5 మెగా ఫిక్సల్ కెమెరా‌తో మైక్రోమ్యాక్స్ బ్లేడ్

Posted By: Super

5 మెగా ఫిక్సల్ కెమెరా‌తో మైక్రోమ్యాక్స్ బ్లేడ్

 

దేశీయ మొబైల్ దిగ్గజం మైక్రో‌మ్యాక్స్ కొంతమంది కస్టమర్స్‌ని టార్గెట్ చేసుకొని గత కొంతకాలంగా మార్కెట్లోకి మొబైల్స్‌ని విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. అత్యుధునిక ఫీచర్స్‌తోటి ఇండియన్ మొబైల్ మార్కెట్లోకి మైక్రోమ్యాక్స్ తాను సృష్టించిన డ్యూయల్ సిమ్ మొబైల్ ఫోన్ 'మైక్రోమ్యాక్స్ ఎక్స్55 బ్లేడ్'ని విడుదల చేయనుంది. డ్యూయల్ సిమ్‌ని ప్రత్యేకంగా మైక్రోమ్యాక్స్ విడుదల చేయడానికి కారణం ప్రస్తుతం ఇండియన్ మొబైల్ మార్కెట్లో డ్యూయల్ సిమ్ మొబైల్ ఫోన్స్ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న విషయం తెలిసిందే.

డ్యూయల్ సిమ్ ఫీచర్ ఉండడం యూజర్స్ ఏకకాలంలో రెండు నెట్ వర్క్‌లను ఉపయోగించుకునే వెసులు బాటు ఉంది. మైక్రోమ్యాక్స్ ఎక్స్55 బ్లేడ్ మొబైల్ వెనుక భాగాన ఉన్న 5 మెగా ఫిక్సల్ కెమెరా సహాయంతో హై డెఫినేషన్ వీడియో రికార్డింగ్ని నమోదు చేయవచ్చు. ఎల్‌ఈడి ఫ్లాష్ మొబైల్ ప్రత్యేకం. ఇందులో నిక్షిప్తం చేసిన ఆడియో, వీడియో ప్లేయర్స్ సహాయంతో మార్కెట్లో లభించే అన్ని రకాల ఆడియో, వీడియో ఫార్మెట్లను సపోర్ట్ చేస్తుంది.

మొబైల్‌తో పాటు స్టీరియో ఎఫ్‌ఎమ్ రేడియో ప్రత్యేకం. మొబైల్‌తో పాటు ఇంటర్నల్‌గా 8GB మెమరీ లభిస్తుండగా, ఇందులో ఉన్న మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా మెమరీని 32జిబి వరకు విస్తరించుకొవచ్చు. మొబైల్ స్క్రీన్ సైజు 2.4 ఇంచ్‌లు. పవర్‌పుల్ బ్యాటరీ బ్యాక్‌అప్‌ని అందించేందుకు గాను ఇందులో Li-ion 800 mAh నిక్షిప్తం చేయడం జరిగింది.

మైక్రోమ్యాక్స్ ఎక్స్55 బ్లేడ్ మొబైల్ ప్రత్యేకతలు:

చుట్టుకొలతలు: 118.2×51.4×10.3 mm

నెట్ వర్క్: 2G

డ్యూయల్ సిమ్ :Dual SIM GSM

డిస్ ప్లే: 2.4 inch LCD Display, 240 x 320 pixels resolution screen

కెమెరా :5 MP Camera with Flash, HD video Recording

ఆడియో & వీడియో: Multi format Video / Music Player

ఎఫ్ ఎమ్ రేడియో :FM Radio with RDS

ఆడియో జాక్ :3.5 mm jack

ఇంటర్నల్ మెమెరీ :44MB Internal memory

విస్తరించుకునే మెమరీ :up to 8GB external memory support

సోషల్ నెట్ వర్కింగ్ ఫీచర్స్ :Social Networking & IM

కనెక్టివిటీ ఫీచర్స్ :Bluetooth, USB and WAP data connectivity

బ్యాటరీ: 800 mAh Standard

టాక్ టైమ్: 4 hours approx

స్టాండ్ బై టైమ్ : up to 8 days approx

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot