6జిబి ర్యామ్, 6080mAh బ్యాటరీ, ఫోన్ కేక బాసూ !

Written By:

Ulefone కంపెనీ తన లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ Ulefone Power 3ని అనౌన్స్ చేసింది. కాగా కంపెనీ నుంచి వచ్చిన పవర్ సీరిస్‌లో ఇది ధర్డ్ జనరేషన్ ఫోన్. 6080mAh Battery నాన్ రిమూవబుల్ బ్యాటరీతో 4 రోజుల బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే విధంగా ఫోన్ ఉంటుందని కంపెనీ చెబుతోంది. క్విక్ ఛార్జింగ్ సపోర్ట్ తో ఫీచర్ తో 120 మినిట్స్ లో పుల్ ఛార్జ్ అవుతుందని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది.

ఇండియా ఉద్యోగులను రోడ్డు మీదకు తెచ్చిన చైనా కంపెనీ !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

కెమెరా, ధర

16 ఎంపీ కెమెరాతో పాటు 5 ఎంపీ సెల్పీ కెమెరా ఉంది. దీని బరువు 210 గ్రాములు. కాగా ఇది ఇండియాకి ఎప్పుడు వస్తుందనే దానిపై కంపెనీ క్లారిటీ ఇవ్వలేదు. విదేశాల్లో దీని ధర 219.99 డాలర్లుగా ఉంది. మన కరెన్సీలో ఇది రూ. 19,210తో సమానం.

Android 8.1కు అప్‌గ్రేడ్

ఆండ్రాయిడ్ ఓరియో మీద రన్ అయ్యే ఈ ఫోన్ మార్చిలో రానున్న Android 8.1కు అప్‌గ్రేడ్ అయ్యే అవకాశం కూడా ఉంది.

మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే..

ఈ ఫోన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే కంపెనీ అఫిషియల్ వెబ్‌సైట్ http://ulefone.com/page-ulefonepower3-presale.htmlలోకి వెళ్లాల్సిందే. కాగా కేవలం 3000 ఫోన్లు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు కంపెనీ తెలిపింది. Jan 11 - Jan 16 మధ్యలో ఈ ఫోన్లు యూజర్ల చేతికి రానున్నాయి.

యూల్‌ఫోన్ పవర్ 3 ఫీచర్లు

6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్ (అప్‌గ్రేడబుల్ టు ఆండ్రాయిడ్ 8.1 ఓరియో), హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 16, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 13, 5 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.1, యూఎస్‌బీ టైప్ సి, 6080 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Ulefone Power 3 With a Huge 6080mAh Battery, 6-inch Full HD+ Display Officially Launched
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot