సంప్రదాయం టెక్నాలజీ మిళితమైన వేళ : OPPO Reno14 5G దీపావళి ఎడిషన్ ప్రత్యేక ఫీచర్లు ఇవిగో
OPPO Reno14 సిరీస్ కొన్ని నెలల క్రితం భారత్‌లో విడుదల అయింది. ఈ సిరీస్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ పండుగ వేళ ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకొనేందుకు వీలుగా OPPO భారత్‌లో Reno14 5G కొత్త వేరియంట్‌ను పరిచయం చేస్తోంది. OPPO Reno14 5G Diwali Editon స్టాండర్డ్ వేరియంట్ తరహాలోనే స్పెసిఫికేషన్‌లను కలిగి ఉంది. అయితే అదే సమయంలో డిజైన్ టెక్నాలజీలో కొత్త ఆవిష్కరణలను పరిచయం చేస్తుంది.
భారత్ కోసం ప్రత్యేకంగా ఈ వేరియంట్‌ను తీసుకొచ్చింది. OPPO Reno14 5G Diwali Editon తొలిసారిగా పరిశ్రమలో రెండు కొత్త ఫీచర్లను పరిచయం చేస్తోంది. నెమలి నుంచి ప్రేరణ పొందిన డిజైన్‌తోపాటు పండుగ సంప్రదాయాలను సజావుగా మిళితం చేసే డిజైన్‌తోపాటు హీట్ సెన్సిటివ్ కలర్ ఛేంజింగ్ ఫినిష్‌ను కలిగి ఉంటుంది. కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ ప్రకారం ఈ ఫోన్ భారత స్మార్ట్‌ఫోన్ పరిశ్రమలోనే తొలి హీట్ సెన్సిటివ్ కలర్ చేంజింగ్ టెక్నాలజీ కలిగిన తొలి ఫోన్‌గా నిలిచింది.
Disclaimer : సెప్టెంబర్ 2025 నాటికి భారత మార్కెట్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న మరియు విక్రయానికి అందుబాటులో ఉన్న స్మార్ట్‌ఫోన్ మోడళ్ల ఆధారంగా రూపొందించబడింది.

అత్యంత వినూత్నమైన డిజైన్
OPPO Reno14 5G Diwali Editon స్మార్ట్‌ఫోన్ భారతీయ సంస్కృతి, పండుగల నుంచి ప్రేరణ పొందింది. డివైజ్ వెనుకభాగంలో ఉన్న మండల సామరస్యం, సమతుల్యతను సూచిస్తుంది. పండుగ థీమ్‌ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు వీలుగా నెమలి, ఫైర్ నుంచి ప్రేరణ పొంది ఉంటుంది. ఈ దీపావళి ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ నలుపు మరియు గోల్డ్ కలర్ లో ఉంటుంది.
ఈ స్పెషల్ ఎడిషన్ ఫోన్‌లో మరిన్ని ప్రత్యేతకలున్నాయి. ఈ ఫోన్ భారతీయల కోసం హీట్ సెన్సిటివ్ టెక్నాలజీని కలిగి ఉంది. OPPO దీనిని గ్లోషిప్ట్ టెక్నాలజీగా పిలుస్తోంది. శరీర ఉష్ణో్గ్రత లో మార్పులు వస్తే.. ఈ ఫోన్ బ్యాక్ ప్యానల్ బ్లాక్ కలర్ నుంచి గోల్డ్ కలర్‌లోకి మారుతుంది. మల్టీ లేయర్, తొమ్మిది దశల లామినేషన్ ప్రక్రియ కారణంగా ఇది సాధ్యమైంది. ఉష్ణోగ్రత 28 డిగ్రీలుగా ఉంటే నలుపు రంగులో.. అదే అంతకంటే పెరిగి 35 డిగ్రీలకు చేరితే గోల్డ్ కలర్‌లోకి మారుతుంది.
ఈ విధానం 10,000 సార్లు పనిచేస్తుందని OPPO హామీ ఇస్తోంది. అంటే సుమారు కొన్ని సంవత్సరాల వరకు ఈ టెక్నాలజీ పనిచేస్తుందని చెబుతోంది. కేవలం ఈ టెక్నాలజీతో సరిపెట్టుకోకుండా ఈ ఫోన్ ఏరోస్పేస్ గ్రేడ్ అల్యూమినియం ఫ్రేమ్‌ను కూడా కలిగి ఉంది. మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i, OPPO స్పాంజ్ కుషనింగ్ తో కూడిన ఆల్ రౌండ్ ఆర్మర్ ఆర్కిటెక్చర్ ను కలిగి ఉంది. పొరపాటున కిందపడినా ఈ ఫీచర్లు ఫోన్ డ్యామేజీ కాకుండా కాపాడతాయి.

ఈ ఫోన్ 7.42mm అంగుళాల థిక్‌నెస్, 187 గ్రాముల బరువును కలిగి ఉంది. ఫలితంగా ప్రతిరోజు వినియోగించుకొనేందుకు సౌకర్యంగా ఉంటుంది. మరియు IP66, IP68, IP69 రేటింగ్ డస్ట్, స్ల్పాష్, అధిక పీడనం, వేడి నీటిని కూడా తట్టుకుంటుంది.
ఈ ఫీచర్లతో ఈ OPPO Reno14 5G దీపావళి ఎడిషన్ కేవడం పండుగ డిజైన్ కలిగి ఉండడం మాత్రమే కాకుండా దృఢమైన, ఎక్కువ రోజులపాటు మన్నిక వచ్చే అల్ట్రా ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌గా నిలుస్తుంది.
అడ్వాన్స్‌డ్ AI గ్రేడ్ కెమెరాలు
కెమెరా విభాగం పరంగా ఈ స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు ట్రిపుల్ కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంది. ఇందులో OIS సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరా, 3.5x ఆప్టికల్ జూమ్‌తో 50MP టెలిఫోటో లెన్స్ మరియు 8MP అల్ట్రావైడ్ లెన్స్‌ను కలిగి ఉంది. ముందువైపు 50MP సెల్ఫీ కెమెరాను అమర్చి ఉంది. మరియు ఒప్పో అత్యాధునిక హైపర్‌టోన్ ఇమేజింగ్ ఇంజిన్‌ను కలిగి ఉంది.

ఈ ఫోన్ ప్రైమరీ కెమెరాతో ఉదయం సమయాల్లో ఆకట్టుకొనే విధంగా ఫోటోలను క్యాప్చర్ చేయవచ్చు. రాత్రి వేళల్లోనూ సాఫ్ట్‌వేర్ సాయంతో అధిక నాణ్యతతో క్యాప్చర్ చేయవచ్చు. 3.5x టెలిఫోటో లెన్స్ ద్వారా నచ్చిన విధంగా పొర్ట్రెయిట్ షాట్స్‌ను క్యాప్చర్ చేయవచ్చు. వీడియో రికార్డింగ్ పరంగానూ ఈ ఫోన్ మెరుగైన పనితీరునే కనబరుస్తుంది. ప్రైమరీ, టెలిఫోటో, సెల్ఫీ కెమెరాలు 60fps వద్ద 4K HDR వీడియో రికార్డింగ్‌ను సపోర్టు చేస్తుంది.
ఈ OPPO దీపావళి ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ కెమెరా విభాగం AI ఫీచర్ల సపోర్టును కూడా కలిగి ఉంటుంది. AI Recompose, AI Best Face, AI Eraser, AI Perfect Shot, AI Reflection Remover వంటి ఫీచర్లతో AI Editor 2.0 కెమెరా అనుభూతిని మెరుగుపరుస్తుంది.
ఈ ఫీచర్లు అన్నీ OPPO Reno14 5G దీపావళి ఎడిషన్ ఫోన్‌ను ఆల్‌రౌండ్ ఇమేజింగ్ డివైజ్‌గా నిలుపుతాయి. పండుగ సమయాల్లో మరియు ప్రతిరోజు ప్రొఫెసనల్ స్థాయిలో పనితీరును కనబరుస్తాయి.
ఏఐ సపోర్టు కలిగిన సాఫ్ట్‌వేర్
OPPO Reno14 Diwali Editon స్మార్ట్‌ఫోన్ ColorOS 15 పైన పనిచేస్తుంది. మెరుగైన పనితీరును అందించేందుకు వీలుగా ట్రినిటీ ఇంజిన్, యానిమేషన్‌ల కోసం లూమినస్ రెండరింగ్ ఇంజిన్‌ను ఉపయోగిస్తుంది. ఇందుకోసం రియల్‌టైం AI ట్రాన్స్‌లేషన్, వాయిస్ టూ టెక్స్ట్ ట్రాన్స్‌క్రిప్షన్, ఐడియా ఆప్టిమైజేషన్, సర్కిల్ టూ సెర్చ్ వంటివి ఉపయోగించుకుంటుంది.
ఈ వినూత్న లక్షణాలు ఈ స్పెషల్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌ను ప్రొడక్టివిటీ, కమ్యూనికేషన్, సృజనాత్మక ప్రయత్నాలకు అనుకూలించే సామర్థ్యం కలిగిన డివైజ్‌గా నిలుపుతాయి.
స్పీడ్, స్టామినా, స్టన్నింగ్ విజువల్స్
OPPO Reno14 Diwali Edition మీడియాటెక్ డైమెన్సిటీ 8350 SoC ను కలిగి ఉంది. గేమింగ్, మల్టీ టాస్కింగ్ సమయాల్లోనూ మెరుగైన పనితీరును అందిస్తుంది. AI HyperBoost 2.0 ద్వారా ఈ ఫోన్ స్మూత్ కనెక్టివిటీ అనుభవాన్ని అందిస్తుంది.
ఈ స్మార్ట్‌ఫోన్ 6.59 అంగుళాల 1.5K అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రీఫ్రెష్ రేట్, 1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 93 శాతం స్క్రీన్ టూ బాడీ రేషియో ను కలిగి ఉంది. సినిమాలు చూస్తున్నా.. గేమింగ్ సమయాల్లో అయినా మెరుగైన విజువల్ అనుభూతిని అందిస్తుంది.

ఈ OPPO Reno14 Diwali Edition స్మార్ట్‌ఫోన్ 6000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ బ్యాటరీ 5 సంవత్సరాల వరకు మెరుగైన పనితీరును అందిస్తుంది. ఒక్కసారి ఛార్జింగ్ చేసి రెండు రోజుల వరకు ఉపయోగించుకోవచ్చు. ఈ ఫోన్ 80W SUPERVOOCTM ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టును కలిగి ఉంది. కేవలం 48 నిమిషాల్లోనే ఫుల్ ఛార్జింగ్ చేయవచ్చు.
చివరిగా ఈ ఫోన్ ఎలా ఉంటుందంటే
ఈ స్మార్ట్‌ఫోన్ పవర్‌ఫుల్ హార్డ్‌వేర్, రిచ్ సాఫ్ట్‌వేర్‌తో మిళితం చేయబడి ఉంటుంది. అయితే కొత్తగా తీసుకొచ్చిన దీపావళి ఎడిషన్ కేవలం స్మార్ట్‌ఫోన్ మాత్రమే కాకుండా సాంస్కృతిక ప్రాముఖ్యతను మిళితం చేసిన ఆవిష్కరణకు చిహ్నంగా ఉంటుంది.
దీపావళికి సంబంధించిన డిజైన్, మరియు స్మార్ట్‌ఫోన్ పరిశ్రమలోనే తొలిసారిగా తీసుకొచ్చిన హీట్ సెన్సిటివ్ కలర్ ఛేంజింగ్ టెక్నాలజీ, ఎక్కువ రోజులపాటు మన్నిక వచ్చే డిజైన్, అత్యాధునిక ఇమేజింగ్ సామర్థ్యాలు, ఏఐ ఫీచర్లతో OPPO Reno14 5G Diwali Edition పండుగ వాతావరణం మరియు రోజువారీ ఉపయోగం రెండింటికీ అనుకూలంగా ఉండే ప్రీమియం డివైజ్‌గా నిలుస్తుంది.
భారత్‌లో OPPO Reno14 5G Diwali Edition స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్, 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.39999 గా ఉంది. ఈ ఫోన్ ప్రధాన రిటైల్ స్టోర్లు, OPPO e-Store, Flipkart మరియు Amazon లో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది.
ఈ ఫోన్‌పై 10 శాతం వరకు అంటే రూ.3999 వరకు డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఫలితంగా ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.36999 గా ఉంటుంది. దీంతోపాటు దీపావళి ఎడిషన్ పైన ఇతర ఆఫర్ల ద్వారా కూడా ప్రయోజనం పొందవచ్చు.



Click it and Unblock the Notifications








