ఈ ఫోన్లపై భారీగా ధరలు తగ్గాయి! 7 వేల వరకు కూడా ధర తగ్గింపు.

By Maheswara
|

కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా అయితే ఇదే అనువైన సమయం అనిపిస్తుంది. శామ్సంగ్, షియోమి, ఒప్పో, వివో మరియు వన్‌ప్లస్ కూడా తమ ప్రసిద్ధ హ్యాండ్‌సెట్‌లపై అద్భుతమైన డిస్కౌంట్లను అందించడం ప్రారంభించాయి. మీకు నచ్చిన ఫోన్‌ను ఇంతకు మునుపు ధర కంటే తక్కువ ధర కే కొనే అవకాశం ఉంది. మీ కోసం ఇటీవల భారతదేశంలో అద్భుతమైన ధరల తగ్గింపులను అందుకున్న 'టాప్ సెల్లింగ్ స్మార్ట్ఫోన్ల' జాబితాను రూపొందించాము.

జాబితా
 

కింది జాబితాలో బడ్జెట్, మిడ్-రేంజ్ మరియు వన్ప్లస్ 7 టి ప్రో మరియు శామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ వంటి భారతీయ మార్కెట్లో లభించే అత్యధిక ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయని గమనించండి.

Vivo V19: ప్రారంభ ధర రూ .24,990 వద్ద లభిస్తుంది (ధరల తగ్గింపు రూ .4,000 వరకు)

Vivo V19: ప్రారంభ ధర రూ .24,990 వద్ద లభిస్తుంది (ధరల తగ్గింపు రూ .4,000 వరకు)

వివో V19 స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 712 SoC తో రన్ అవుతూ 6.44 ఇంచ్ సూపర్ AMOLED డిస్ప్లే తో వస్తుంది. 8GB ర్యామ్‌ మరియు 128GB లేదా 256GB స్టోరేజ్ ‌తో వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 10 ఆధారిత వివో ఫన్‌టచ్ OS 10 తో రన్ అవుతుంది.ఇందులో 48MP మెయిన్ కెమెరా, 8MP అల్ట్రా వైడ్-యాంగిల్ లెన్స్ సెకండ్ కెమెరా, 2 MP డెప్త్ సెన్సార్ మరియు 2 MP మాక్రో షూటర్‌తో మూడు,నాలుగు కెమెరాలు జత చేయబడి ఉంటాయి. అలాగే సెల్ఫీల కోసం ముందు భాగంలో F/ 2.1 ఎపర్చర్‌తో 32 MP ప్రైమరీ లెన్స్ మరియు 8MP అల్ట్రావైడ్ కెమెరాతో సెకండరీ లెన్స్ జత చేయబడి ఉంటాయి. ఇది 4,500 mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. అలాగే ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్కు మద్దతు ఇస్తుంది.

Oppo Reno 3 Pro: ప్రారంభ ధర రూ .27,990 వద్ద లభిస్తుంది (ధరల తగ్గింపు రూ .3,000 వరకు)
 

Oppo Reno 3 Pro: ప్రారంభ ధర రూ .27,990 వద్ద లభిస్తుంది (ధరల తగ్గింపు రూ .3,000 వరకు)

ఒప్పో రెనో 3ప్రో స్మార్ట్‌ఫోన్‌ 6.4 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను 2400 x 1080 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో కలిగి ఉంటుంది. ఇది 2.8GHz క్లాక్ వేగంతో మరియు క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 865 SoC తో ప్యాక్ చేయబడి వస్తుంది. ఒప్పో సంస్థ దీనిని 8 జిబి ర్యామ్ / 128జిబి స్టోరేజ్ మరియు 8 జిబి ర్యామ్/ 256 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్స్ లలో అందిస్తుంది.ఇందులో మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ షూటర్ మరియు 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ రెండవ కెమెరాతో జతచేయబడుతుంది.అలాగే 13 మెగాపిక్సెల్ మాక్రో మరియు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కెమెరాలు కూడా ఇందులో ఉన్నట్లు సమాచారం. ముందు భాగంలో డ్యూయల్ సెల్ఫీ కెమెరాలను కలిగి ఉన్నాయి. ఇందులో 44 మెగాపిక్సెల్ కెమెరా మరియు 2-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాలు జతచేయబడి ఉన్నాయి.5,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.

Also Read:Paytm KYC పేరుతో రెచ్చిపోతున్న స్కామర్‌లు!!! జాగ్రత్తపడండి...

iQOO 3: ప్రారంభ ధర రూ .34,990 వద్ద లభిస్తుంది (డిస్కౌంట్ రూ .4,000)

iQOO 3: ప్రారంభ ధర రూ .34,990 వద్ద లభిస్తుంది (డిస్కౌంట్ రూ .4,000)

iQOO3 5G స్మార్ట్‌ఫోన్‌ రియల్‌మి X50 ప్రో మాదిరిగానే క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 865 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది 12GB వరకు LPDDR5 RAM తో మరియు 256GB వరకు గల UFS 3.1 ఇంటర్నల్ స్టోరేజ్ తో జతచేయబడి వస్తుంది. ఈ 5G స్మార్ట్‌ఫోన్‌ ఆధునిక పంచ్-హోల్ HD + AMOLED డిస్ప్లే 6.44-అంగుళాలతో వస్తుంది. ప్రైవసీ కోసం డిస్ప్లేలో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉండడమే కాకుండా ఫేస్ అన్‌లాక్‌కు కూడా మద్దతు ఇస్తుంది. ఇది డ్యూయల్ సిమ్‌లకు మద్దతు ఇస్తుంది మరియు ఆండ్రాయిడ్10- ఆధారిత iQOO UI 1.0తో రన్ అవుతుంది.

Oneplus 7T pro: రూ .47,999 (రూ .7,000 ధర తగ్గింపు) వద్ద లభిస్తుంది

Oneplus 7T pro: రూ .47,999 (రూ .7,000 ధర తగ్గింపు) వద్ద లభిస్తుంది

వన్‌ప్లస్ 7T ప్రో స్మార్ట్‌ఫోన్ యొక్క స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే ఇది డ్యూయల్ సిమ్ నానో స్లాట్ కలిగి ఉంటుంది.ఇందులో 6.67-అంగుళాల క్యూహెచ్‌డి + ఫ్లూయిడ్ అమోలెడ్ డిస్‌ప్లేను 1,440x3,120 పిక్సెల్ పరిమాణంలో, 90HZ రిఫ్రెష్ రేట్ మరియు 19.5: 9 కారక నిష్పత్తితో కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 855+ SoC తో రన్ అవుతూ 8GB LPDDR4X RAM తో జత చేయబడి వస్తుంది.వన్‌ప్లస్ 7T ప్రో స్మార్ట్‌ఫోన్ యొక్క ఇమేజింగ్ విషయానికి వస్తే ఫోటోలు మరియు వీడియోల కోసం వన్‌ప్లస్ 7T ప్రో వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. ఇందులో 48 మెగాపిక్సెల్ సోనీ IMX586 ప్రైమరీ సెన్సార్, 8 మెగాపిక్సెల్ సెన్సార్ మరియు 16 మెగాపిక్సెల్ సెన్సార్లు వరుసగా ఉన్నాయి. అలాగే సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ సోనీ IMX471 సెన్సార్‌తో సెల్ఫీ కెమెరాలను కలిగి ఉంటుంది.4,085mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.

శామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్: రూ .1,08,999 (రూ .7,000 ధర తగ్గింపు) వద్ద లభిస్తుంది

శామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్: రూ .1,08,999 (రూ .7,000 ధర తగ్గింపు) వద్ద లభిస్తుంది

శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 5G ఫోన్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది ప్రాసెసర్‌లో అప్‌గ్రేడ్ మరియు 5G ఫీచర్లను అదనంగా ఉపయోగించడం మినహా దాని 4G వెర్షన్ కు సమానమైన స్పెసిఫికేషన్లను కలిగి ఉంది. శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 5G ఆండ్రాయిడ్ 10తో రన్ అవుతూ 6.7-అంగుళాల ఫుల్-హెచ్‌డి డైనమిక్ అమోలెడ్ ఇన్ఫినిటీ ఫ్లెక్స్ డిస్‌ప్లేను 1080x2636 పిక్సెల్స్ మరియు 21.9: 9, 425pp కారక నిష్పత్తితో వస్తుంది. బయటి షెల్‌లో 301ppi లతో 1.1-అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను కూడా కలిగి ఉంది. అలాగే ఇది స్నాప్‌డ్రాగన్ 865+ ఆక్టా-కోర్ SoC చేత రన్ అవుతూ 8GB RAM తో జత చేయబడి ఉంటుంది.శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 5G ఫోన్ యొక్క ఇమేజింగ్ విషయానికి వస్తే దీని వెనుక భాగంలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో ఎఫ్ / 1.8 ఎపర్చుర్ తో 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ మెయిన్ కెమెరా మరియు ఎఫ్ / 2.2 ఎపర్చుర్ తో 12 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరాను కలిగి ఉన్నాయి. అలాగే ఫోన్ యొక్క ముందు భాగంలో ఎఫ్ / 2.4 ఎపర్చుర్ తో 10 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉన్నాయి. ఇది ఫోటోలను 80-డిగ్రీల FoV కోణంలో కూడా తీయడానికి వీలుగా ఉన్నాయి.శామ్సంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 5G ఫోన్ 3,300mAh బ్యాటరీని కలిగి ఉంది.

Also Read:IPL 2020 క్రికెట్ మ్యాచ్‌లను ఆన్‌లైన్‌లో లైవ్ స్ట్రీమింగ్ పద్ధతిలో చూడడం ఎలా?

షియోమి రెడ్‌మి కె 20 ప్రో: రూ. 22,999 (రూ .2,000 ధర తగ్గింపు)

షియోమి రెడ్‌మి కె 20 ప్రో: రూ. 22,999 (రూ .2,000 ధర తగ్గింపు)

రెడ్‌మిK20 ప్రోలో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 855 SoC మరియు అడ్రినో 640 GPUలు ఉన్నాయి. రెడ్‌మిK20 ప్రో 8GB వరకు RAM మరియు 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్లతో అందుబాటులోకి రానుంది. ఇందులో ప్రత్యేక ఆకర్షణగా 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 13 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్, మరియు 2x zoom 8 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ ఉంది.సెల్ఫీస్ కోసం 20 మెగాపిక్సెల్ పాప్-అప్ సెల్ఫీ కెమెరా కూడా ఉంది. రెడ్‌మి K20 ప్రో ముందు మరియు వెనుక భాగంలో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 తో వస్తుంది . ఇది 4,000 ఎంఏహెచ్ బ్యాటరీతో ప్యాక్ చేయబడి ఉంటుంది మరియు బాక్స్‌లో 18W ఫాస్ట్ ఛార్జర్‌ కూడా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 6.39-అంగుళాల AMOLED డిస్‌ప్లేతో వస్తుంది

Samsung Galaxy A51: ప్రారంభ ధర వద్ద రూ. 23,999 (ధర తగ్గింపు రూ .2,000)

Samsung Galaxy A51: ప్రారంభ ధర వద్ద రూ. 23,999 (ధర తగ్గింపు రూ .2,000)

డ్యూయల్ నానో సిమ్ స్లాట్ గల శామ్‌సంగ్ గెలాక్సీ A51 స్మార్ట్‌ఫోన్‌ ఆండ్రాయిడ్ 10 ఆధారిత వన్ UI 2.0 తో రన్ అవుతుంది. ఇది 6.5-అంగుళాల సూపర్ అమోలెడ్ ఫుల్- HD+ డిస్ప్లే 1080x2400 పిక్సెల్స్ పరిమాణంలో ఇన్ఫినిటీ-ఓ డిస్ప్లే ఉంటుంది. ఇది ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను కలిగి ఉంటుంది . ఈ ఫోన్‌ ఆక్టా-కోర్ ఎక్సినోస్ 9611 SoC ను కలిగి ఉండడంతో పాటు 8GB RAM తో జతచేయబడి ఉంటుంది.శామ్సంగ్ గెలాక్సీ A51 స్మార్ట్‌ఫోన్‌ యొక్క వెనుక వైపు క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంటుంది. శామ్‌సంగ్ గెలాక్సీ A51 లోని కనెక్టివిటీ ఎంపికల విషయానికి వస్తే ఇందులో 4G VoLTE, Wi-Fi, బ్లూటూత్, GPS / A-GPS మరియు USB టైప్-సి పోర్ట్ వంటివి ఉన్నాయి. అంతేకాకుండా ఈ ఫోన్ 4,500 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో ప్యాక్ చేయబడి ఉండి 25W ఫాస్ట్ ఛార్జింగ్ కు మద్దతు ఇస్తుంది.

Samsung galaxy note 10 lite: ప్రారంభ ధర వద్ద రూ. 37,999 (ధరల తగ్గింపు రూ. 1,000)

Samsung galaxy note 10 lite: ప్రారంభ ధర వద్ద రూ. 37,999 (ధరల తగ్గింపు రూ. 1,000)

శామ్సంగ్ గెలాక్సీ నోట్ 10 లైట్ స్మార్ట్‌ఫోన్‌ డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉంటుంది. ఇది 6.7-అంగుళాల ఫుల్ HD + ఇన్ఫినిటీ-ఓ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను 1080 x 2400 పిక్సెల్స్ రెజల్యూషన్,394ppi పిక్సెల్ సాంద్రత మరియు 20: 9 కారక నిష్పత్తితో వస్తుంది. ఇది 2.7GHz ఎక్సినోస్ 9810 ఆక్టా-కోర్ SoC తో రన్ అవుతుంది. ఇది 6GB మరియు 8GB RAM ఎంపికలతో మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఎంపికలతో జత చేయబడి ఉంటుంది. మెమొరీని 1TB వరకు విస్తరించడానికి మైక్రో SD కార్డ్ స్లాట్ కూడా ఉంది.12MP Dual Pixel rear camera + 12MP + 12MP Rear Camera 32MP front-facing camera మరియు Dual 4G VoLTE ,4,500mAh బాటరీ తో వస్తుంది

Vivo s1 pro: రూ. 19,990 (ధరల తగ్గింపు రూ. 1,000)

Vivo s1 pro: రూ. 19,990 (ధరల తగ్గింపు రూ. 1,000)

వివో ఎస్ 1 ప్రో స్మార్ట్‌ఫోన్‌ లో 6.39-అంగుళాల ఫుల్ హెచ్‌డి + సూపర్ అమోలెడ్ స్క్రీన్ డిస్ప్లే ఉంటుంది. ఇందులో స్క్రీన్-టు-బాడీ 19.5: 9 కారక నిష్పత్తితో ఉండి వాటర్ డ్రాప్ నాచ్ 90 శాతంగా ఉంటుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 665 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఇది 8 జిబి ర్యామ్ మరియు 128 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్‌ను కలిగి ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ 9 పైతో ఫన్‌టచ్ ఓఎస్ 9.2 తో రన్ అవుతుంది.ఇందులో 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా లెన్స్ ఉంటుంది. దీనితో పాటు వరుసగా 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ మరియు మాక్రో షాట్స్ మరియు పోర్ట్రెయిట్ షాట్ల కోసం రెండు 2 మెగాపిక్సెల్ లెన్సులు కూడా ఉన్నాయి.ఈ ఫోన్‌ 18W డ్యూయల్-ఇంజిన్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో జతచేసిన 4,500 ఎంఏహెచ్ బ్యాటరీతో ప్యాక్ చేయబడి ఉంటుంది.

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
Top Selling Smartphones Have Received Price Cut In India Check The List Here 

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X