ఇండియాలోకి 7 చైనా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లు!

|

బ్రాండ్‌తో పనేముంది నచ్చిన ఫీచర్లుంటే చాలనుకునే వారికోసం మార్కెట్లో చైనా ఫోన్‌లు సిద్ధంగా ఉన్నాయి. బ్రాండెడ్ మోడళ్లకు ఏ మాత్రం తీసుపోని విధంగా చైనా హ్యాండ్‌సెట్‌లు ఉంటున్నాయి. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం, నానో సిమ్, హై మెగా పిక్సల్ రేర్ కెమెరా, క్వాలిటీ ఫ్రెంట్ కెమెరా, బ్లూటూత్, వై-ఫై ఇంకా కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ ఫీచర్లను ఒదిగి ఉన్నపలు చైనా స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లో అనధికారికంగా లభ్యమవుతున్నాయి.

ఇండియన్ మార్కెట్లో దూసుకుపోయేందుకు చైనా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లు వ్యూహాలు రచిస్తున్నాయి. గత కొద్ద సంవత్సరాలుగా బ్లాక్ మార్కెట్‌కే పరిమితమైన చైనా ఫోన్‌లను అధికారికంగా విక్రయించేందకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందుకు గాను 7 చైనా బ్రాండ్‌లకు సంబంధించిన ఆఫీస్‌లను ఢిల్లీలో ఏర్పాటు చేయునున్నట్లు సమాచారం. వాటి వివరాలను స్లైడ్ షో రూపంలో మీకందిస్తున్నాం.

స్మార్ట్‌ఫోన్స్ గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇండియాలోకి 7 చైనా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లు!

ఇండియాలోకి 7 చైనా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లు!

జోపో (ZOPO):

‘జోపో'చైనా మార్కెట్లో అతిపెద్ద ఆండ్రాయిడ్ హ్యాండ్‌సెట్ రిటైలర్. ఈ బ్రాండ్‌కు ప్రపంచవ్యాప్తంగా 15 రిటైల్ స్టోర్‌లు ఉన్నాయి. భారత్‌లో జోపో ఇండియా (పి) లిమిటెడ్ క్రింద మొబైల్ ఫోన్‌లను ఉషా ఇన్పోటెక్‌కు పంపిణి చేస్తుంది. ఇప్పటికే జోపో జడ్‌పి900 మోడళ్లో ఓ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో ఆవిష్కరించింది.

ఇండియాలోకి 7 చైనా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లు!

ఇండియాలోకి 7 చైనా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లు!

జియోమీ (Xiaomi):

ఈ మొబైల్ తయారీ కంపెనీ చైనా మార్కెట్లో ఇప్పుడిప్పుడే విస్తరిస్తోంది. తమ వ్యాపారాన్ని మరింత విస్తరించుకునే క్రమంలో జియోమీ భారత మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. వివధ ధర శ్రేణుల్లో స్మార్ట్‌ఫోన్ ఇంకా ఫాబ్లెట్‌లను బ్రాండ్ ఆఫర్ చేయునుంది. తాజాగా జియోమీ, ఎమ్ఐ-2 పేరుతో ఆండ్రాయిడ్ జెల్లీబీన్ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది.

ఇండియాలోకి 7 చైనా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లు!
 
ఇండియాలోకి 7 చైనా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లు!

యూఎమ్ఐ - ఎక్స్1, యూఎమ్ఐ - ఎక్స్2 (Umi-X1and Umi-X2):

ప్రముఖ చైనా బ్రాండ్ యూఎమ్ఐ (UMI) మొబైల్ యూఎమ్ఐ ఎక్స్1, ఎక్స్2 మోడళ్లలో రెండు సరికొత్త హ్యాండ్‌సెట్‌లను ఇటీవల ఇండియన్ మార్కెట్లో ఆవిష్కరించింది. తాజాగా ఈ హ్యాండ్‌సెట్‌లను యూఎమ్ఐ మొబైల్ తన అధికారిక ఫేస్‌బుక్ ఇండియా పేజ్ ద్వారా ఆవిష్కరించింది. వీటిలో యూఎమ్ఐ ఎక్స్1 స్మార్ట్‌ఫోన్ మోడల్ కాగా, యూఎమ్ఏ ఎక్స్2 ఫాబ్లెట్ మోడల్.

ఇండియాలోకి 7 చైనా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లు!

ఇండియాలోకి 7 చైనా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లు!

టీహెచ్ఎల్ (THL):

టెక్నాలజీ హ్యాపీ లైఫ్ (టీహెచ్ఎల్) చైనా మార్కెట్లో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ బ్రాండ్‌కు చైనా వ్యాప్తంగా 300 స్టోర్‌లు ఉన్నాయి. ఇండియన్ మార్కెట్లో చవక ధర ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసే దిశగా టీహెచ్ఎల్ ప్రయత్నాలు సాగిస్తోంది.

ఇండియాలోకి 7 చైనా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లు!

ఇండియాలోకి 7 చైనా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లు!

నియో ఫాబ్లెట్ (Neo Phablet):

ప్రముఖ చైనా బ్రాండ్ నియో, ఇండియన్ ఫాబ్లెట్ మార్కెట్ పై దృష్టిసారించింది. నియో 2003 మోడల్‌లో సరికొత్త ఫాబ్లెట్‌ను బ్రాండ్ త్వరలో విడుదల చేయబోతోంది. ఫీచర్లు: మీడియాటెక్ ఎంటీ6589 క్వాడ్-కోర్ సీపీయూ (క్లాక్ వేగం 1.3గిగాహెట్జ్), 1జీబి ర్యామ్, 3000ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 12 మెగా పిక్సల్ రేర్ కెమరా, 3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా.

ఇండియాలోకి 7 చైనా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లు!

ఇండియాలోకి 7 చైనా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లు!

మోగు (Mogu):

చైనాకు చెందిన మరో బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ ‘మోగు'. ఉత్తమ స్పెసిఫికేషన్‌లతో కూడిన స్మార్ట్ హ్యాండ్‌సెట్‌లను ఈ సంస్థ ఉత్పత్తి చేస్తోంది. మోగు స్మార్ట్‌ఫోన్‌లు త్వరలో ఇండియన్ మార్కెట్లో లభ్యంకానున్నాయి.

ఇండియాలోకి 7 చైనా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లు!

ఇండియాలోకి 7 చైనా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లు!

ఎమ్ఈఐజడ్‌యూ - ఎంఎక్స్- క్వాడ్ - కోర్ (MEIZU-MX-Quad-core):

చైనా కంపెనీ రూపొందించిన ఈ ఫోన్‌ను 2012లో ప్రకటించారు. ఈ స్మార్ట్ హ్యాండ్‌సెట్ గెలాక్సీ ఎస్3, హెచ్‌టీసీ వన్ ఎక్స్‌లతో తలపడగల స్పెసిఫికేషన్‌లను కలిగి ఉంది. ఇండియన్ మార్కెట్లో మిజూ ఎంఎక్స్ క్వాడ్ కోర్ హ్యాండ్‌సెట్ అనధికారికంగా లభ్యమవుతోంది. 32జీబి వేరియంట్ ధర రూ.25,000. 64జీబి వేరియంట్ ధర రూ.33,000.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X