12జీబి ర్యామ్, 60 మెగా పిక్సల్ కెమెరాతో టురింగ్ ఫోన్

మొబైల్ ఫోన్‌ల తయారీ రంగంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న టురింగ్ రోబోటిక్స్ ఇండస్ట్రీస్ (టీఆర్ఐ) విప్లవాత్మక ఫీచర్లతో కూడిన ఓ శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌ను అంతర్జాతీయ మార్కెట్లో అనౌన్స్ చేసింది.

12జీబి ర్యామ్, 60 మెగా పిక్సల్ కెమెరాతో టురింగ్ ఫోన్

Read More : Jio ఎఫెక్ట్ రూ.2,999కే దుమ్మురేపే 4G VoLTE ఫోన్

Cadenza పేరుతో ఆవిష్కరించబడిన ఈ ఫోన్ స్పెసిఫికేషన్‌లు విశ్లేషకులను సైతం అవాక్కయ్యేలా చేస్తున్నాయి. 2017లో విడుదల కాబోతున్న ఈ ఫోన్ డీప్ లెర్నింగ్ క్యాపబులిటీతో కూడిన Swordfish OS పై రన్ అవుతుంది. ఈ ఫోన్‌లో పొందుపరిచిన స్పెసిఫికేషన్‌లు మరింత ఆసక్తికి రేకెత్తిస్తున్నాయి...

Read More : 15 నిమిషాల్లో మీ Jio సిమ్ యాక్టివేట్ అవుతుంది!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

#1

టురింగ్ ఫోన్ Cadenzaలో రెండు శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 830 ప్రాసెసర్‌లను నిక్షిప్తం చేసినట్లు తెలుస్తోంది.

#2

టురింగ్ రోబోటిక్స్ ఇండస్ట్రీస్ విడుదల చేసిన సమచారం ప్రకారం Cadenza ఫోన్ 12జీబి ర్యామ్‌తో రాబోతోంది. ఎక్స్‌ప్యాండబుల్ ఆఫ్షన్ ద్వారా ఫోన్ స్టోరేజ్‌ను 1TB వరకు విస్తరించుకోవచ్చు.

#3


టురింగ్ ఫోన్ Cadenza 5.8 అంగుళాల డిస్‌ప్లేతో రాబోతోంది. రిసల్యూషన్ సామర్థ్యం (2560 x 1440పిక్సల్స్),

#4

కెమెరా విషయానికి వచ్చేసరికి Cadenza ఫోన్ 20 మెగా పిక్సల్ డ్యుయల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలతో పాటు 60 మెగా పిక్సల్ ఐమాక్స్ 6కే క్వాడ్ రేర్ ఫేసింగ్ కెమెరా వింత్ ట్రైప్లెట్ లెన్స్‌తో వస్తోంది. ఇది నిజంగా అద్భుతం.

#5

నానో సిమ్‌లను మాత్రమే సపోర్ట్ చేయగలిగే 4 డ్యుయల్ సిమ్ స్లాట్‌లను Cadenza ఫోన్‌లో ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అంటే ఒకేసారి 8 నెట్‌వర్క్‌లను ఈ ఫోన్‌లో రన్ చేసుకోవచ్చు.

#6

బ్యాటరీ విషయానికి వచ్చేసిరికి ఈ భారీ డివైస్‌లో గ్రాఫేన్ సూపర్ కండక్టర్, లిథియం అయాన్ బ్యాటరీ, హైడ్రోజన్ ఇంధన సెల్ కలయకతో అభివృద్థి చేసిన 100 వాట్ బ్యాటరీ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

#7

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే Swordfish ఆపరేటింగ్ సిస్టం (ఇంకా మార్కెట్లో అనౌన్స్ కాలేదు) పై Cadenza ఫోన్‌ రన్ అవుతుంది. 2017లో విడుదల కాబోయే ఈ ఫోన్ ధర ఎంత ఉండొచ్చు అనే దాని పై ఇంకా స్ఫష్టత రాలేదు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Turing Phone Cadenza is Coming with 2 Processors, 12GB RAM & 100 Wh Battery & 60MP Camera. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot