Home
Mobile

అక్టోబర్లో ఇండియా మార్కెట్‌ని శాసించేది ఈ 7 ఫోన్లే !

అక్టోబర్ నెల అంటే మొబైల్ మార్కెట్ కళకళలాడుతుంది. దసరా, దీపావళి పండగలు ఉండటంతో మొబైల్ కంపెనీలు తమ కొత్త ఫోన్లను లాంచ్ చేయడానికి తహతహలాడుతుంటాయి.

By Hazarath

అక్టోబర్ నెల అంటే మొబైల్ మార్కెట్ కళకళలాడుతుంది. దసరా, దీపావళి పండగలు ఉండటంతో మొబైల్ కంపెనీలు తమ కొత్త ఫోన్లను లాంచ్ చేయడానికి తహతహలాడుతుంటాయి. వినియోగదారులు కూడా కొత్త ఫోన్లు ఏం వస్తున్నాయా అని ఎదురుచూస్తుంటారు. ఈ నేపథ్యంలో అక్టోబర్లో మార్కెట్లోకి రానున్న ఫోన్లపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

Google Pixel 2 & Pixel 2 XL

Google Pixel 2 & Pixel 2 XL

సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ గూగుల్ తన నూతన ఫ్లాగ్‌షిప్ ఫోన్లయిన పిక్సల్ 2, పిక్సల్ ఎక్స్‌ఎల్ 2 లను రానున్న అక్టోబర్ నెలలో ఇండియాలో విడుదల చేయనుంది. పిక్సల్ 2 ఫోన్‌లో 4.97 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 64 జీబీ స్టోరేజ్ వంటి ఫీచర్లను, పిక్సల్ ఎక్స్‌ఎల్ 2 ఫోన్‌లో 5.99 ఇంచ్ ఓలెడ్ డిస్‌ప్లే, 128 జీబీ స్టోరేజ్ ఫీచర్లను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిసింది. ఇక రెండింటిలోనూ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్, 4జీబీ ర్యామ్‌లను అందించనున్నట్టు సమాచారం. పిక్సల్ 2 ఫోన్‌ను 3.5ఎంఎం ఆడియో జాక్ లేకుండానే విడుదల చేయాలని గూగుల్ భావిస్తుండగా, పిక్సల్ ఎక్స్‌ఎల్ 2 ఫోన్‌లో మాత్రం జాక్‌ను యథాతథంగా ఉండనివ్వనున్నట్టు తెలిసింది. ఇక రెండు ఫోన్లకు వెనుక భాగంలో కేవలం ఒకే కెమెరాను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిసింది.ధర రూ. 43 వేల నుంచి ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.

Xiaomi Mi MIX 2

Xiaomi Mi MIX 2

షియోమీ త‌న నూతన స్మార్ట్‌ఫోన్ 'ఎంఐ మిక్స్ 2'6 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.32,350 ధ‌ర‌కు ల‌భిస్తుండ‌గా, 6జీబీ ర్యామ్‌, 128 జీబీ ర్యామ్ వేరియెంట్ రూ.35,280 ధ‌ర‌కు, 6 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.39,210 ధ‌ర‌కు ల‌భిస్తున్న‌ది. ఇక 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.46,060 ధ‌ర‌కు ల‌భిస్తున్న‌ది.
షియోమీ ఎంఐ మిక్స్ 2 ఫీచ‌ర్లు
5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 2160 × 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, 2.45 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 835 ప్రాసెస‌ర్‌, 6/8 జీబీ ర్యామ్‌, 64/128/256 జీబీ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 7.1 నూగ‌ట్‌, డ్యుయ‌ల్ సిమ్‌, 12 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌, 4జీ ఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 3400 ఎంఏహెచ్ బ్యాట‌రీ, క్విక్ చార్జ్ 3.0.

