Home
Mobile

Aadhaar Update ఆధార్‌ కార్డును అప్‌డేట్‌ చేశారా.. గడువు ముగిశాక ఏం జరుగుతుందో తెలుసా..?

ఆధార్‌ కార్డు ప్రస్తుతం కచ్చితంగా కలిగి ఉండాల్సిన కార్డుల్లో ఒకటిగా ఉంది. ప్రభుత్వాలు అనేక పథకాల అమల్లో భాగంగా లబ్ధిదారుల ఎంపికలో ఆధార్‌ కార్డు కీలకంగా ఉంది. దీంతోపాటు సిమ్‌ కార్డుల కొనుగోలు, బ్యాంకింగ్‌ సేవల్లో ఆధార్‌ కార్డును ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం ఆధార్‌ కార్డులోని వివరాలను అప్‌డేట్‌ చేసుకొనేందుకు ఆధార్‌ ప్రాధికార సంస్థ UIDAI అవకాశం కల్పించింది. ప్రస్తుతం ఆధార్‌లోని పేరు, పుట్టిన తేదీ, అడ్రస్‌, ఫొటో వంటివి ఉచితంగా అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు.

ఉచితంగా ఆధార్‌ను అప్‌డేట్‌ :
గత 10 సంవత్సరాల్లో ఆధార్‌ కార్డులోని (Aadhaar Update) వివరాలను అప్‌డేట్‌ చేయకుంటే వెంటనే చేయాలని UIDAI సూచిస్తోంది. ఆధార్‌ కార్డులో పేరుతోపాటు అన్ని వివరాలను అప్‌డేట్‌ చేసుకొనేందుకు అవకాశం ఉంది. గత సంవత్సరం నుంచి అనేక సార్లు ఉచితంగా ఆధార్‌ను అప్‌డేట్‌ చేసుకొనేందుకు గడువు ఇచ్చింది.

UIDAI set a deadline to aadhaar update

తాజాగా ఈ గడువు డిసెంబర్‌ 14 తో ముగుస్తుంది. ఈ తేదీ తర్వాత ఆధార్‌ కార్డులోని వివరాలను అప్‌డేట్‌ చేసుకొనేందుకు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి అప్‌డేట్‌కు రూ.50 చెల్లించాల్సి ఉంటుంది. అయితే అడ్రస్‌, పుట్టిన తేదీని మైఆధార్‌ యాప్‌ లేదా వెబ్‌సైట్‌ ద్వారా మార్పులు చేసుకోవచ్చు. అయితే సంబంధిత ధ్రువీకరణ పత్రాలను అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది.

రెండు సార్లు మాత్రమే :
ఆధార్‌ కార్డులోని ఫొటో, పేరులో మార్పులకు ఆధార్‌ సేవా కేంద్రం, UIDAI అనుమతించిన కేంద్రాలకు వెళ్లాల్సి ఉంటుంది. మైఆధార్‌ పోర్టల్‌ ద్వారా ఉచితంగా వివరాలను ఉచితంగా అప్‌డేట్‌ చేసుకోవచ్చు. అయితే జీవిత కాలంలో ఆధార్‌ కార్డులోని పేరును రెండు సార్లు మార్చుకొనేందుకు మాత్రమే అవకాశం ఉంటుంది.

1947 నంబర్‌ :
ఆధార్‌ కార్డులోని వివరాల అప్‌డేట్‌ రిక్వెస్ట్‌లను త్వరగానే పరిష్కారం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న సమాచారం ఆధారంగా 90 శాతం విజ్ఞప్తులను 30 రోజుల్లోనే పరిష్కారం చేస్తున్నారు. అయితే ఈ గడువులోగా ఆధార్‌ కార్డులోని వివరాలు అప్‌డేట్‌ కాకుంటే 1947 నంబర్‌కు కాల్‌ చేసి ఫిర్యాదు చేయవచ్చు.

ఉచితంగా ఆధార్‌ కార్డును అప్‌డేట్‌ చేసుకొనే గడువును UIDAI (యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా) ఇప్పటికే అనేక సార్లు పొడిగించింది. 2023 డిసెంబర్‌ 15 నుంచి తొలిసారి మార్చి 14 వరకు గడువును పొడిగించింది. అనంతం ఆ తేదీని జూన్‌ 14 వ తేదీకి మార్చింది. ఆ తర్వాత సెప్టెంబర్ 14 వరకు అవకాశం కల్పించింది. ప్రస్తుతం ఆధార్‌ కార్డును ఉచితంగా అప్‌డేట్‌ చేసుకొనేందుకు డిసెంబర్ 14 వ తేదీని చివరి తేదీగా నిర్ధారించింది.

స్టెప్‌ 1 : తొలుత ఆధార్‌ వెబ్‌సైట్‌ను సందర్శించాలి. అనంతరం సెల్ఫ్‌ సర్వీస్‌ పోర్టల్‌ పైన క్లిక్‌ చేయాలి.
స్టెప్‌ 2 : అనంతరం వెబ్‌సైట్‌లో లాగిన్‌ కావాలి. ఇందుకోసం ఆధార్‌ నంబర్‌, OTP, Captcha కోడ్‌ను ఎంటర్‌ చేయాలి.

స్టెప్‌ 3 : ఆధార్‌ పోర్టల్‌లోకి లాగిన్‌ అయ్యాక.. వివరాలను సరిచూసుకోవాలి మరియు తప్పులుంటే మార్పులు చేయాలి.
స్టెప్‌ 4 : అనంతరం సంబంధిత ధ్రువపత్రాలను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలి.
స్టెప్‌ 5 : ఆధార్‌ వివరాలు అప్‌డేట్‌ అనంతరం చివరిగా సర్వీస్‌ రిక్వస్ట్‌ నంబర్‌ను పొందుతారు. సుమారు 30 రోజుల్లోగా వివరాలు అప్‌డేట్‌ కానున్నాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
UIDAI set a deadline to aadhaar update for free is december 14 after that every update will chargeable
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X