'హువాయ్'తో కలవడం మా అదృష్టం..

రెండు రంగాలలో కూడా రెండు కంపెనీలకు మంచి అవకాశాలు ఉండడంతో ఇద్దరూ కలసి బిజినెస్‌ని ఇంకా ఎంతో ఎత్తుకి తీసుకొని వెళ్లాలనే యోచనలో ఉన్నారు. వీరిద్దరూ కలవడంతో యూజర్స్‌ని ఎక్కవగా రాబట్టకునేందుకు గాను దసరా సీజన్‌లో ఎక్కువ ఆఫర్స్, డిస్కౌంట్స్‌ని ప్రకటించడం జిరిగింది. హువాయ్ స్మార్ట్ ఫోన్స్ ప్రకటించిన డిస్కౌంట్స్ ప్రకారం రూ 1,757 వరకు ట్రాడ్స్ గిప్ట్ వోచర్స్ కస్టమర్స్‌కి అందించనున్నారని సమాచారం.
ఈ సందర్బంలో హువాయ్ డివైజెస్ మార్కెటింగ్ డైరెక్టర్ ఆనంద్ నారంగ్ మాట్లాడుతూ ప్రస్తుతం ఆన్ లైన్ రీటెల్ రంగానికి మంచి డిమాండ్ ఉండడంతో వినూత్నంగా ఈ పధకానికి శ్రీకారం చుట్టడం జరిగిందని అన్నారు. ఇకపోతే ట్రాడ్స్.ఇన్‌ని హువాయ్ ఎంచుకోవడానికి కారణం ఆన్ లైన్ రిటైల్ రంగం మార్కెట్లో తనకంటూ ఓ ప్రత్యకమైన స్దానాన్ని సంపాదించుకోవడమేనని అన్నారు. ఇటువంటి అమ్మకాలకు ట్రాడ్స్ .ఇన్ మంచి కంపెనీ మాత్రమే కాదు చక్కని ఫ్లాట్ ఫామ్ కూడా.
ట్రాడ్స్.ఇన్‌లో హువాయ్ మొబైల్స్‌ని కొనుగోలు చేసిన కస్టమర్స్ క్యాష్‌ని క్రెడిట్ కార్డ్స్ ద్వారా చెల్లించవచ్చు. ప్రస్తుతానికి ట్రాడ్స్.ఇన్‌లో హువాయ్ ఇడియోస్ ఎక్స్5 యు8800, హువాయ్ ఇడియోస్ ఎక్స్2 యు8500, హువాయ్ ఇడియోస్ ఛాట్ యు8300 మొబైల్స్‌ని ఉంచడం జరిగిందన్నారు.
హువాయ్ ఇడియోస్ ఎక్స్5 యు8800 మొబైల్ ధర: రూ 14,307
హువాయ్ ఇడియోస్ ఎక్స్2 యు8500 మొబైల్ ధర: రూ 7,676
హువాయ్ ఇడియోస్ ఛాట్ యు8300 మొబైల్ ధర: రూ 7,130


Click it and Unblock the Notifications