భారత్‌లో ల్యాండింగ్‌కు సర్వం సిద్ధం..?

Posted By: Staff

భారత్‌లో ల్యాండింగ్‌కు సర్వం సిద్ధం..?

 

ఇంటెల్ ప్రాసెసర్‌లతో కూడిన రెండు సరికొత్త స్మార్‌ఫోన్‌లను భారత్‌లో లాంఛ్ చేసేందుకు లావా రంగం సిద్దం చేసింది. ఎంట్రీ లెవల్, మిడ్ రేంజ్ స్థాయిలో రూపుదిద్దుకుంటున్న ఈ ఆండ్రాయిడ్ ఫోన్‌ల విలువ రూ.12,000, 15,000గా ఉంటుంది. ఇదిలా ఉండగా, లావా డిజైన్ చేసిన ప్రపంచపు తొలి ఇంటెల్ ప్రాసెసర్ ఆధారిత స్మార్ట్‌ఫోన్ ‘జోలో 900’ ఈ నెల 23 నుంచి మార్కెట్లో లభ్యం కానుంది. ధర విలువ 23,000.

XOLO X900’ స్పెసిఫికేషన్‌లు..

* 4.3 అంగుళాల హై రిసల్యూషన్ LCD డిస్‌ప్లే,

*  ఇంటెల్ ఆటమ్ Z2460 ప్రాసెసర్, (క్లాక్ సామర్ధ్యం 1.6 GHz),

*  ఉత్తమ క్వాలిటీ కెమెరా వ్యవస్థ,

*  నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ఎఫ్ సీ) వ్యవస్థ,

* HSPA + నెట్‌వర్క్ సపోర్ట్,

*   హెచ్‌డిఎమ్ఐ కనెక్టువిటీ,

*  ఇంటెల్ XMM6260 ప్లాట్‌ఫామ్.

ప్రస్తుతానికి ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతున్నప్పటికి త్వరలో 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్‌కు అప్‌డేట్ కానుంది. ఈ డివైజ్‌లో నిక్షిప్తం చేసిన ఇంటెల్ ఆటమ్ Z2460 ప్రాసెసర్ పనితీరు పై భారీ అంచనాలు నెలకున్నాయి. 4 అంగుళాల టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే ఉత్తమ రిసల్యూషన్‌తో కూడిన విజువల్ అనుభూతులను చేరువ చేస్తుంది.

ఫోన్ వెనుక భాగంలో అమర్చిన 8 మెగా పిక్సల్ హై క్వాలిటీ కెమెరా నాణ్యమైన ఫోటోగ్రఫీ ప్రమాణాలను కలిగి ఉంటుంది. ముందు భాగంలో అమర్చిన కెమెరా ప్రత్యక్ష వీడియో ఛాటింగ్‌కు ఉపకరిస్తుంది. అమర్చిన శక్తివంతమైన బ్యాటరీ సుదీర్ఘ బ్యాకప్ నిస్తుంది. డివైజ్‌లో ఏర్పాటు చేసిన హెచ్‌డిఎమ్ఐ అవుట్ సాయంతో హై డెఫినిషన్ స్ర్కీన్‌లకు స్మార్ట్‌ఫోన్‌ను జత చేసుకోవచ్చు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot