టచ్ స్క్రీన్ మొబైల్స్ వి350, ఏ70

Posted By: Staff

టచ్ స్క్రీన్ మొబైల్స్ వి350, ఏ70

ప్రస్తుతం ఉన్న రోజుల్లో మొబైల్ ఫోన్ అంటే కేవలం ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ మొబైల్ ఫోనే కావాలని అంటున్నారు యూత్. మొబైల్ తయారీదారులు కూడా మార్కెట్లో ఉన్నఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్స్ కంటే బెటర్ మొబైల్ ఫోన్స్‌ని ప్రవేశపెట్టాలని రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. అంతేకాకుండా నాణ్యమైన మొబైల్ ఫోన్స్ ని తక్కువ ధరకే అందిస్తున్నారు. గతంలో టచ్ స్క్రీన్ మొబైల్ ఫోన్ కోనాలంటే సుమారు రూ 20, 000 వరకు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్, ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్స్ వచ్చిన తర్వాత మొబైల్ ఇండస్ట్రీలో టచ్ స్క్ర్రీన్ మొబైల్స్ అత్యాధునిక ఫీచర్స్ కలిగినటువంటి మొబైల్స్ కేవలం రూ 8000లకే లభిస్తున్నాయడంలో అతిశయోక్తి లేదు.

ఇప్పుడు మనం రెండు కంపెనీలకు సంబంధించిన టచ్ స్క్రీన్ స్మార్ట్ ఫోన్స్ గురించిన సమాచారం తెలుసుకుందాం. ఈ రెండు మొబైల్స్ కూడా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌‍తోనే రన్ అవుతాయి. ఆ రెండు మోడల్స్ వివ్ సోనిక్ వి350, మైక్రోమ్యాక్స్ ఏ70. మైక్రోమ్యాక్స్ ఏ70 స్క్రీన్ సైజు 3.2 ఇంచ్ కాగా, అదే వివ్ సోనిక్ వి350 స్క్రీన్ సైజు మాత్రం 3.5 ఇంచ్ గా ఉంది. స్క్రీన్ సైజు ఎంత పెద్దదిగా ఉంటే యూజర్‌కి విజువల్ ఎక్స్ పీరియన్స్ అంత బాగా ఉంటుంది. రెండు మొబైల్స్ కూడా 5మెగా ఫిక్సల్ కెమెరాని కలిగి ఉన్నాయి. దీంతో యూజర్‌కి ఇమేజి క్వాలిటీ సూపర్‌గా ఉంటుంది. ఇవి మాత్రమే కాకుండా కెమెరాకి ఆటో ఫోకస్, డిజిటల్ జూమ్ ఇంకా ప్రత్యేకం. హై డెఫినేషన్ వీడియో రికార్డింగ్‌ మాత్రం విజిఎ కెమెరాతోనే సాధ్యమవుతుంది.

ఇక ఎంటర్టన్మెంట్ విషయానికి వస్తే రెండు టచ్ స్క్రీన్ మొబైల్స్ కూడా కస్టమర్స్‌ని ఎటువంటి నిరాశకు గురిచేయవు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అన్ని రకాల ఆడియో, వీడియో ఫార్మెట్లను ఇవి సపోర్ట్ చేస్తాయి. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే రెండు మొబైల్స్ కూడా బ్లూటూత్ వర్సన్ 2.1ని, వేరే డివైజెస్ నుండి డేటాని ట్రాన్ఫర్ చేసుకోవడానికి యుఎస్‌బి పిసి సింక్‌గా కూడా ఉపయోగపడుతుంది. ఇంటర్నెట్ బ్రౌజింగ్ చేసుకోవడానికి వీలుగా వై-పై ఇంటర్నెట్ కనెక్టివిటీని కూడా సపోర్ట్ చేస్తాయి. హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివటీ, GPRS, EDGEలను కూడా సపోర్ట్ చేస్తాయి.

రెండు మొబైల్స్‌లలో ఇంటర్నల్‌గా మొమొరీ ఉన్నప్పటికీ మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా మొమొరీని 32 జిబి వరకు ఎక్సాండ్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంది. రెండు మొబైల్స్ కూడా సుమారుగా ఒకే విధమైన ఫీచర్స్ ఉన్నప్పటికీ ఖరీదు విషయంలో మాత్రం చాలా తేడా ఉంది. మైక్రోమ్యాక్స్ ఏ70 ధర రూ 7699కాగా, అదే వివ్ సోనిక్ వి350 ధర మాత్రం రూ 14500గా నిర్ణయించడమైంది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot