కొత్తదనానికి కేర్ ఆఫ్ అడ్రెస్!!

Posted By: Staff

కొత్తదనానికి కేర్ ఆఫ్ అడ్రెస్!!

 

ఆపరేటింగ్ సిస్టంలలో విండోస్ ఫోన్ 7 వోస్ ఉత్తమమైనది... ఈ వోఎస్‌తో రూపుదిద్దుకున్న హ్యాండ్ సెట్‌లు కొత్తదనం కోరుకునే వారికి కేర్ ఆఫ్ అడ్రస్.. యూజర్ ఫ్రెండ్లీ లక్షణాలతో సుసంపన్నమైన ఈ సాప్ట్‌వేర్ హై క్వాలిటీ మల్టీమీడియా అనుభూతిని కలిగిస్తుంది.

ఈ వోఎస్ అందిస్తున్న పలు ముఖ్య ఫీచర్లు:

గెస్ట్‌ మోడ్: ఈ ఫోన్ ద్వారా మీ వ్యక్తిగత సమాచారాన్ని వేరొకరు చూడకుండా పదిలపరుచుకోవచ్చు. ఈ ఫీచర్ ఫోన్‌లోని పర్సనల్ డేటాకు పూర్తిస్ధాయి భద్రతను కల్పిస్తుంది. వివిధ సందర్భాల్లో మీ హ్యాండ్‌సెట్‌ను మిత్రులు లేదా ఇతర వ్యక్తులు  ఆపరేట్ చేస్తుంటారు. అటువంటి సందర్భాల్లో మీ  ఈ-మెయిల్స్ అదేవిధంగా సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌ల అపడేట్స్‌ను వారి కంట పడకుండా పదిల పరుస్తుంది.

యూజర్ ఇంటర్‌ఫేస్ కస్టమైజేషన్: ఈ అప్లికేషన్ ద్వారా ఫోన్ డిస్‌ప్లే బ్యాక్ గ్రౌండ్‌ను నచ్చిన రీతిలో మార్చుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఫీచర్ సహకారంతో హ్యాండ్‌సెట్ రూపరేఖలు మీకు ఇష్టమొచ్చినట్లు మార్చుకోవచ్చు.

మీడియా ఫార్మాట్ సపోర్ట్: సాధారణంగా  విండోస్ ఫోన్ అంటే వినియోగదారుడు హై క్వాలిటీ ఆడియో, వీడియో వ్యవస్థలను ఆశిస్తాడు. ఈ ఫీచర్ సౌలభ్యతను ఆస్వాదించే శ్రోత ఇది స్మార్ట్‌ఫోనా లేక పూర్తి‌స్ధాయి మల్టీ మీడియా ఫోనా అన్న భావనకు లోనవుతాడు. దీన్ని బట్టే అర్ధం చేసుకోవచ్చు,  విండోస్ 7 ఫోన్‌లలో మీడియా ఫార్మాట్ వ్వవస్థ ఎంత మన్నికైనదో.

ఇవే కాకుండా మరిన్ని అత్యాధునిక ఫీచర్లను డివైజ్‌లో నిక్షిప్తం చేశారు. ఈ విధమైన పటిష్టమైన వ్యవస్థతో విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టం ప్రపంచాన్ని శాసించనుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot