Best Battery Smartphones భారీ బ్యాటరీ 5G స్మార్ట్‌ఫోన్‌ల కోసం చూస్తున్నారా.. అయితే ఈ ఫోన్‌లు మీకోసమే..!
భారత్‌లో స్మార్ట్‌ఫోన్ యూజర్లు గణనీయంగా ఉన్నారు. అయితే వివిధ ప్రాధాన్యతల ఆధారంగా ఫోన్‌లను కొనుగోలు చేస్తున్నారు. అనేక మంది భారీ బ్యాటరీ, బెస్ట్ కెమెరా, శక్తివంతమైన చిప్‌సెట్, గేమింగ్ ఫోన్లపై మొగ్గు చూపుతున్నారు. అయితే ఇటీవల కాలంలో ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లు భారీ బ్యాటరీలతో ఫోన్‌లను (large battery Smartphones) లాంచ్ చేస్తున్నారు. ఏప్రిల్ నెలలో ఐకూ 7300mAh బ్యాటరీతో ఐకూ Z10 ఫోన్‌ను లాంచ్ చేసింది. అనంతరం అనేక సంస్థలు భారీ బ్యాటరీలతో ఫోన్‌లను తీసుకొచ్చాయి.
ప్రస్తుతం భారత మార్కెట్‌లో 7000mAh లేదా అంతకంటే ఎక్కువ బ్యాటరీలతో అనేక ఫోన్‌లు ఉన్నాయి. ఈ జాబితాలో ఐకూ Z10, వివో T4, ఒప్పో K13 5G, రియల్‌మి GT 7 సిరీస్, ఐకూ నియో 10, పోకో F7 5G ఫోన్‌లు ఉన్నాయి.

ఐకూ Z10 స్మార్ట్‌ఫోన్ - 7300mAh బ్యాటరీ :
ఐకూ Z10 స్మార్ట్‌ఫోన్ ఏప్రిల్ నెలలో విడుదల అయింది. ఈ ఫోన్ ఏకంగా 90W ఛార్జింగ్ సపోర్టుతో 7300mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్‌ను సింగిల్ ఛార్జింగ్‌తో 52 గంటల వరకు కాల్స్ మాట్లాడుకోవచ్చని ఐకూ తెలిపింది. సుమారు రెండు రోజులపాటు బ్యాటరీ లైఫ్ వచ్చే అవకాశం ఉంది. ఈ ఫోన్ కేవలం 199 గ్రాముల బరువును మాత్రమే కలిగి ఉంది. మరియు కేవలం 7.89mm థిక్‌నెస్‌ను కలిగి ఉంది.
ఈ ఫోన్ 6.77 అంగుళాల FHD+ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్, 5000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఐకూ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 2 చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch OS 15 ను కలిగి ఉంది. ఈ ఫోన్ 2 సంవత్సరాల వరకు OS అప్‌డేట్స్, 3 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ పొందవచ్చు.

కెమెరా విభాగం పరంగా 50MP సోనీ IMX882 ప్రైమరీ కెమెరా (OIS), 2MP సెకండరీ కెమెరా, 32MP సెల్ఫీ కెమెరాలను కలిగి ఉంది. AI Erase, AI సూపర్ డాక్యుమెంట్, AI సర్కిల్ టూ సెర్చ్, AI నోట్ అసిస్ట్ ఫీచర్‌లను కలిగి ఉంది. IP65 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. మిలిటరీ గ్రేడ్ MIL STD 810H సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది.
ఐకూ Z10 స్మార్ట్‌ఫోన్ (iQOO Z10) 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.21998, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.23998, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.25998 గా ఉంది. ఈ ఫోన్ గ్లేసియర్ సిల్వర్, స్టెల్లర్ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది.
వివో T4 స్మార్ట్‌ఫోన్ 5G - 7300mAh బ్యాటరీ :
ఈ ఫోన్ (Vivo T4) కూడా ఏప్రిల్ నెలలోనే విడుదల అయింది. రూ.20 వేల ధరలో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ కూడా 90W వైర్ ఫ్లాష్ ఛార్జింగ్ మరియు రివర్స్ ఛార్జింగ్, బైపాస్ ఛార్జింగ్ సపోర్టుతో 7300mAh బ్యాటరీతో అందుబాటులో ఉంది. 65 నిమిషాల్లో 100 శాతం ఛార్జింగ్‌ను పూర్తి చేయవచ్చని వివో వెల్లడించింది.
ఈ స్మార్ట్‌ఫోన్ 6.77 అంగుళాల ఫుల్ HD+ అమోలెడ్ క్వాడ్ కర్వడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రీఫ్రెష్ రేట్, 5000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 SoC చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch OS 15 తో పనిచేస్తోంది.

కెమెరా విభాగం పరంగా 50MP ప్రైమరీ కెమెరా (OIS), 2MP సెకండరీ కెమెరా, 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ AI Erase, AI Photo Enhance, Live Text, AI Note Assistant, AI Super Document, సర్కిల్ టూ సెర్చ్ వంటి ఫీచర్‌లను కలిగి ఉంది.
వివో T4 5G స్మా్ర్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.21999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.23999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.25999 గా ఉంది. ఈ ఫోన్ ఎమరాల్డ్ బ్లేజ్, ఫాంటమ్ గ్రే కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.
ఒప్పో k13 5G స్మార్ట్‌ఫోన్ - 7000mAh బ్యాటరీ :
ఒప్పో K13 5G స్మార్ట్‌ఫోన్ (OPPO K13 5G) 80W Supervooc ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 7000mAh బ్యాటరీని కలిగి ఉంది. 100 శాతం ఛార్జింగ్‌ను 56 నిమిషాల్లో పూర్తి చేస్తుందని ఒప్పో చెబుతోంది. ఈ ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.17999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.19999 గా ఉంది.
ఈ ఒప్పో ఫోన్ 6.7 అంగుళాల అమోలెడ్ ఫ్లాట్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 4nm స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 చిప్‌సెట్, Adreno A810 GPU ను కూడా కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత ColorOS 15 ను కలిగి ఉంది. ఈ ఫోన్ 6000mm Sq గ్రాఫైట్ షీట్, 5700mm Sq వేపర్ కూలింగ్ ఛాంబర్, ఒప్పో AI ట్రినిటీ ఇంజిన్‌ను కూడా కలిగి ఉంది.

కెమెరా విభాగం పరంగా 50MP ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరా, 16MP సోనీ IMX480 సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. AI Eraser 2.0, AI Blur, AI Reflection remover, WiFi యాంటెనా, AI LinkBoost 2.0 టెక్నాలజీతో అందుబాటులో ఉంది.
రియల్‌మి GT 7 సిరీస్ - 7000mAh బ్యాటరీ :
ఈ సిరీస్‌లో భాగంగా రియల్‌మి GT 7, GT 7T తోపాటు GT 7 డ్రీమ్ ఎడిషన్ కూడా విడుదల అయింది. రియల్‌మి GT 7 స్మార్ట్‌ఫోన్ 120W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 7000mAh బ్యాటరీని కలిగి ఉంది. కేవలం 40 నిమిషాల్లో 1-100 శాతం ఛార్జింగ్‌ను పూర్తి చేయవచ్చని రియల్‌మి చెబుతోంది.
రియల్‌మి GT 7 స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్, 6000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ తో 6.78 అంగుళాల 1.5K అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 4nm మీడియాటెక్ డైమెన్సిటీ 9400e చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత Realme UI 6.0 పైన పనిచేస్తోంది.
కెమెరా విభాగం పరంగా 50MP సోనీ IMX906 ప్రైమరీ కెమెరా (OIS), 50MP టెలిఫోటో కెమెరా, 8MP అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 32MP సెల్ఫీ కెమెరాలను కలిగి ఉంది. ఈ ఫోన్ PUBG, BGMI వంటి గేమింగ్ సమయంలో 120fps గా ఉంటుంది.

రియల్‌మి GT 7 స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.39,999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.42,999, 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.46,999 గా ఉంది. అయితే డ్రీమ్ ఎడిషన్ కూడా ఇదే తరహా స్పెసిఫికేషన్‌లను కలిగి ఉంది. డిజైన్‌లో కొన్ని మార్పులను గమనించవచ్చు.
రియల్‌మి GT 7T స్మార్ట్‌ఫోన్ 6.8 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 8400 Max చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత Realme UI 6.0 ను కలిగి ఉంది. 120W ఛార్జింగ్ సపోర్టుతో 7000mAh భారీ బ్యాటరీని కలిగి ఉంది.
కెమెరా విభాగం పరంగా 50MP సోనీ IMX896 ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.34,999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.37,999, 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ ధర రూ.41,999 గా ఉంది.

ఐకూ నియో 10 స్మార్ట్‌ఫోన్ - 7000mAh బ్యాటరీ :
ఈ ఫోన్ (iQOO Neo 10) 120W వైర్ ఛార్జింగ్ సపోర్టుతో 7000mAh భారీ బ్యాటరీని కలిగి ఉంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేసి సుమారు రెండు రోజుల వరకు వినియోగించుకోవచ్చు. 6.78 అంగుళాల 1.5k అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇన్‌ఫెర్నో రెడ్, టైటానియం క్రోమ్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.
ఈ ఫోన్ భారీ బ్యాటరీతోపాటు రెండు చిప్‌సెట్‌లపైన పనిచేస్తుంది. స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 తోపాటు గేమింగ్ కోసం Q1 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత FuntouchOS 15 ను కలిగి ఉంది. మరియు అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లను కలిగి ఉంది.
కెమెరా విభాగం పరంగా 50MP సోనీ IMX882 ప్రైమరీ కెమెరా (OIS), 8MP అల్ట్రావైడ్ కెమెరా, 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.31999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.33999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.35999, 16GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.40999 గా ఉంది.
పోకో F7 5G స్మార్ట్‌ఫోన్ - 7550mAh బ్యాటరీ :
ఈ ఫోన్ (Poco F7 5G) దేశంలోనే అతిపెద్ద బ్యాటరీతో అందుబాటులోకి వచ్చింది. 90W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్, 22.5W వైర్ రివర్స్ ఛార్జింగ్ సపోర్టుతో 7550mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీని కలిగి ఉంది. మరియు భారీ డిస్‌ప్లేను కూడా కలిగి ఉంది. ఈ ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.83 అంగుళాల FHD+ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది.
పోకో F7 5G స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 SoC చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత HyperOS 2.0 ను కలిగి ఉంది. 3D IceLoop సిస్టమ్‌ను కలిగి ఉంది. కెమెరా విభాగం పరంగా OIS, PDAF సపోర్టుతో 50MP సోనీ IMX882 ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ లెన్స్, 20MP సెల్ఫీ కెమెరాను అమర్చారు.

ఈ ఫోన్ 12GB ర్యా్మ్ + 256GB స్టోరేజీ ధర రూ.31999, 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.33999 గా ఉంది. జులై 1 వ తేదీ నుంచి సేల్ ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.


Click it and Unblock the Notifications








