ఆండ్రాయిడ్ నాగౌట్ ప్రత్యేకతగా టాప్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

Posted By: SSN Sravanth Guthi

ప్రస్తుత మార్కెట్ ట్రెండ్‌ను పరిశీలించినట్లయితే షియోమీ, లెనోవో, మోటరోలా, వివో, ఒప్పో వంటి బ్రాండ్‌ల నుంచి సామ్‌సంగ్‌కు గట్టిపోటీనే ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో మార్కెట్ పై సామ్‌సంగ్ మరింతగా దృష్టి సారిస్తోంది. అటు బడ్జెట్ పాటు యూజర్లతో పాటు టాప్-ఎండ్ యూజర్లను దృష్టిలో ఉంచుకుని రకరకాల అనేక స్మార్ట్‌ఫోన్‌లను సామ్‌సంగ్ ఇప్పటికే మార్కెట్లోకి తీసుకువచ్చింది. సామ్‌సంగ్ నుంచి లాంచ్ అవుతోన్న అన్ని లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు దాదాపుగా ఆండ్రాయిడ్ నౌగట్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతున్నాయి.

ఆండ్రాయిడ్ నాగౌట్ ప్రత్యేకతగా టాప్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

ఆండ్రాయిడ్ Nougat ఆపరేటింగ్ సిస్టం ద్వారా మేజర్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్‌ను గూగుల్ పరిచయం చేసింది. ఆండ్రాయిడ్ నౌగట్ ఆపరేటింగ్ సిస్టంలో సెట్టింగ్స్ యాప్, పూర్తిగా రీడిజైన్ చేయబడిన యూజర్ ఇంటర్‌ఫేస్‌తో వస్తోంది. పలు మార్పు చేర్పులతో వస్తోన్న ఈ యాప్, ఫోన్ యూజర్ ఇంటర్‌ఫేస్‌ను మరింత వేగంగా ముందకు నడిపిస్తుంది. ఫొన్ సెట్టింగ్జ్ అడ్జస్ట్ చేసుకునేందుకు యూజర్ ప్రతిసారి సబ్ మెనూలోకి వెళ్లకుండా మెయిన్ మెనూ ద్వారానే కావల్సిన సెట్టింగ్స్ యాక్సెస్ చేసుకునే విధంగా సబ్ టైటిల్ వ్యవస్థ ఉంటుంది. ఆండ్రాయిడ్ నగౌట్ వర్షన్ ద్వారా మల్టీ-విండో మోడ్‌ను గూగుల్ అందుబాటులోకి తీసుకువచ్చింది.

ఆండ్రాయిడ్ నాగౌట్ ప్రత్యేకతగా టాప్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

ఈ సౌలభ్యతతో ఫోన్‌లోని యాప్స్‌ను split- screen మోడ్‌లో, ఫోటోలను picture-in-picture మోడ్‌లో ఓపెన్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ నగౌట్ వర్షన్‌లో నైట్ మోడ్ ఫీచర్‌ ఆకట్టుకుంటుంది. ఈ నైట్ మోడ్ ఆప్షన్ ద్వారా యూజర్ ఫోన్ ఇంటర్‌ఫేస్‌ను రాత్రి వేళల్లో డార్క్ కలర్‌కు మార్చుకోవచ్చు. తద్వారా మెరుగైన విజువల్ ఎక్స్‌పీరియన్స్‌ను ఆస్వాదించవచ్చు. ఆండ్రాయిడ్ నగౌట్ వర్షన్ Unicode 9ను సపోర్ట్ చేస్తుంది. అంటే సరికొత్త emojis మీకు అందుబాటులో ఉన్నట్లే. ఇలా ఎన్నెన్నో అత్యాధునిక స్మార్ట్ మొబైలింగ్ ఫీచర్లను ఆండ్రాయిడ్ నౌగట్ ఆఫర్ చేస్తోంది.

ఆండ్రాయిడ్ నౌగట్ ఆపరేటింగ్ సిస్టంకు తోడు లేటెస్ట్ స్పెసిఫికేషన్‌లతో మార్కెట్లో లభ్యమవుతోన్న బెస్ట్ క్వాలిటీ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను ఇప్పుడు చూద్దాం..    

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

శామ్సంగ్ గెలాక్సీ J7 ప్రో

కొనుగోలు ధర : 20,290/-

కీ ఫీచర్స్ :

 • 5.5 అంగుళాలు సూపర్ AMOLED HD 2.5D డిస్ప్లే 1920 x 1080 పిక్సెళ్ళు
 • ఆండ్రాయిడ్ నాగౌట్, 4G వోల్ట్ సపోర్టు
 • ఆక్టా కోర్ 1.6 GHz Exynos 7870 ప్రాసెసర్ తో మాలి T830 GPU
 • 3 GB ర్యామ్ / 64 GB ఇంటర్నల్ మెమోరి
 • మైక్రో SD కార్డ్ ద్వారా 256 GB సపోర్టు
 • 13MP సెల్ఫీ షూటర్ ముందు కెమెరా LED తో
 • 13MP స్నాపర్ రేర్ కెమెరా LED తో
 • లి-అయాన్ 3600 mAh బ్యాటరీ USB సపోర్టుతో
 • మైక్రో USB v2.0
 • డబల్ సిమ్, శామ్సంగ్ పే

 

