ఇది బ్రౌజర్ కాదు బ్రహ్మాండం!!

Posted By: Staff

ఇది బ్రౌజర్ కాదు బ్రహ్మాండం!!

 

ఆండ్రాయిడ్ ఆధారిత డివైజుల కోసం యూసీ బ్రౌజర్ ఒకటి రూపుదిద్దుకుంది. సహజంగా కనిపించే ఈ యూజర్ ఫ్రెండ్లీ బ్రౌజర్ వేగవంతమైన నెట్ బ్రౌజింగ్‌కు సహకరిస్తుంది. రెప్ప పాటులో కావల్సిన వెబ్‌సైట్ లోడైపోతుంది.  గుగూల్ ప్లే స్టోర్‌లోకి ప్రవేశించి ఉచితంగా యూసీ(UC) బ్రౌజర్ అప్లికేషన్‌ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్‌లో నిక్షిప్తం చేసిన వాయిస్ రికగ్నిషన్ ఫీచర్ బ్రౌజింగ్ వేగాన్ని రెట్టింపు చేస్తుంది. ఈ ఫీచర్ సౌలభ్యతతో కీప్యాడ్ సాయంలేకుండా కేవలం నోటి సంజ్ఞలతో బ్రౌజింగ్ నిర్వహించుకోవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా 150 దేశాల్లోని, 300 మిలియన్ల యూజర్లు ఈ బ్రౌజర్ సేవలు పొందుతున్నారు.  వివిధ ఆండ్రాయిడ్ ఆధారిత మొబైల్ ప్లాట్ ఫామ్‌లను ఈ అప్లికేషన్ సపోర్ట్ చేస్తుంది.

యూసీ బ్రౌజర్ ప్రధాన ఫీచర్లు:

-   మల్టీటచ్ సపోర్ట్,

-   వీవోఎక్స్ (వాయిస్ కంట్రోల్),

-   క్లౌడ్ యాక్సిలరేషన్,

-   ఆర్ఎస్ఎస్ రీడర్,

-   ఆటో-ఫోకస్,

-   పోర్ట్యుగీస్ లాంగ్వేజ్ సపోర్ట్.

యూసీ బ్రౌజర్ పనితీరుకు సంబంధించిన విజువల్స్ కోసం, ఈ వీడియోను తిలకించండి

Click Here for Video

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot