబ్‌సైట్‌లో ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి.

శాంసంగ్ గెలాక్సీ A14 5G స్మార్ట్‌ఫోన్ : ఈ స్మార్ట్‌ఫోన్ (Samsung Galaxy A14 5G) 6.6 అంగుళాల FHD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. Exynos 1330 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. వెనుకవైపు 50MP+ 2MP+ 2MP కెమెరాలు సహా 13MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది.
ఫ్లిప్‌కార్ట్‌లో ఈ హ్యాండ్‌సెట్ 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ ధర రూ.8999, 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.9999 గా ఉంది. అదే 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.10999 గా ఉంది. లైట్ గ్రీన్, బ్లాక్, డార్క్ రెడ్ రంగుల్లో లభిస్తుంది.

వివో T3 లైట్ 5G : ఈ స్మార్ట్‌ఫోన్ (Vivo T3 Lite 5G) 6.56 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత Funtouch OS 14, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. వెనుకవైపు 50MP + 2MP కెమెరాలు, మరియు 8MP సెల్ఫీ కెమెరాలను కలిగి ఉంది.
ఫ్లిప్‌కార్ట్‌లో 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.10,499 గా ఉంది. అదే 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.11,499 గా ఉంది. అన్ని బ్యాంకు కార్డులపై రూ.500 తగ్గింపు ధరను పొందవచ్చు. ఫలితంగా రూ.9999 కే 4GB ర్యామ్ వేరియంట్‌ను కొనుగోలు చేయవచ్చు.

రెడ్‌మి 13C 5G : స్మార్ట్‌ఫోన్ (Redmi 13C 5G) 6,74 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 13 ఆధారిత MIUI 14 OS, మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. వెనుకవైపు 50MP AI + 2MP, 8MP సెల్ఫీ కెమెరాలను కలిగి ఉంది. 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది.
ఫ్లిప్‌కార్ట్‌లో ఈ హ్యాండ్‌సెట్ 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.9199 గా ఉంది. 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.10999 గా ఉంది. అదే 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.12999 గా ఉంది. బ్లాక్, గ్రీన్, సిల్వర్ రంగుల్లో లభిస్తుంది.

ఇన్ఫినిక్స్ హాట్ 50 5G : ఈ స్మార్ట్‌ఫోన్ (Infinix Hot 50 5G) 6.7 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. మీడియోటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో పనిచేస్తోంది. వెనుకవైపు 48MP ప్రైమరీ కెమెరా సహా మరో డెప్త్ సెన్సార్‌ను అమర్చారు. అదే ముందువైపు 8MP సెల్ఫీ కెమెరాలను కలిగి ఉంది. 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీపైన పనిచేస్తుంది.
ఫ్లిప్‌కార్ట్‌లో ఈ హ్యాండ్‌సెట్ 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.9,999 గా ఉంది. 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.10,999 గా ఉంది. sage గ్రీన్, స్లీక్ బ్లాక్, వైబ్రంట్ బ్లూ రంగుల్లో ఈ ఇన్ఫినిక్స్ హాట్ 50 5G స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉంది.


Click it and Unblock the Notifications








