Best Feature phones ఫీచర్ ఫోన్‌ను కొనుగోలు చేయాలని భావిస్తున్నారా.. పాపులర్ బ్రాండ్ ఫోన్ జాబితా మీకోసం..!!
ప్రస్తుతం అనేక మంది చేతిలో స్మార్ట్‌ఫోన్‌లు కనిపిస్తున్నాయి. దీంతోపాటు స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోనూ భారత్ మొదటి వరుసలో ఉంది. కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్తే... భారత్ మార్కెట్‌లో ఫీచర్ ఫోన్‌లు రాజ్యమేలాయి. క్రమంగా అనేక సంస్థలు స్మార్ట్‌ఫోన్‌ల ఉత్పత్తి ప్రారంభం కావడం సహా తక్కువ ధరలకు అందుబాటులోకి రావడం, అధునాతన ఫీచర్‌లు ఉండడంతో.. ఫీచర్ ఫోన్‌ల వినియోగం చాలా వరకు తగ్గింది.
గతంలో ఫీచర్ ఫోన్‌ల మార్కెట్‌లో నోకియా అగ్రస్థానంలో ఉండేది. నోకియాకు చెందిన కొన్ని ఫీచర్ ఫోన్ మోడళ్లు.. అప్పట్లో రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగాయి. అయితే వివిధ అవసరాల కోసం అనేక మంది మళ్లీ ఫీచర్ ఫోన్‌లను ఉపయోగిస్తున్నారు. దీంతో నోకియా వంటి అనేక సంస్థలు మళ్లీ ఫీచర్ ఫోన్‌లను విడుదల చేస్తున్నాయి.

ప్రస్తుతం మార్కెట్‌లో అనేక ఫీచర్ ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు కూడా నోకియా ఫీచర్ ఫోన్‌లు ఆకట్టుకుంటున్నాయి. తర్వాత స్థానంలో జియో ఫీచర్ ఫోన్‌లు ఉన్నాయి. నోకియా నుంచి ఇటీవల రూ.1000 నుంచి రూ.4 వేల వరకు అనేక మోడళ్లను విడుదల చేసింది. అలాగే జియో కూడా అందుబాటులో ధరల్లో మోడళ్లను లాంచ్ చేసింది.
నోకియా 6310 (2024) : ఈ ఫోన్ (Nokia 6310 4G 2024) ప్రస్తుతం అమెజాన్‌లో రూ.3,299 ధరకు అందుబాటులో ఉంది. 2.8 అంగుళాల LCD డిస్ప్లేను కలిగి ఉంది. పాపులర్ Snake గేమ్, FM రేడియో వంటివి ఉన్నాయి. కూడా అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్ డిజైన్ ఆకట్టుకుంటుంది. 1150mAh బ్యాటరీని కలిగి ఉంది.
నోకియా 5310 4G : ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో (Nokia 5310 4G) ఈ హ్యాండ్‌సెట్ ధర రూ.2447 గా ఉంది. 1200mAh బ్యాటరీతో పనిచేస్తుంది. 8MB ర్యామ్, 16MB స్టోరేజీ అందుబాటులో ఉంది. 2.4 అంగుళాల డిస్‌ప్లే, 0.3MP కెమెరాను కలిగి ఉంది. FM రేడియో, ఫ్లాష్ లైట్ సహా మరిన్ని ఫీచర్‌లు ఉన్నాయి.
నోకియా 110 4G (2024) : ఈ ఫీచర్ ఫోన్‌ను (Nokia 110 4G- 2024) భారత్ మార్కెట్‌లో రూ.2,384 గా ఉంది. ఈ ఫోన్ రెండు సిమ్ కార్డులను సపోర్టు చేస్తుంది. 1.77 అంగుళాల డిస్‌ప్లే, 0.08MP కెమెరా, 1450mAh బ్యాటరీతో పనిచేస్తుంది. 32MB ర్యామ్, 32MP స్టోరేజీని కలిగి ఉంటుంది.
నోకియా 108 4G : ఈ ఫోన్ (Nokia 108 4G) ప్రస్తుత ధర రూ.2149 గా ఉంది. 1.8 అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంది. 0.3MP కెమెరా, 950mAh బ్యాటరీ తో పనిచేస్తుంది. 4MB ర్యామ్, 4MB స్టోరేజీతో అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్ డిజైన్ పరంగా ఆకట్టుకుంటుంది. ప్రీమియం మెటీరియల్‌ను కలిగి ఉంది.
నోకియా 235 4G : 2.8 అంగుళాల IPS డిస్‌ప్లే, 2MP కెమెరాను కలిగి ఉంది. యూపీఐ పేమెంట్లు చేసేందుకు అనుకూలంగా ఉంటుంది. ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్‌ఫాం అమెజాన్‌లో ఈ ఫోన్ ధర రూ.3249 గా ఉంది. నోకియా 220 4G ఫోన్ 2.8 అంగుళాల IPS డిస్ప్లేను కలిగి ఉంది. UPI పేమెంట్లు, యూట్యూబ్‌ను వినియోగించుకోవచ్చు. ఫోన్ ధర రూ.3249 గా ఉంది.


Click it and Unblock the Notifications