మోటో ఎక్స్4

మోటో ఎక్స్4

మోటోరోలా తన నూతన స్మార్ట్‌ఫోన్ 'మోటో ఎక్స్4'ను ఈ నెలలో విడుదల చేయనుంది.
మోటో ఎక్స్4 ఫీచర్లు...
5.2 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 630 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, డ్యుయల్ సిమ్, 12, 8 మెగాపిక్సల్ డ్యుయల్ రియర్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఐపీ68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ బాడీ, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, యూఎస్‌బీ టైప్ సి, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, టర్బో చార్జింగ్.

హానర్ 9

హానర్ 9

4/6 జీబీ ర్యామ్‌, 64/128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ల‌లో విడుద‌ల కానున్న ఈ ఫోన్ వ‌రుస‌గా రూ.21,780, రూ.25,580, రూ.28,415 ధ‌ర‌లకు వినియోగ‌దారుల‌కు ల‌భ్యం కానుంది.
హాన‌ర్ 9 ఫీచ‌ర్లు...
5.15 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ 2.5డి క‌ర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్, ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌, 4/6 జీబీ ర్యామ్‌, 64/128 జీబీ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 7.0 నూగ‌ట్‌, హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్‌, 20, 12 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ రియ‌ర్ కెమెరాలు, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్ఈ, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3200 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌.

ఐఫోన్ ఎక్స్

ఐఫోన్ ఎక్స్

గతంలో వచ్చిన ఎన్నో మోడల్స్‌కు భిన్నంగా, అనేక మార్పులు చేర్పులతో ఆపిల్ తన నూతన ఐఫోన్ X ను తీర్చిదిద్దింది. మొదటి ఐఫోన్ విడుదల చేసి 10 సంవత్సరాలు పూర్తయినందున అందుకు గుర్తుగా రోమన్ అంకె X (X అంటే 10) పేరిట ఐఫోన్ X ను ఆపిల్ విడుదల చేసింది. ఈ నెలలో ఈ ఫోన్ ఇండియాకి రానుంది.

హువాయి మేట్ 10 లైట్

హువాయి మేట్ 10 లైట్

6.0 ఇంచ్ IPS-NEO LCD capacitive touchscreen, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4 HiSilicon Kirin 960 chipset ఆండ్రాయిడ్ ఓఎస్ 128 జిబి ఇంటర్నల్ మెమొరీ 6/7 జిబి ర్యామ్ డ్యూయెల్ 20 ఎంపీ కెమెరా నాన్ రిమూవబుల్ బ్యాటరీ

నోకియా 8

నోకియా 8

నోకియా తొలి హైఎండ్‌ ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ వచ్చేస్తోంది. హెచ్‌ఎండీ గ్లోబల్‌ తాజాగా ‘నోకియా-8' స్మార్ట్‌ఫోన్‌ను గ్లోబల్‌ మార్కెట్‌లో ఆవిష్కరించింది. 6జిబి ర్యామ్ ఫోన్ ఈ నెలలో విడుదల కానుంది. దీని ధర దాదాపుగా రూ.45,000గా (599 యూరోలు) ఉంది. ఇవి వచ్చే నెలలో అందుబాటులోకి రానున్నవి. అయితే ఈ స్మార్ట్‌ఫోన్లను కంపెనీ ఎప్పుడు భారతీయ మార్కెట్‌లో ఆవిష్కరిస్తుందో ప్రకటించలేదు.
ఇక ఇందులో క్విక్‌ చార్జ్, క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 835 ప్రాసెసర్, 3,090 ఎంఏహెచ్‌ బ్యాటరీ, వైర్‌లెస్‌ హెడ్‌సెట్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్‌ మెమరీ, 5.3 అంగుళాల ఐపీఎస్‌ ఎల్‌సీడీ క్యూహెచ్‌డీ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్, 13 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా, 13 ఎంపీ డ్యూయెల్‌ రియర్‌ కెమెరాలు, ఆండ్రాయిడ్‌ 7.1.1 ఓఎస్‌ వంటి పలు ప్రత్యేకతలున్నాయని కంపెనీ వివరించింది.

Best Mobiles in India

English summary
Top 7 Smartphones Coming In October 2017; And A Special Mention Read more at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X