మీరు కొనేందుకు సిద్ధంగా ఉన్న బెస్ట్ Snapdragon 835 స్మార్ట్‌ఫోన్‌లు

|

ప్రముఖ మొబైల్ చిప్‌సెట్‌ల తయారీ కంపెనీ క్వాల్కమ్, Snapdragon 845 పేరిట తన లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ చిప్‌సెట్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. త్వరలో లాంచ్ కాబోతోన్న హై-ఎండ్ ఫోన్‌లలో ఈ ప్రాసెసర్‌ను నిక్షిప్తం చేసే అవకాశం ఉంది. క్వాల్కమ్ నుంచి ఇప్పటి వరకు లాంచ్ అయిన ప్రాసెసర్‌లలో Snapdragon 835 SoC అత్యంత వేగవంతమైనదిగా ఉంది.

10-నానోమీటర్ చిప్‌తో సరికొత్త బెంచ్‌మార్క్...
 

10-నానోమీటర్ చిప్‌తో సరికొత్త బెంచ్‌మార్క్...

నవంబర్ 2016లో విడుదలైన ఈ ప్రాసెసర్ స్మార్ట్‌ఫోన్ ఇండస్ట్రీలో పెను సంచలనానికి తెరతీసింది. 10-నానోమీటర్ చిప్‌తో వచ్చిన ఈ ప్రాసెసర్ తన ఖచ్చితమైన పనితీరుతో సరికొత్త బెంచ్‌మార్క్స్‌ను సృష్టించింది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 835 సాక్‌ను 821 సాక్‌తో కంపేర్ చేసి చూసినట్లయితే సామర్థ్యం పరంగా 30%, పనితీరు పరంగా 27%, బ్యాటరీ పరంగా 40% తక్కువ మొత్తాన్ని ఈ ప్రాసెసర్ ఖర్చు చేస్తుంది. నేటి ప్రత్యేక కథనంలో భాగంగా స్నాప్‌డ్రాగన్ 835 సాక్‌తో మార్కెట్లో లభ్యమవుతోన్న 5 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీకోసం అందిస్తున్నాం..

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్8 (Samsung Galaxy S8)

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్8 (Samsung Galaxy S8)

5.8 అంగుళాల భారీ డిస్‌ప్లేతో వస్తోన్న ఈ స్మార్ట్‌ఫోన్ 1.9 గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్ పై రన్ అవుతుంది. 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వంటి శక్తివంతమైన హార్డ్‌వేర్ వ్యవస్థలను సామ్‌సంగ్ ఈ ఫోన్‌లో పొందుపరిచింది. ఇక కెమెరా విషయానికి వచ్చేసరికి ఫోన్ వెనుక భాగంలో 12 మెగా పిక్సల్, ముందు భాగంలో 8 మెగా పిక్సల్ కెమెరాలను సామ్‌సంగ్ నిక్షిప్తం చేసింది. ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం పై ఈ ఫోన్ అవుతుంది.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్8 ప్లస్ (Samsung Galaxy S8 Plus)

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్8 ప్లస్ (Samsung Galaxy S8 Plus)

6.2 అంగుళాల భారీ డిస్‌ప్లేతో వస్తోన్న ఈ స్మార్ట్‌ఫోన్ రెండు ప్రాసెసర్ వేరియంట్‌లలో లభ్యమవుతోంది. అందులో మొదటి వేరియంట్ ఎక్సినోస్ ప్రాసెసర్ పై రన్ అవుతుండగా, రెండవ వేరియంట్ 1.9 గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్ పై రన్ అవుతుంది. 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వంటి శక్తివంతమైన హార్డ్‌వేర్ వ్యవస్థలను సామ్‌సంగ్ ఈ ఫోన్‌లో పొందుపరిచింది. ఇక కెమెరా విషయానికి వచ్చేసరికి ఫోన్ వెనుక భాగంలో 12 మెగా పిక్సల్, ముందు భాగంలో 8 మెగా పిక్సల్ కెమెరాలను సామ్‌సంగ్ నిక్షిప్తం చేసింది. ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం పై ఈ ఫోన్ స్పందిస్తుంది.

గూగుల్ పిక్సల్ 2 (Google Pixel 2)
 

గూగుల్ పిక్సల్ 2 (Google Pixel 2)

గూగుల్ పిక్సల్ సిరీస్ నుంచి కొద్ది నెలల క్రితం మార్కెట్లో లాంచ్ అయిన గూగుల్ పిక్సల్ 2 స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్ పై రన్ అవుతోంది. ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ పరిశీలించినట్లయితే..5 అంగుళాల డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ ఓరియో అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 12.2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

వన్‌ప్లస్‌ 5 (OnePlus 5)

వన్‌ప్లస్‌ 5 (OnePlus 5)

క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్‌తో మార్కెట్లో లభ్యమవుతోన్న శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌లలో వన్‌ప్లస్ 5 ఒకటి. ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ పరిశీలించినట్లయితే.. 5.5 అంగుళాల భారీ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, 1.9గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్, 6జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని విస్తరించుకునే అవకాశం, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3300mAh నాన్ రిమూవబుల్ బ్యాటరీ.

షియోమీ  ఎంఐ మిక్స్ 2 (Xiaomi Mi MIX 2)

షియోమీ ఎంఐ మిక్స్ 2 (Xiaomi Mi MIX 2)

క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్‌తో వస్తోన్న శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌లలో షియోమీ ఎంఐ మిక్స్ 2 ఒకటి. ఫోన్ స్పెసిఫికేషన్స్ పరిశీలించినట్లయితే.. 5.99 అంగుళాల బీజిల్‌లెస్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం, 6జీబి ర్యామ్, 128జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3400mAh నాన్-రిమూవబుల్ బ్యాటరీ.

Most Read Articles
Best Mobiles in India

English summary
Top 5 Best Snapdragon 835 Phones Which You Can Buy.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X