ఈ ఫోన్ శాశ్వతం : తడవదు, పగలదు, బడ్జెట్ ధరకే..
యూల్‌ఫోన్ సంస్థ 'ఆర్మర్ 2' పేరిట ఓ నూతన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది.
యూల్‌ఫోన్ సంస్థ 'ఆర్మర్ 2' పేరిట ఓ నూతన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే..అది 24 గంటలు నీటిలో ఉన్నా తడవదు. అలాగే పై నుంచి ఎత్తి వేసినా కింద పడదు. ఎందుకంటే ఈ ఫోన్ ను చాలా ధృడమైన మెటల్ తో తయారు చేశారు. 40 డిగ్రీల నుంచి 80 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలలోనూ ఈ ఫోన్‌ను నిరభ్యంతరంగా ఉపయోగించుకోవచ్చని కంపెనీ చెబుతోంది.

ధర రూ.17,300
ఈ నెల 15 నుంచి ఈ ఫోన్ అందుబాటులోకి వస్తోంది. దీని ధర రూ.17,300 గా ఉండనుంది.

గ్లాస్ ఫైబర్
గ్లాస్ ఫైబర్, రీయిన్‌ఫోర్స్‌డ్ పాలీకార్బొనేట్, మెటల్‌తో ఈ ఫోన్‌ను తయారు చేయడం వల్ల చాలా దృఢంగా, సురక్షితంగా ఉంటుంది.

డార్క్ గ్రే, గోల్డ్ రంగుల్లో
ఇక ఈ ఫోన్‌లో ఏర్పాటు చేసిన ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌తో ఫోన్‌ను కేవలం 0.1 సెకండ్ల టైంలోనే అన్‌లాక్ చేసుకోవచ్చు. డార్క్ గ్రే, గోల్డ్ రంగుల్లో ఈ ఫోన్ లభిస్తున్నది.

డిస్‌ప్లే
ఫీచర్ల విషయానికొస్తే.. 5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.6 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్

ర్యామ్
6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్

కెమెరా
16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా

ఫింగర్‌ప్రింట్ సెన్సార్
ఫింగర్‌ప్రింట్ సెన్సార్, బారోమీటర్, 4జీ ఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1, యూఎస్‌బీ టైప్ సి, ఎన్ఎఫ్‌సీ

బ్యాటరీ
4700 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, డ్యుయల్ సిమ్
Image source : Gizmo china


Click it and Unblock the Notifications








