గూగుల్ నుంచి అత్యంత తక్కువ ధరకే ఫిక్సల్ ఫోన్లు
టెక్నాలజీ దిగ్గజం గూగుల్ మిడ్ రేంజ్ ధరలో పిక్సల్ ఫోన్లను విడుదల చేయనుందని ఈ మధ్య వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే.
టెక్నాలజీ దిగ్గజం గూగుల్ మిడ్ రేంజ్ ధరలో పిక్సల్ ఫోన్లను విడుదల చేయనుందని ఈ మధ్య వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఫోన్ల ద్వారా కంపెనీ అత్యంత తక్కువ మార్కెట్లోనూ సత్తా చాటాలని గట్టిగా ప్రయత్నిస్తోంది. అయితే ఇందులో వాస్తవమెంతో ఇప్పటిదాకా ఎవరికీ తెలియదు. గూగుల్ కంపెనీ కూడా దీనిమీద ఎటువంటి వివరాలను బహిర్గతం చేయలేదు. కాగా హైఎండ్ ఫోన్లను కంపెనీ ఈ మధ్య విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు కొత్తగా మిడ్ రేంజ్ ధరలో కూడా ఫోన్లను విడుదల చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

గూగుల్ కంపెనీ ఈ ఏడాదిలో మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి తీసుకురానుంది...
లీకయిన రిపోర్టుల ప్రకారం గూగుల్ కంపెనీ ఈ ఏడాదిలో మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి తీసుకురానుంది. ఇంందులో భాగంగా ARCore APK కోడ్ తో గూగుల్ కంపెనీ పేటెంట్లను పొందనట్లు తెలుస్తోంది.

గూగుల్ ఫిక్సల్ ఫోన్ల పేర్లు వరసగా Bonito, Sargoలుగా రిజిస్టర్ అయినట్లు తెలుస్తోంది...
ఈ కోడ్ నేమ్ ల ప్రకారం రానున్న గూగుల్ ఫిక్సల్ ఫోన్ల పేర్లు వరసగా Bonito, Sargoలుగా రిజిస్టర్ అయినట్లు తెలుస్తోంది. ఈ ఫోన్లలో గూగుల్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 710 ప్రాసెసర్ను పొందుపర్చినట్లు సమాచారం. అయితే దీనిపై అధికారికంగా ఎటువంటి సమాచారం అందుబాటుల లేదు. రిపోర్టులు మాత్రం లీకయ్యాయి.

Pixel 3, Pixel 3XL...
కాగా గూగుల్ గత నెలలో Pixel 3, Pixel 3XL ఫోన్లను లాంచ్ చేసిన సంగతి అందరికీ తెలిససిందే. గూగుల్ ఫిక్సల్ 3 ధర రూ.71,000గానూ Pixel 3XL ధరను 83,000గానూ నిర్ణయించింది.

ఆండ్రాయిడ్ 9.0 మీద ఆపరేట్ కానున్నాయి...
ఈ రెండు ఫోన్లు ఆండ్రాయిడ్ 9.0 మీద ఆపరేట్ కానున్నాయి. అలాగే Qualcomm Snapdragon 845 processorతో అందుబాటులోకి వచ్చాయి. 4 జిబి ర్యామ్ అలాగే 64జిబి, 128జిబిలతో వచ్చాయి.

గూగుల్ నుంచి డ్యూయెల్ సెల్ఫీ కెమెరాతో వచ్చిన మొట్ట మొదటి ఫోన్లు కూడా ఇవే...
కాగా గూగుల్ నుంచి డ్యూయెల్ సెల్ఫీ కెమెరాతో వచ్చిన మొట్ట మొదటి ఫోన్లు కూడా ఇవేనని తెలుస్తోంది. ఫిక్సల్ 3 8 ఎంపీ వైడ్ యాంగిల్ కెమెరా f/2.2 aperture and 97-degree field of viewతో వచ్చింది. సెకండరీ కెమెరా కింద 8 ఎంపీ f/1.8 aperture and 75-degree field of viewతో పాటు phase detection autofocusతో వచ్చింది. 4కెలో వీడియోలను షూట్ చేయవచ్చు.


Click it and Unblock the Notifications








