గెలాక్సీ ఎస్4 ‘ది బెస్ట్’.. ఎందుకంటే?

Posted By:

గత కొంత కాలంగా వెబ్ ప్రపంచాన్ని అలుముకుని ఉన్న పుకార్లకు తెరదించుతూ సామ్‌సంగ్ తనకొత్త జనరేషన్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎస్4ను గురువారం న్యూయార్క్ నగరంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆవిష్కరించింది.

అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా సమర్థవంతమైన ఫీచర్లతో ప్రపంచానికి పరిచయమైన గెలాక్సీ ఎస్4.. యాపిల్, హెచ్‌టీసీ, సోనీ వంటి బ్రాండ్‌లకు గట్టి పోటినిస్తుందనటంలో ఏమాత్రం సందేహం లేదు. గెలాక్సీ ఎస్4 ‘ది బెస్ట్' అనటానికి గల ప్రత్యేక కారణాలను మీకు పరిచయం చేస్తున్నాం....

మొబైల్ ఇంకా స్మార్ట్‌ఫోన్ గ్యాలరీల కోసం....

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

గెలాక్సీ ఎస్4 ‘ది బెస్ట్’.. ఎందుకంటే?

13 మెగా పిక్స్ కెమెరా:

గెలాక్సీ ఎస్4కు అమర్చిన 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా స్వచ్ఛమైన ఫోటోగ్రఫీని అందిస్తుంది. ఈ కెమెరా ఫీచర్ గెలాక్సీ ఎస్4కు మంచి గుర్తింపును తీసుకువస్తుంది.

గెలాక్సీ ఎస్4 ‘ది బెస్ట్’.. ఎందుకంటే?

డ్యూయల్ కెమెరా అప్లికేషన్:

గెలాక్సీ ఎస్4లో ఏర్పాటు చేసిన డ్యూయల్ కెమెరా అప్లికేషన్ సాయంతో ఏకకాలంలో ఫోన్ ఫ్రంట్ ఇంకా రేర్ కెమెరాలను ఉపయోగించుకోవచ్చు.

గెలాక్సీ ఎస్4 ‘ది బెస్ట్’.. ఎందుకంటే?

ఎరేజర్:

ఈ ప్రత్యేక ఎడిటింగ్ అప్లికేషన్ సాయంతో ఫోటోలోని అనవసరపు బ్యాక్ గ్రౌండ్‌‍ను ఎరేజ్ చేయవచ్చు.

గెలాక్సీ ఎస్4 ‘ది బెస్ట్’.. ఎందుకంటే?

స్టోరీ ఆల్బమ్:

గెలాక్సీ ఎస్4 ద్వారా మీరు చిత్రీకరించే ప్రతి ఫోటోకు స్టోరీ ఆల్బమ్ క్రియేట్ చేసుకోవచ్చు. అంతేకాదు మీకు నచ్చిన ఫోటోలను ఫేస్‌బుక్ ఇంకా ట్విట్టర్ అకౌంట్‌లకు షేర్ చేసుకోవచ్చు. అంతేకాదండోయ్ మీకు నచ్చిన ఫోటోలను ప్రింట్ తీసుకునే సౌలభ్యతను కూడా సామ్‌సంగ్ కల్పిస్తోంది.

గెలాక్సీ ఎస్4 ‘ది బెస్ట్’.. ఎందుకంటే?

ఎయిర్ వ్యూ:

ఈ ప్రత్యేక ఫీచర్ సాయంతో ఫోన్ టచ్‌స్ర్కీన్‌ను ఉపయోగించకుండానే ఆపరేట్ చేసుకోవచ్చు.

గెలాక్సీ ఎస్4 ‘ది బెస్ట్’.. ఎందుకంటే?

ఎస్ హెల్త్:

గెలాక్సీ ఎస్ ప్రత్యేకమైన ఆరోగ్య సంబంధిత అప్లికేషన్‌లను కలిగి ఉంది. వీటిని అనుసరించటం ద్వారా మీ ఆరోగ్యాన్ని పూర్తిస్థాయిలో కాపాడుకోవచ్చు.

గెలాక్సీ ఎస్4 ‘ది బెస్ట్’.. ఎందుకంటే?

స్మార్ట్ పాస్:

ఈ ప్రత్యేక ఫీచర్ ద్వారా గెలాక్సీ ఎస్4ను మీ కంటి కదలికలతో స్పందింపజేయవచ్చు.

గెలాక్సీ ఎస్4 ‘ది బెస్ట్’.. ఎందుకంటే?

గెలాక్సీ ఎస్4 ప్రధాన స్సెసిఫికేషన్‌లు:

5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ సూపర్ ఆమోల్డ్ డిస్‌ప్లే, రిసల్యూషన్1080x 1920పిక్సల్స్, ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.9గిగాహెట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్ / 1.6గిగాహెట్జ్ వోక్టా కోర్ ప్రాసెసర్ (ప్రాంతాన్ని బట్టి), 2జీబి ర్యామ్, స్టోరేజ్ వర్షన్స్ (16/32/64 జీబి), మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 64జీబికి పొడిగించుకునే సౌలభ్యత, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, వై-ఫై 802.11 ఏ/బి/జి/ఎన్/ఏసీ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ఎఫ్ సీ), బ్లూటూత్ 4.0, ఐఆర్ ఎల్ఈడి, ఎంహెచ్ఎల్ 2.0, 2,600ఎమ్ఏహెచ్ బ్యాటరీ, చుట్టుకొలత 136.6 x 69.8 x 7.9మిల్లీ మీటర్లు, ఫోన్ బరువు 130 గ్రాములు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot