ఎగ్జిబిషన్‌కు ముస్తాబవుతున్న జడ్‌టీఈ స్మార్ట్‌ఫోన్స్!!

By Prashanth
|
ZTE-MWC 2012


బార్సిలోనాలో నిర్వహించనున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌‌‌కు సమయం దగ్గర పడుతున్న నేపధ్యంలో గ్యాడ్జెట్ ప్రేమికులలో ఉత్సాహం నెలకుంది. ఈ వేదిక పై తమ తమ గ్యాడ్జెట్‌లను ప్రదర్శించేందకు పలు బ్రాండ్లు ఉవ్విలూరుతున్నాయి. ఎల్‌జీ, హువావీ వంటి ప్రముఖ మొబైల్ తయారీ సంస్థలు హై ఎండ్ స్మార్ట్‌ఫోన్‌లను ఈ కార్యక్రమంలో ఆవిష్కరించేందుకు కసరత్తులు పూర్తి చేశాయి. ఈ వేదిక పై ZTE ప్రవేశపెట్టబోతున్న రెండు అత్యుత్తమ స్మార్ట్ ఫోన్‌ల పై పలువురిలో ఉత్కంఠ నెలకుంది. పీఎఫ్200, ఎన్910 మోడల్స్‌లో రూపుదిద్దుకున్న ఈ స్మార్ట్ ఫోన్‌లలో ఒకటి హై ఎండ్ మొబైల్ కాగా మరొకటి మిడ్‌రేంజ్ ఫోన్.

ఫీచర్లు:

ZTE ఫీఎఫ్200:

* 4.3 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 960 x 540 పిక్సల్స్),

* 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,

* 1.2 GHz డ్యూయల్ కోర్ ప్రాసెసర్,

ZTE ఎన్910:

* సీడీఎమ్ఏ నెట్‌వర్క్ సపోర్ట్,

* 1.5 GHz సింగిల్‌కోర్ ప్రాసెసర్,

* 5 మెగా పిక్సల్ ఎల్ ఈడి ఫ్లాష్ కెమెరా విత్ ఆటోఫోకస్,

* 1080 పిక్సల్ హై డెఫినిషన్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

* వైఫై, బ్లూటూత్, LTE సపోర్ట్

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X