తక్కువ ధర ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో ప్రధాన లోపాలు!

Posted By:

స్మార్ట్ మొబైలింగ్ ఇప్పుడు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులోకి వచ్చేసింది. కోరిన ధరల్లో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు లభ్యమవుతున్నాయి. ఇండియా వంటి ప్రధాన స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లలో తక్కువ ధర స్మార్ట్‌ఫోన్‌లకు మంచి గిరాకీ ఉంది. గ్లోబల్ బ్రాండ్‌లలో ఒకటైన సామ్‌సంగ్ అందుబాటు ధరల్లో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను విక్రయిస్తోంది. మధ్య తరగతి మార్కెట్లను వసం చేసుకునే లక్ష్యంతో దేశవాళీ బ్రాండ్‌లు వివిధ మోడళ్లలో చవక ధర ఆండ్రాయిడ్ ఫోన్‌లను ఆఫర్ చేస్తున్నాయి. తక్కువ ధర స్మార్ట్‌ఫోన్‌లు అధిక ముగింపు స్మార్ట్‌ఫోన్‌లతో పోలిస్తే అనేక అంశాల్లో వెనుకబడి ఉంటాయి. వాటిలో ప్రధాన లోపాలను మీ ముందుంచుతున్నాం...

తక్కువ క్వాలిటీ టచ్‌స్ర్కీన్:

ప్రస్తుత మార్కెట్లో లభ్యమవుతున్న తక్కువ ధర ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల డిస్‌ప్లేలు 480 x 320పిక్సల్ అంతకన్నా తక్కువ రిసల్యూషన్‌ను కలిగి ఉంటాయి. తక్కువ క్వాలిటీ స్మార్ట్‌ఫోన్‌లలో ప్రధానంగా టచ్‌స్ర్కీన్ ఫేలవమైన పనితీరును కనబరుస్తుంది. వివిధ అప్లికేషన్‌లను రన్ చేసే సమయంలో ఈ సమస్య స్పష్టంగా తేటతెల్లమవుతుంది.

తక్కువ ధర ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో ప్రధాన లోపాలు!
 

తక్కువ స్పీడ్ ప్రాసెసర్ ఇంకా ర్యామ్:

తక్కువ ధర స్మార్ట్‌ఫోన్‌లలో 1గిగాహెట్జ్ క్లాక్ వేగంతో కూడిన సింగిల్ కోర్ ప్రాసెసర్‌లను మాత్రమే వినియోగిస్తారు. ఈ కారణంగా పలు సాఫ్ట్‌వేర్ లు నెమ్మదిగా రన్ అవుతాయి. అలాగే ర్యామ్ 512ఎంబి సామర్ధ్యాన్ని కలిగి తన పరిధి మేరకు స్పందిస్తుంది. పటిష్టమైన ప్రాసెసర్ ఇంకా ర్యామ్ వ్యవస్థలు మొబైల్ పనితీరును రెట్టింపు చేస్తాయి.

తక్కువ క్వాలిటీ నిర్మాణం:

అధిక ధర స్మార్ట్‌ఫోన్‌లతో పోలిస్తే తక్కువ ధర స్మార్ట్‌ఫోన్‌లలో సెక్యూరిటీ ఫీచర్లు తక్కువుగా ఉంటాయి. వాటర్ ప్రూఫ్, స్ర్కాచ్ ప్రూఫ్ వంటి ఫీచర్లు అధిక ముగింపు స్మార్ట్‌ఫోన్‌లకు రక్షణ కవచాల్లా నిలిచి ప్రమాదాల బారినుంచి రక్షిస్తాయి. తక్కువ ధర స్మార్ట్‌ఫోన్‌ల నిర్మాణంలో ఉపయోగించే సామాగ్రి తక్కువ స్థాయి పటిష్టతను కలిగి ఉంటుంది. చవక ధర స్మార్ట్ ఫోన్ పొరపాటున జారి పడిందంటే అంతే సంగతలు.

ఆండ్రాయిడ్ అప్‌డేట్‌లు ఉండవు?:

తక్కువ ధర ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు తక్కువుగా ఉంటాయి. ముందువరసలో ఉన్న స్మార్ట్‌ఫోన్‌లకు మాత్రమే వోఎస్ అప్‌డేట్‌లు వర్తిస్తాయి. ఉదాహరణకు సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్2 ఇటీవల ఆండ్రాయిడ్ ఐసీఎస్ అప్‌డేట్‌ను పొందింది. ఇదే అప్‌డేట్ బడ్జెట్ ఫ్రెండీ స్మార్ట్‌ఫోన్ ‘గెలాక్సీ ఏస్'కు అందుతుందా అంటే కష్టమే?. ఇందుకు కారణం, తక్కువ ధర స్మార్ట్‌ఫోన్‌లు నాసిరకమైన స్పెసిఫికేషన్‌లు కలిగి ఉండటమే.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot