4జిబి ర్యామ్‌తో Neffos N1 స్మార్ట్‌ఫోన్

|

నెట్ వర్క్ దిగ్గజం టీపీ లింక్ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి లాంచ్ చేసింది. కాగా చాలామందికి ఈ కంపెనీ స్మార్ట్‌ఫోన్ మేకర్ అని తెలియదు. అయితే టీపీ లింక్ అనేది Neffos కంపెనీ బ్రాండ్. ఈ బ్రాండ్ నుంచి Neffos N1 అనే పేరుతో మలేషియాలో ఓ సరికొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. టాప్ అండ్ బాటమ్ బెజిల్ డిస్ ప్లేతో వచ్చిన ఈ ఫోన్ 16:9 aspect ratioను కలిగి ఉంది. ఫోన్ వెనక భాగంలో కర్వడ్ కార్నర్స్ తో పాటు యాంటెన్నా లైన్స్ కూడా ఉంటాయి. కాగా ఈ ఫోన్ Nexus 6P ఫోన్ మాదిరిగా మంచి లుక్ తో కనిపిస్తుంది. ఇందులో మ్యూట్ బటన్ తో పాటు సైలెన్స్ కాల్ నోటిఫికేషన్ కూడా పొందుపరిచారు. కాగా ఈ ఫోన్ కేవలం సింగిల్ వేరియంట్ లోనే వచ్చింది. ఈ ఫోన్ ధరను కంపెనీ RM 1,099 గా నిర్ణయించింది. మన ఇండియన్ కరెన్సీలతో దీని ధర రూ.18,000గా ఉండనుంది. ప్రస్తుతానికి ఇది మలేషియా మార్కెట్లో మాత్రమే లాంచ్ అయింది. ఇండియాకి అతి త్వరలో రానుంది. కంపెనీ ఈఫోన్ మీద 2 సంవత్సరాల వారంటీని అందిస్తోంది. దీంతో పాటు మొదటి 30 మంది కస్టమర్లకు పవర్ బ్యాంక్ ను ఉచితంగా అందించనుంది. ఫీచర్ల విషయానికొస్తే..

 

హానర్ 9 లైట్‌లో దుమ్మురేపుతున్న రైడ్ ఫీచర్, బడ్జెట్ ధరకే సొంతంహానర్ 9 లైట్‌లో దుమ్మురేపుతున్న రైడ్ ఫీచర్, బడ్జెట్ ధరకే సొంతం

4జిబి ర్యామ్‌తో Neffos N1 స్మార్ట్‌ఫోన్

టీపీ లింక్ నెఫ్టీపీ లింక్ నెఫ్ఫోస్ ఎన్1 ఫీచర్లు

5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 2.6 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, డ్యుయల్ సిమ్, 12 మెగాపిక్సల్ డ్యుయల్ రియర్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3260 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

Best Mobiles in India

English summary
TP-Link Launches Neffos N1 Smartphone In Malaysia More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X