సమయం లేదు మిత్రమా, Oneplus 5 వచ్చేస్తోంది

మార్కెట్లోకి అడుగుపెట్టిన కొద్ది సంవత్సరాల వ్యవధిలోనే బెస్ట్ గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా అవతరించిన వన్‌ప్లస్ తన లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ Oneplus 5తో మరోసారి మార్కెట్లో మెరవబోతోంది. జూన్ 20న అంతర్జాతీయ మార్కెట్లో లాంచ్ కాబోతోన్న ఈ ఫోన్ జూన్ 22న ఇండియాకు రాబోతోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఏ ఒక్కరిని నిరుత్సాహాపరచలేదు..

వన్‌ప్లస్ బ్రాండ్ నుంచి ఇప్పటివరకు మార్కెట్లో లాంచ్ అయిన ప్రతి స్మార్ట్‌ఫోన్ అటు పనితీరు పరంగా, ఇటు ధర పరంగా ఏ ఒక్కరిని నిరుత్సాహాపరచలేదు. హై-ఎండ్ స్పెసిఫికేషన్‌లతో కూడిన స్మార్ట్‌ఫోన్‌లను బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో అందించటమే వన్‌ప్లస్ బ్రాండ్ ప్రధాన మోటో.

ఇంకా రెండు రోజులు...

భారత్‌లో వన్‌ప్లస్5 లాంచ్ ఈవెంట్‌కు ఇంకా రెండు రోజులు మిగిలి ఉన్న నేపథ్యంలో ఈ ఫ్లాగ్‌షిప్ డివైస్‌కు సంబంధించిన ఆసక్తికర వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం..

శక్తివంతమైన ఇంటర్నల్ స్సెసిఫికేషన్స్..

ప్రపంచంలోనే శక్తివంతమైన మొబైల్ చిప్‌సెట్‌గా పరిగణించబడుతోన్న క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 835 ఆక్టా కోర్ సాక్ పై వన్‌ప్లస్ 5 స్మార్ట్‌ఫోన్ రన్ అవుతుంది. వన‌ప్లస్ ఈ విషయాన్ని తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ధృవీకరించింది. ర్యామ్ విషయానికి వచ్చేసరికి శక్తివంతమైన 8జీబి ర్యామ్‌తో వన్‌ప్లస్ 5 రాబోతున్నట్లు అనేక రూమర్స్ హల్‌చల్ చేస్తున్నాయి. స్టోరేజ్ పరంగా చూస్తే వన్‌ప్లస్ 5 ఫోన్ 128 అలానే 256జీబి స్టోరేజ్ వేరియంట్‌లలో మార్కెట్లో లభించే అవకాశం ఉంది.

అప్‌డేటెడ్ సాఫ్ట్‌వేర్

ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోన్న అనేక రూమర్స్ ప్రకారం వన్‌ప్లస్ 5 స్మార్ట్‌ఫోన్ లేటెస్ట్ వర్షన్ ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. వన్‌ప్లస్ 5 స్మార్ట్‌ఫోన్‌లోని శక్తివంతమైన స్సెసిఫికేషన్‌లకు ఈ ఇంటర్‌ఫేస్ తోడవటం వల్ల ఫోన్ పనితీరు మరింత స్మూత్‌గా ఉంటుందని తెలుస్తోంది.

కెమెరాలను మరింత ప్రొఫెషనల్‌గా...

OnePlus 5 కెమెరాలను మరింత ప్రొఫెషనల్‌గా మలిచే క్రమంలో DxOMark అనే ఇమేజ్ క్వాలిటీ రేటింగ్ వెబ్‌సైట్‌తో వన్‌ప్లస్ టై-అప్ అయ్యింది. ఈ పరిణామాలను బట్టి చూస్తుంటే స్మార్ట్‌ఫోన్ కెమెరా టెక్నాలజీని వన్‌ప్లస్ కంపెనీ మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. 

డ్యుయల్ - లెన్స్ రేర్ కెమెరా సెటప్

వన్‌ప్లస్ 5 డ్యుయల్ - లెన్స్ రేర్ కెమెరా ద్వారా క్యాప్చుర్ చేసిన ఓ ఫోటోను వన్‌ప్లస్ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో పోస్ట్ చేసి ఉత్కంఠను మరింత పెంచింది. వన్‌ప్లస్ కెమెరాతో ఇన్‌బిల్ట్‌గా వచ్చే bokeh effect, portrait modeలు ఐఫోన్ 7 ప్లస్ తరహా కెమెరా పనితీరును ఆఫర్ చేస్తాయని తెలుస్తోంది.

హైదరాబాద్‌లోనూ లాంచ్ ఈవెంట్..

జూన్ 22న ముంబైలో జరిగే వన్‌ప్లస్ 5 అఫీషియల్ లాంచ్ ఈవెంట్ తరువాత నాలుగు ప్రధాన పట్టణాల్లో పాప్-అప్ ఈవెంట్ లను నిర్వహించబోతోన్నట్లు కంపెనీ తెలిపింది. హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, బెంగుళూరు, చెన్నై ప్రాంతాల్లో ఈ pop-up ఈవెంట్స్‌‌ను నిర్వహించబోతోన్నట్లు వన్‌ప్లస్ తెలిపింది.

అమెజాన్ ఇండియాలో మాత్రమే...

ఈ pop-up ఈవెంట్స్‌కు హాజరయ్యే ప్రతిఒక్కరికి ఫోన్‌ను ఎక్స్‌పీరియన్స్ చేయటంతో పాటు కొనుగోలు చేసే అవకాశం ఉంటుందని, అయితే లిమిటెడ్ స్టాక్‌లోనే ఫోన్ అందుబాటులో ఉంటాయని వన్‌ప్లస్ తెలిపింది. కాబట్టి మీరు ముందు వరసలో ఉన్నట్లయితే ఫోన్ మీకు ఖచ్చితంగా లభిస్తుంది. అమెజాన్ ఇండియాలో మాత్రమే ఎక్స్‌క్లూజివ్‌గా లభించే ఈ ఫోన్‌ రెండు వేరియంట్ లలో ఉంటుందని సమచారం.

గెలాక్సీ ఎస్8, ఐఫోన్ 7లకు ప్రధాన కాంపిటీటర్‌..

హై-ఎండ్ స్పెసిఫికేషన్లతో మిడ్-రేంజ్ మార్కెట్ సెగ్మెంట్‌ను టార్గెట్ చేస్తూ లాంచ్ కాబోతోన్న వన్‌ప్లస్ 5 ఇతర ఫ్లాగ్‌షిప్ మోడల్ స్మార్ట్‌ఫోన్‌లైన సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్8, షియోమి ఎంఐ6 అలానే యాపిల్ ఐఫోన్ 7లకు ప్రధాన కాంపిటీటర్‌గా నిలవనుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
2 days left for the biggest launch of the Year. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot