భారత్‌లో పాతుకుపోయిన చైనా బ్రాండ్‌లు

గత కొద్ది సంవత్సరాలుగా ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో అనేక చైనా కంపెనీలు అడుగుపెడుతూనే ఉన్నాయి. వాటిలో కొన్ని మంచి మార్కెట్‌ను సంపాదించుకోగా మరికొన్ని మాత్రం ఇంకా నిలదొక్కుకునే ప్రయత్నంలోనే ఉన్నాయి. ముఖ్యంగా హువావే, షియోమీ, ఒప్పో, వివో, వన్ ప్లస్, జియోనీ, కూల్ ప్యాడ్, లెనోవో, జెడ్‌టీఈ, లీఇకో వంటి చైనా బ్రాండ్‍‌లు భారత్‌లో వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్నాయి. ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో చైనా స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌ల ట్రాక్ రికార్డులను పరిశీలించినట్లయితే..

Read More : రెండు వేరియంట్‌లలో నోకియా 6, ఇండియాలో ధర ఇంతే!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

హువావే (Huawei)

హువావే కంపెనీ ఇండియన్ మార్కెట్లోకి 1999లో అడుగుపెట్టింది. తొలినాళ్లలో ఈ కంపెనీ టెలికమ్ ఎక్విప్ మెంట్ సేవలను అందించేది. ఆ తరువాత నుంచి డేటా కార్డ్స్, ఫీచర్ ఫోన్స్ ఇంకా స్మార్ట్‌ఫోన్‌లను తయారు చేయటం మొదలుపెట్టింది. హువావే మొదటి స్మార్ట్‌ఫోన్ 2010లో లాంచ్ అయ్యింది. ఆన్‌లైన్ మార్కెట్లో పట్టు సాధించేందుకు హానర్ పేరుతో సబ్సిడరీ బ్రాండ్‌ను కూడా హువావే లాంచ్ చేసింది.

జియోనీ (Gionee)

భారత్‌లో జియోనీ బ్రాండ్ సేవలు 2013 నుంచి ప్రారంభమయ్యాయి. జియోనీ బ్రాండ్ స్మార్ట్‌ఫోన్‌లు నమ్మకమైన పనితీరును కనబరుస్తుండటంతో వీటిని వియోగించుకునే వారి సంఖ్య దేశవ్యాప్తంగా మరింతగా పెరిగింది. 2015లో ఫాక్స్‌కాన్ కంపెనీతో ఒప్పంద కుదర్చుకున్న జియోనీ ఇండియాలోనే స్మార్ట్‌ఫోన్‌లను తయారు చేయటం మొదలుపెట్టింది.

కూల్‌ప్యాడ్ (Coolpad)

ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి కూల్‌ప్యాడ్ కంపెనీ 2015లో అడుగుపెట్టింది. రూ.5,000 నుంచి రూ.25,000 వరకు వివిధ ధర వేరియంట్‌లలో కూల్‌ప్యాడ్ ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి.

జెడ్‌టీఈ (ZTE)

ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి జెడ్‌టీఈ బ్రాండ్ 2010లో అడుగుపెట్టింది. ఈ బ్రాండ్ నుంచి విడుదలైన ఫోన్‌లు అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోవటంతో జెడ్‌టీఈ ఇంకా నిలదొక్కుకునే ప్రయత్నంలోనే ఉంది.

వివాదాల్లో నిలిచిన చైనా బ్రాండ్‌లు..

జాతీయ పతాకాన్ని అవమానించినందుకు గాను ఒప్పో కంపెనీ భారత్ కు క్షమాపణలు చెప్పుకోవల్సి వచ్చింది.

వివాదాల్లో నిలిచిన చైనా బ్రాండ్‌లు..

వివో బ్రాండ్ ఫోన్‌లలు పేలిపోతున్నాయంటూ ఇటీవల పలు వార్తలు ఇంటర్నెట్‌లో చక్కర్లు కొట్టాయి.

వివాదాల్లో నిలిచిన చైనా బ్రాండ్‌లు..

2014లో భారత్‌లోకి అడుగుపెట్టిన షియోమీ బ్రాండ్‌కు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. ఈ బ్రాండ్ ఇండియన్ యూజర్లకు సంబంధించిన డేటాను చైనా సర్వర్లకు చేరవేస్తోందంటూ ఆరోపణలు వచ్చాయి.

వివాదాల్లో నిలిచిన చైనా బ్రాండ్‌లు..

2015లో తలెత్తిన ఓ సెక్యూరిటీ లోపం లెనోవో ల్యాప్‌టాప్‌ల బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బ తీసింది. ఈ ల్యాప్‌టాప్‌లలో లోడ్ చేసిన Superfish visual search అనే సాఫ్ట్‌వేర్ కాంప్రమైస్ కావటంతో హ్యాకర్లు చెలరేగిపోయారు.

వివాదాల్లో నిలిచిన చైనా బ్రాండ్‌లు..

2015లో భారీ అంచనాల మధ్య ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన లీఇకోను, ఆ తరువాత తీవ్రమన ఆర్థిక నష్టాలు చుట్టుముట్టాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top Chinese handset players in India. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot