చిన్న తప్పుకి అడ్డంగా బుక్కయిన షియోమి
ప్రపంచ మొబైల్ మార్కెట్లో దూసుకుపోతున్న చైనా దిగ్గజం షియోమి ఉద్యోగి చేసిన పనితో విమర్శలను మూటగట్టుకుంది.
ప్రపంచ మొబైల్ మార్కెట్లో దూసుకుపోతున్న చైనా దిగ్గజం షియోమి ఉద్యోగి చేసిన పనితో విమర్శలను మూటగట్టుకుంది. మార్కెట్‌లోకి ఓ కొత్త ఫోన్ వచ్చిందంటే దాని ఫీచర్లు ఇలా ఉన్నాయి.. కెమెరా పనితీరు ఇలా ఉంటుందని పేర్కొంటూ కంపెనీలు ప్రకటనలు ఇవ్వడం సర్వ సాధారణమే. ఈ నేపథ్యంలో షియోమి కూడా తన లేటెస్ట్ ఫ్లాగ్ షిప్ ఫోన్ పోకో ఎఫ్1 కెమెరా నుంచి తీసిన ఫోటోని చూడండి అంటూ ఓ ఫోటో షేర్ చేసింది. ఆ ఫోటోపై ఇప్పుడు అనేక విమర్శలు మొదలయ్యాయి.

పోకో ఎఫ్
పోకో ఎఫ్1 పేరిట షియోమీ ఇటీవలే ఓ ఫోన్‌ను విడుదల చేసిన సంధర్భంగా కంపెనీ అధికార ప్రతినిధి అయిన డోనోవాన్ సంగ్ తన ఇన్‌స్టాగ్రాంలో ఓ చిత్రాన్ని పోస్ట్ చేశారు.

ఎంఐ మిక్స్ 2ఎస్' తో ..
పోకో ఎఫ్1 తో తీసిన చిత్రంగా దీన్నిపేర్కొన్నారు. అక్కడే ఆయన తప్పులో కాలేశారు. వాస్తవానికి ఆ ఫొటో ‘ఎంఐ మిక్స్ 2ఎస్' తో తీసిందని ‘రెడిట్' యూజర్ ఒకరు గుర్తించారు

ఫేక్ ఫొటో అంటూ విమర్శలు..
ఫొటోకు ఓ మూల దానికి సంబంధించిన లోగో కూడా ఉంది. దీంతో ఫేక్ ఫొటో అంటూ విమర్శలు వెల్లువెత్తాయి. వెంటనే ఇన్‌స్టాగ్రాంలో ఆ ఫొటోను సంగ్ తొలగించారు.

షియోమి ఇంతవరకు స్పందించలేదు..
కాగా ఈ ఉదంతంపై షియోమి ఇంతవరకు స్పందించలేదు. కాని సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ అవుతోంది. కాగా ఈ ఉదంతంపై షియోమి ఇంతవరకు స్పందించలేదు. కాని సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ అవుతోంది.

హువాయి సైతం
మరో చైనా కంపెనీ హువాయి సైతం సరిగ్గా ఇలాంటి విమర్శలనే ఎదుర్కొంది. నోవా3 స్మార్ట్‌ఫోన్ మోడల్ ఫోన్‌లో తీసిన శాంపిల్ షాట్స్‌గా పేర్కొంటూ ఆ కంపెనీ కొన్ని చిత్రాలను ఇటీవల విడుదల చేసింది.

డీఎస్‌ఎల్‌ఆర్‌తో తీసినవి అని తేలడంతో..
అయితే ఆ చిత్రాలు డీఎస్‌ఎల్‌ఆర్‌తో తీసినవి అని తేలడంతో కంపెనీపై విమర్శలు వెల్లువెత్తాయి.


Click it and Unblock the Notifications








