ఓ బియ్యం కంపెనీ కథ!

Posted By: Prashanth

ఓ బియ్యం కంపెనీ కథ!

 

నాణ్యమైన బియ్యాన్ని సమకూర్చే ప్రముఖ అమెరికా కంపెనీ అంకుల్ బెన్ తాజాగా స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలోకి ఎంట్రీ ఇచ్చింది. అత్యాధునిక స్పెసిఫికేషన్‌ల‌తో ఈ సంస్థ డిజైన్ చేస్తున్న స్మార్ట్‌ఫోన్ ‘బాసుమతి’ ఈ ఏడాదిలోనే అందుబాటులోకి రానుంది. సరికొత్త ప్రొప్రైటరీ ఆపరేటింగ్ సిస్టం పై హ్యాండ్‌సెట్ రన్ అవుతుంది. శక్తివంతమైన డ్యూయల్ కోర్ ప్రాసెసర్‌ను వినియోగించారు.

అంకుల్ బెన్ ‘బాసుమతి’ స్మార్ట్‌ఫోన్ కీలక ఫీచర్లు:

5.3 అంగుళాల డిస్‌ప్లే (సాంద్రత 285పీపీఐ), శక్తివంతమైన డ్యూయల్‌కోర్ ప్రాసెసర్, ప్రొప్రైటరీ ఆపరేటింగ్ సిస్టం, 8మెగా పిక్సల్ రేర్ కెమెరా, ఉత్తమ బ్రౌజింగ్ ఆప్షన్స్, ఆడోబ్ ఫ్లాష్ సపోర్ట్, 4జీ స్పీడ్ వెబ్ బ్రౌజింగ్.

నవంబర్‌లో ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది. ఫోన్ ఇతర ఫీచర్లకు సంబంధించి సమాచారం తెలియాల్సి ఉంది. సమర్థవంతమైన స్పెసిఫికేషన్‌లతో వృద్ది చెందుతోన్న అంకుల్ బెన్ ‘బాసుమతి’ స్మార్ట్‌ఫోన్ ఆపిల్, సామ్‌సంగ్‌లకు గట్టిపోటీనివ్వగలదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting