ట్రాయ్ క్రమబద్ధీకరణ... తగ్గనున్న ఐఎస్‌డీ కాల్ రేట్లు

Posted By:

తరచూ విదేశాలకు ఫోన్‌లు చేసేవారికి శుభవార్త. టెలికం నియంత్రణ మండలి ట్రాయ్ తాజా క్రమబద్ధీకరణ నేపథ్యంలో త్వరలోనే ఐఎస్‌డీ కాల్ చార్జీలు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంటర్నేషనల్ లాంగ్ డిస్టెన్స్ ఆపరేటర్లు (ఐఎల్ డీవో) స్థానిక మొబైల్ సేవల సంస్థలకు చెల్లించాల్సిన ధర పై ట్రాయ్ పరిమితి విధించింది. ఈ యాక్సెస్ చార్జీలు వైర్‌లెస్ సర్వీసులకు నిమిషానికి 40 పైసలు, వైర్‌లెస్ సర్వీసులకు నిమిషానికి రూ.1.20గా ట్రాయ్ నిర్ణయించింది.

ట్రాయ్ క్రమబద్ధీకరణ... తగ్గనున్న ఐఎస్‌డీ కాల్ రేట్లు

ఇప్పటి వరకు ఉన్న విధానంలో వినియోగదారులు ఐఎస్‌డీ కాల్స్ చేయాలనుకుంటే ఐఎల్‌డీవోను సొంతంగా ఎంచుకోవడానికి ఆస్కారం లేదు. యాక్సెస్ ప్రొవైడర్స పై ఆధారపడాల్సి వచ్చేది. తాజా ట్రాయ్ నిబంధనల ప్రకారం, వినియోగదారులు కాలింగ్ కార్డ్‌లను ఏ ఐఎల్‌డీవో నుంచైనా కొనగోలు చేయవచ్చు. లాంగ్ డిస్టెన్స్ సెక్టార్‌లో ఉన్న పోటీ కారణంగా వినియోగదారులకు తక్కువ ధరలకే ఐఎస్‌డీ కాల్ కార్ట్స్ లభిస్తాయని ఓ అంచనా.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting