ఈ వారంలో లాంచ్ కాబోతున్న టాప్ కంపెనీల స్మార్ట్‌ఫోన్లు ఇవే !

స్మార్ట్ ఫోన్ మార్కెట్ రోజురోజుకు కొత్త కొత్త ఫోన్లతో కళకళలాడుతోంది. దిగ్గజ కంపెనీలు బెస్ట్ ఫీచర్లతో మార్కెట్లోకి కొత్త ఫోన్లను రిలీజ్ చేస్తూ ముందుకెళుతున్నాయి.

|

స్మార్ట్ ఫోన్ మార్కెట్ రోజురోజుకు కొత్త కొత్త ఫోన్లతో కళకళలాడుతోంది. దిగ్గజ కంపెనీలు బెస్ట్ ఫీచర్లతో మార్కెట్లోకి కొత్త ఫోన్లను రిలీజ్ చేస్తూ ముందుకెళుతున్నాయి. మరి ఈ వారంలో కూడా కొన్ని కంపెనీలు తమ స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయనే సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రముఖ చైనా కంపెనీలు షియోమి, మిజు తమ కొత్త ఫోన్లను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సిధ్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఆ కంపెనీల నుంచి రాబోతున్న ఫోన్ల యొక్క బెస్ట్ ఫీచర్లు ఏంటీ అనేదానిపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం..

స్మార్ట్‌ఫోన్‌‌లో సెన్సార్ల గురించి ఎప్పుడైనా విన్నారా ?స్మార్ట్‌ఫోన్‌‌లో సెన్సార్ల గురించి ఎప్పుడైనా విన్నారా ?

షియోమీ ఎంఐ 6ఎక్స్

షియోమీ ఎంఐ 6ఎక్స్

షియోమీ తన నూతన స్మార్ట్‌ఫోన్ 'ఎంఐ 6ఎక్స్‌'ను ఈ నెల 25వ తేదీన విడుదల చేయనుంది. దీని ధర వివరాలను ఇంకా వెల్లడించలేదు.
షియోమీ ఎంఐ 6ఎక్స్ ఫీచర్లు
5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 20, 8 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5 ఎల్‌ఈ, యూఎస్‌బీ టైప్ సి, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

 షియోమీ రెడ్‌మీ ఎస్2
 

షియోమీ రెడ్‌మీ ఎస్2

'రెడ్‌మీ ఎస్2'ను ఈ నెల 25వ తేదీన విడుదల చేయనుంది. బ్లాక్, రోజ్ గోల్డ్, గోల్డ్, వైట్, బ్లూ, రెడ్, పింక్, గ్రే, సిల్వర్ రంగుల్లో ఈ ఫోన్ వినియోగదారులకు లభ్యం కానుండగా దీని ధర వివరాలను ఇంకా వెల్లడించలేదు.
షియోమీ రెడ్‌మీ ఎస్2 ఫీచర్లు
5.99 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2 గిగాహెడ్జ్‌ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, 2/3/4 జీబీ ర్యామ్, 16/32/64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3080 ఎంఏహెచ్ బ్యాటరీ.

హానర్ 10

హానర్ 10

హువాయి తన నూతన స్మార్ట్‌ఫోన్ హానర్ 10 ను ఈ నెల 27వ తేదీన చైనా మార్కెట్‌లో విడుదల చేయనుంది. తరువాత భారత్‌లోనూ ఈ ఫోన్ విడుదలవుతుంది. 64/128 జీబీ స్టోరేజ్ వేరియెంట్లలో విడుదల కానున్న ఈ ఫోన్ వరుసగా రూ.27,230, రూ.31,420 ధరలకు వినియోగదారులకు లభ్యం కానుంది.
హానర్ 10 ఫీచర్లు
5.84 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2240 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 16, 24 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3400 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

నోకియా X

నోకియా X

హెచ్‌ఎండీ గ్లోబల్ సంస్థ తన నూతన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ నోకియా X ను ఈ నెల 27వ తేదీన చైనాలో జరగనున్న ఓ ప్రత్యేక ఈవెంట్‌లో విడుదల చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ఫోన్‌కు చెందిన పలు స్పెసిఫికేషన్లు, ఇమేజ్‌లు సోషల్ మీడియాలో లీకయ్యాయి.

నోకియా X స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్లు

6.3 ఇంచుల భారీ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 710 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 12 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో తదితర ఫీచర్లు ఉండనున్నట్లు సమాచారం. ఈ ఫోన్‌కు చెందిన పూర్తి వివరాలు త్వరలోనే తెలిసే అవకాశం ఉంది.

ఒప్పో ఎ3

ఒప్పో ఎ3

ఒప్పో తన నూతన స్మార్ట్‌ఫోన్ ఒప్పో ఎ3ని త్వరలో విడుదల చేయనుంది. దీని ధర వివరాలను ఇంకా వెల్లడించలేదు.

ఒప్పో ఎ3 ఫీచర్లు

6.2 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఐపీఎస్ డిస్‌ప్లే, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, 3400 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

నూబియా జడ్18

నూబియా జడ్18

జడ్‌టీఈ తన నూతన స్మార్ట్‌ఫోన్ నూబియా జడ్18 ను త్వరలో విడుదల చేయనుంది. దీని ధర వివరాలను ఇంకా వెల్లడించలేదు.
నూబియా జడ్18 ఫీచర్లు
5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 6/8 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 24 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 3350 ఎంఏహెచ్ బ్యాటరీ.

మిజు 15

మిజు 15

మిజు మూడు కొత్త స్మార్ట్‌ఫోన్లను ఈ నెల 29వ తేదీన చైనా మార్కెట్‌లో విడుదల చేయనుంది. మిజు 15, మిజు 15 ప్లస్, మిజు 15 లైట్ పేరిట ఈ ఫోన్లు విడుదల కానున్నాయి. భారత్‌లో ఈ ఫోన్లు వరుసగా రూ.26వేలు, రూ.31వేలు, రూ.17వేల ధరలకు లభ్యం కానున్నాయి.
మిజు 15 ఫీచర్లు
5.46 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 1080 x 1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1.2 నూగట్, 12, 20 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, యూఎస్‌బీ టైప్ సి, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

 

 

మెయ్‌జు 15 ప్లస్ ఫీచర్లు.

మెయ్‌జు 15 ప్లస్ ఫీచర్లు.

5.95 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 1440 x 2560 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.5 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1.2 నూగట్, 12, 20 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, యూఎస్‌బీ టైప్ సి, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

మెయ్‌జు 15 లైట్ ఫీచర్లు

మెయ్‌జు 15 లైట్ ఫీచర్లు

5.46 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 1080 x 1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 626 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1.2 నూగట్, 12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

Best Mobiles in India

English summary
Top 6 Upcoming Smartphones Launching In April 2018 More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X