రెండు లక్షల ఫ్రీడం 251 ఫోన్‌లు రెడీ!

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన రింగింగ్ బెల్స్ రూ.251 స్మార్ట్‌ఫోన్ 'ఫ్రీడం 251' డెలివరీకి సిద్దమవుతోంది. ఈ విషయాన్ని ఆ సంస్థ సీఈఓ మోహిత్ గోయిల్ మీడియాకు వెల్లడించారు. దాదాపుగా 2 లక్షలు ఫ్రీడం 251 హ్యాండ్‌సెట్‌లు ఇప్పటి వరకు సిద్ధమయ్యాయని వీటిని జూన్ 30 నుంచి డెలివరీ చేస్తామని ఆయన పేర్కొన్నారు. మొదటి ఫేజ్‌లో బాగంగా ఈ రెండు లక్షల ఫోన్‌లను డెలివరీ చేసిన వెంటనే మరోసారి ఓపెన్ రిజిస్ట్రేషన్ నిర్వహించి ఫోన్‌లను విక్రయిస్తామని తెలిపారు. మరిన్ని వివరాలు క్రింది స్లైడర్‌లో చూడొచ్చు...

Read More : డేటావిండ్ 4జీ టాబ్లెట్, రూ.5,999కే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రెండు లక్షల ఫ్రీడం 251 ఫోన్‌లు రెడీ

తాము యూనిట్‌కు రూ.140 నుంచి రూ.150 వరకు నష్టపోవల్సి ఉంటుందని, ఎక్కువ మొత్తంలో హ్యాండ్‌సెట్‌లను విక్రయించటం ద్వారా లాభాలు పొందే అవకాశముందని ఆయన తెలిపారు.

 

రెండు లక్షల ఫ్రీడం 251 ఫోన్‌లు రెడీ

ప్రధాన మంత్రి, ‘డిజిటల్ ఇండియా', ‘మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమాలను స్పూర్తిగా తీుసుకుని ఈ కారుచౌక ఫ్రీడం 251 ఫోన్‌లను అందించే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు.

రెండు లక్షల ఫ్రీడం 251 ఫోన్‌లు రెడీ

ఫోన్‌లకు సంబంధించిన విడిభాగాలను తైవాన్ నుంచి తెప్పించి హరిద్వార్‌లోని తమ తయారీ యూనిట్‌లో వాటిని అసెంబుల్ చేస్తున్నట్లు గోయిల్ తెలిపారు.

రెండు లక్షల ఫ్రీడం 251 ఫోన్‌లు రెడీ

జూలై మొదటి వారంలో తమ రింగింగ్ బెల్స్ కంపెనీ నుంచి 32 అంగుళాల హైడెఫినిషన్ ఎల్ఈడి టెలివిజన్‌ను అందుబాటులోకి తీసుకురాన్నన్నట్లు గోయిల్ తెలిపారు. రూ.10,000 కంటే తక్కువ ధరలో అందుబాటులో ఉండే ఈ టీవీని బుక్ చేసుకున్న రెండు రోజుల్లోనే డెలివరీ ఉంటుందని అన్నారు. ప్రస్తుతానికి తమ వద్ద లక్ష టీవీలు అందుబాటులో ఉన్నట్లు గోయిల్ వెల్లడించారు.

రెండు లక్షల ఫ్రీడం 251 ఫోన్‌లు రెడీ

ఫ్రీడమ్ 251 స్మార్ట్‌ఫోన్ 4 అంగుళాల క్యూహైడెఫినిషన్ డిస్‌ప్లేతో వస్తోంది. (రిసల్యూషన్ సామర్థ్యం 960x540పిక్సల్స్). 1.3గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్‌ను ఫ్రీడమ్ 251 స్మార్ట్‌ఫోన్‌లో పొందుపరిచారు. ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం పై ఫోన్ రన్ అవుతుంది.

రెండు లక్షల ఫ్రీడం 251 ఫోన్‌లు రెడీ

ఈ డివైజ్‌లో 1జీబి ర్యామ్‌తో పాటు 8జీబి ఇంటర్నల్ మెమరీని పొందుపరిచారు. మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు పెంచుకోవచ్చు.

రెండు లక్షల ఫ్రీడం 251 ఫోన్‌లు రెడీ

ఫోన్ వెనుక భాగంలో 3.2 మెగా పిక్స్ రేర్ ఫేసింగ్, ముందు భాగంలో 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలను ఏర్పాటు చేసారు.

రెండు లక్షల ఫ్రీడం 251 ఫోన్‌లు రెడీ

3జీ నెట్‌వర్క్‌ను సపోర్ట్. 1450 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

రెండు లక్షల ఫ్రీడం 251 ఫోన్‌లు రెడీ

కంపెనీ చెబుతోన్న దాని ప్రకారం. ఫ్రీడమ్ 251 స్మార్ట్‌ఫోన్ ఒక సంవత్సరం వారంటీతో లభ్యమవుతుంది.

రెండు లక్షల ఫ్రీడం 251 ఫోన్‌లు రెడీ

మెన్ సేఫ్టీ, స్వచ్ భారత్, ఫిషర్ మాన్, ఫార్మర్, మెడికల్, గూగుల్ ప్లే, వాట్సాప్, ఫేస్‌బుక్, యూట్యూబ్ వంటి ఉపయోగకరమైన యాప్స్‌ను ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Two lakh Rs 251 phones ready, says Ringing Bells, to launch 'cheapest' HD LED TV. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot