రూ.10 వేల లోపు ధరలో బెస్ట్ ఫోన్స్ కోసం చూస్తున్నారా..

దేశీయంగా మొబైల్ మార్కెట్ రోజురోజుకు విస్తరిస్తుండటం వల్ల దిగ్గజ కంపెనీలు అన్నీ లేటెస్ట్ ఫీచర్లతో అత్యంత తక్కువ ధరలో స్మార్ట్ ఫోన్లను ఇండియా మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి.

|

దేశీయంగా మొబైల్ మార్కెట్ రోజురోజుకు విస్తరిస్తుండటం వల్ల దిగ్గజ కంపెనీలు అన్నీ లేటెస్ట్ ఫీచర్లతో అత్యంత తక్కువ ధరలో స్మార్ట్ ఫోన్లను ఇండియా మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. ఈ నేపథ్యంలో వినియోగదారులు కూడా బెస్ట్ ఫీచర్లు ఉన్న ఫోన్ అత్యంత తక్కువ ధరలో ఎక్కడ లభిస్తుంది. దాన్ని ఏ కంపెనీ ఆఫర్ చేస్తుంది అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు. అలాంటి వారి కోసం ఈ మధ్య రూ.10 వేల ధరలో లాంచ్ అయిన బెస్ట్ స్మార్ట్ ఫోన్ల లిస్టును ఇస్తున్నాం. ఏది కావాలో మీరే సెలక్ట్ చేసుకోండి.

 

ఎలక్ట్రానిక్ వస్తువులను ఉరుములు, మెరుపులు నాశనం చేస్తాయా ?ఎలక్ట్రానిక్ వస్తువులను ఉరుములు, మెరుపులు నాశనం చేస్తాయా ?

రియల్‌మి 3

రియల్‌మి 3

ఒప్పోకు చెందిన స‌బ్‌బ్రాండ్ రియ‌ల్ మి త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ రియ‌ల్ మి 3 ని భార‌త మార్కెట్‌లో విడుద‌ల చేసింది. డైన‌మిక్ బ్లాక్‌, రేడియెంట్ బ్లూ, క్లాసిక్ బ్లాక్ క‌ల‌ర్ ఆప్ష‌న్లలో విడులైన ఈ ఫోన్‌కు చెందిన 3జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ను రూ.8,999 ధ‌రకు, 4జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ను రూ.10,999 ధ‌ర‌కు రియ‌ల్ మి అందిస్తోంది . ఈ నెల 12వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్‌తోపాటు రియ‌ల్ మి ఆన్‌లైన్ స్టోర్‌లో ఈ ఫోన్‌ను విక్ర‌యిస్తారు. మొద‌టి ఫ్లాష్ సేల్‌లో ఈ ఫోన్‌ను హెచ్‌డీఎఫ్‌సీ కార్డులు ఉప‌యోగించి కొనుగోలు చేస్తే రూ.500 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఇస్తారు.

రియ‌ల్ మి 3 పూర్తి ఫీచ‌ర్లు

6.2 ఇంచ్ హెచ్‌డీ ప్ల‌స్ ఐపీఎస్ డిస్‌ప్లే, 1520 x 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్ష‌న్‌, ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి70 ప్రాసెస‌ర్‌, 3/4 జీబీ ర్యామ్‌, 32/64 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, 13, 2 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 13 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4230 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

 

రెడ్‌మి నోట్ 7
 

రెడ్‌మి నోట్ 7

చైనా మొబైల్ మేకర్ షియోమీ త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ నోట్ 7 ఫోన్ 3జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.9,999 ధ‌ర‌కు లభిస్తుండ‌గా, 4జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.11,999 ధ‌ర‌కు ల‌భిస్తున్న‌ది. రెడ్‌మీ నోట్ 7 స్మార్ట్‌ఫోన్ ఆనిక్స్ బ్లాక్‌, రూబీ రెడ్‌, స‌ఫైర్ బ్లూ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో విడులైంది.

రెడ్‌మీ నోట్ 7 ఫీచ‌ర్లు

6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 2340 ×1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్ష‌న్‌, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 660 ప్రాసెస‌ర్‌, 3/4 జీబీ ర్యామ్‌, 32/64 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయ‌ల్ సిమ్‌, 12, 2 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 13 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, ఐఆర్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, క్విక్ చార్జ్ 4.0.

 

 

గెలాక్సీ ఎ10

గెలాక్సీ ఎ10

శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎ10 ఫోన్ రూ.8,490 ధ‌ర‌కు వినియోగ‌దారుల‌కు ల‌భిస్తున్న‌ది.

శాంసంగ్ గెలాక్సీ ఎ10 ఫీచ‌ర్లు

6.2 ఇంచ్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 1520 × 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ ఎగ్జినోస్ 7884 ప్రాసెస‌ర్‌, 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్‌, 512 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయ‌ల్ సిమ్‌, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫేస్ అన్‌లాక్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, 3400 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

 

అసుస్ జెన్‌ఫోన్ మ్యాక్స్ ఎం2

అసుస్ జెన్‌ఫోన్ మ్యాక్స్ ఎం2

అసుస్ తన నూతన స్మార్ట్‌ఫోన్ జెన్‌ఫోన్ మ్యాక్స్ ఎం2 బ్లాక్, బ్లూ కలర్ ఆప్షన్లలో విడుదలైంది. 3 జీబీ ర్యామ్ వేరియెంట్ రూ.9,999 ధరకు, 4జీబీ ర్యామ్ వేరియెంట్ రూ.11,999 ధరకు లభిస్తున్నాయి. వీటిని ఈ నెల 20వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో ప్రత్యేకంగా విక్రయించనున్నారు.

అసుస్ జెన్‌ఫోన్ మ్యాక్స్ ఎం2 ఫీచర్లు

6.26 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1520 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 632 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 2టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

Nokia 5.1 Plus

Nokia 5.1 Plus

నోకియా 5.1 ప్లస్ స్మార్ట్‌ఫోన్ బ్లాక్, వైట్, బ్లూ కలర్ వేరియెంట్లలో లభిస్తున్నది. దీని ధర రూ.9999గా ఉంది

నోకియా 5.1 ప్లస్ ఫీచర్లు

5.86 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 720 x 1520 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 400 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో (అప్‌గ్రేడబుల్ టు ఆండ్రాయిడ్ పి), హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 13, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, యూఎస్‌బీ టైప్ సి, 3060 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

Best Mobiles in India

English summary
top-budget-mobiles-under-rs-10000-realme-3-redmi-note-7-galaxy-a10-zenfone-max-m2-and-nokia-5-1-plus More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X