శామ్సంగ్ గెలాక్సీ J7 NXT

కొనుగోలు ధర : 11,490/-

కీ ఫీచర్స్ :

 • 5.5 అంగుళాలు సూపర్ AMOLED HD డిస్ప్లే 1280x720 పిక్సెళ్ళు
 • డబల్ సిమ్
 • ఆండ్రాయిడ్ నాగౌట్, 4G వోల్ట్ సపోర్టు
 • ఆక్టా కోర్ 1.6 GHz Exynos 7870 ప్రాసెసర్ తో మాలి T830 GPU
 • 2 GB ర్యామ్ / 16 GB ఇంటర్నల్ మెమోరి
 • మైక్రో SD కార్డ్ ద్వారా 256 GB సపోర్టు
 • 5MP సెల్ఫీ షూటర్ ముందు కెమెరా LED తో
 • 13MP స్నాపర్ రేర్ కెమెరా LED తో
 • లి-అయాన్ 3000 mAh బ్యాటరీ USB సపోర్టుతో
 • మైక్రో USB v2.0

 

శామ్సంగ్ గెలాక్సీ ఆన్ మ్యాక్స్

కొనుగోలు ధర : 16,900/-

కీ ఫీచర్స్ :

5.7 అంగుళాల ఫుల్ HD IPS TFT 2.5D డిస్ప్లే 1920 x 1080 పిక్సెళ్ళు

మీడియా టెక్ హీలియో P25 లైట్ ఆక్టా కోర్ (2.39 GHz + 1.69 GHz) 64 బిట్ 16nm ప్రాసెసర్ ARM Mali T880 GPU

4 GB ర్యామ్ / 32 GB ఇంటర్నల్ మెమోరి

మైక్రో SD కార్డ్ ద్వారా 128 GB సపోర్టు

ఆండ్రాయిడ్ నాగౌట్ 7.0, డబల్ సిమ్

13MP సెల్ఫీ షూటర్ ముందు కెమెరా LED తో

13MP స్నాపర్ రేర్ కెమెరా LED తో

4G వోల్ట్, ఫింగర్ ఫ్రింట్ సెన్సార్

3300 mAh బ్యాటరీ, శామ్సంగ్ పే మినీ

 

శామ్సంగ్ గెలాక్సీ J7 మ్మాక్స్

కొనుగోలు ధర : 17,900/-

కీ ఫీచర్స్ :

5.7 అంగుళాల ఫుల్ HD IPS TFT LCD 2.5D డిస్ప్లే 1920 x 1080 పిక్సెళ్ళు

1.6 GHz మీడియా టెక్ హీలియో P20 ఆక్టా కోర్ (MT 6757V) 64 బిట్ ప్రాసెసర్ తో ARM Mali T880 GPU

4 GB ర్యామ్ / 32 GB ఇంటర్నల్ మెమోరి

మైక్రో SD కార్డ్ ద్వారా 128 GB సపోర్టు

ఆండ్రాయిడ్ నాగౌట్ 7.0, డబల్ సిమ్

13MP సెల్ఫీ షూటర్ ముందు కెమెరా LED తో

13MP స్నాపర్ రేర్ కెమెరా LED తో

4G వోల్ట్, ఫింగర్ ఫ్రింట్ సెన్సార్

3300 mAh బ్యాటరీ, శామ్సంగ్ పే మినీ

 

శామ్సంగ్ గెలాక్సీ S8 ప్లస్ (128 GB)

కొనుగోలు ధర : 64,900/-

కీ ఫీచర్స్ :

6.2 ఇంచ్ సూపర్ AMOLED QHD + డిస్ప్లే

ఆక్టా కోర్ Exynos 9 / స్నాప్డ్రాగెన్ 835 ప్రాసెసర్

4 GB / 6 GB ర్యామ్

64 GB / 128 GB ఇంటర్నల్ మెమోరి

ఆండ్రాయిడ్ నాగౌట్ 7.0, డబల్ సిమ్

IP68

8 MP సెల్ఫీ షూటర్ ముందు కెమెరా

12MP డబల్ పిక్సెళ్ రేర్ కెమెరా LED తో

4G వోల్ట్, ఫింగర్ ఫ్రింట్ సెన్సార్, ఐరేస్ స్కానర్

3500 mAh బ్యాటరీ, శామ్సంగ్ పే మినీ

 

శామ్సంగ్ గెలాక్సీ S8

కొనుగోలు ధర : 57,900/-

కీ ఫీచర్స్ :

 • 5.8 ఇంచ్ సూపర్ AMOLED QHD + డిస్ప్లే
 • ఆక్టా కోర్ Exynos 9 / స్నాప్డ్రాగెన్ 835 ప్రాసెసర్
 • 4 GB / 6 GB ర్యామ్
 • 64 GB / 128 GB ఇంటర్నల్ మెమోరి
 • ఆండ్రాయిడ్ నాగౌట్ 7.0, డబల్ సిమ్
 • IP68
 • 8 MP సెల్ఫీ షూటర్ ముందు కెమెరా
 • 12MP డబల్ పిక్సెళ్ రేర్ కెమెరా LED తో
 • 4G వోల్ట్, ఫింగర్ ఫ్రింట్ సెన్సార్, ఐరేస్ స్కానర్
 • 3000 mAh బ్యాటరీ, శామ్సంగ్ పే మినీ

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Compare the specs, features and the pricing of the top Android Nougat run Samsung smartphones in India.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot