రూ.6,000కే 3జీబి ర్యామ్ ఫోన్!

చైనా ఫోన్‌ల కంపెనీ Ulefone మార్కెట్లో సరికొత్త సంచలనానికి తెర తీసింది. కొద్ది గంటల క్రితం ఈ కంపెనీ అనౌన్స్ చేసిన Ulefone మెటల్ స్మార్ట్‌ఫోన్ బడ్జెట్ ఫ్రెండ్లీ 4జీ ఫోన్ మార్కెట్లో హాట్ టాపిక్‌గా నిలిచింది.

Read More : ఓపెన్ సేల్ పై షియోమీ Mi Max

రూ.6,000కే 3జీబి ర్యామ్ ఫోన్!

మెటల్ యునిబాడీ డిజైన్, 5 అంగుళాల హైడెఫినిషన్ స్ర్కీన్, 2.5డి కర్వుడ్ కార్నింగ్ గ్లాస్, 3జీబి ర్యామ్ వంటి విప్లవాత్మక ఫీచర్లతో రాబోతున్న ఈ ఫోన్ ధర భారత్‌లో రూ.6,000 నుంచి రూ.8,000 మధ్య ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ఫోన్‌లోని 6 టాప్ ఫీచర్లను పరిశీలించినట్లయితే...

Read More : Factory Reset చేస్తే ఫోన్ డేటా డిలీట్ అయిపోతుందా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డిస్‌ప్లే

Ulefone మెటల్ స్మార్ట్‌ఫోన్ 5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లేతో వస్తోంది. స్ర్కీన్ రిసల్యూషన్ వచ్చేసరికి 1280 x 720పిక్సల్స్. ఏర్పాటు చేసిన కార్నింగ్ గ్లాస్ 3 ప్రొటెక్షన్ డిస్‌ప్లేకు రక్షణ కవచంలా ఉంటుంది.

ప్రాసెసర్‌...

Ulefone మెటల్ స్మార్ట్‌ఫోన్, 1.3గిగాహెర్ట్జ్ క్లాక్ వేగంతో కూడిన ఆక్టా-కోర్ మీడియాటెక్ ఎంటీ6753 ప్రాసెసర్‌తో వస్తోంది. ప్లాసెసర్‌కు జోడీగా ఏర్పాటు చేసిన మాలీ-టీ720 జీపీయూ ఫోన్ గ్రాఫిక్ విభాగాన్ని చూసుకుంటుంది.

ర్యామ్, ఇంటర్నల్ స్టోరేజ్

Ulefone మెటల్ స్మార్ట్‌ఫోన్.. 3జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ వంటి శక్తివంతమైన ఇంటర్నల్ స్పెక్స్‌ను కలిగి ఉంది. డివైస్‌లో ఏర్పాటు చేసిన మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ఆప్షన్ ద్వారా మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,

కెమెరా

కెమెరా విషయానికి వచ్చేసరికి Ulefone, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలతో వస్తోంది.

ఆపరేటింగ్ సిస్టం

ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం పై ఫోన్ రన్ అవుతుంది.

కనెక్టువిటీ ఆప్షన్స్

ఫోన్ కనెక్టువిటీ ఆప్షన్స్ పరిశీలించినట్లయితే.. ఫింగర్ ప్రింట్ స్కానర్, 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, యూఎస్బీ ఆన్ ద గో.

బ్యాటరీ

Ulefoneలో శక్తివంతమైన 3050 ఎమ్ఏమెచ్ బ్యాటరీని పొందుపరిచారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Ulefone Metal Smartphone with Fingerprint Sensor Announced: All You Need to Know. Read More in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot