ఫోన్ కోసం కూతురిని అమ్మేసిన దంపతులు!

|
ఫోన్ కోసం కూతురిని అమ్మేసిన దంపతులు!

యాపిల్ ఫోన్ ఇంకా లగ్జరీ ఉత్పత్తుల పై మోజు పెంచుకున్న ఓ కసాయి తల్లిదండ్రులు కన్నకూతురినే అమ్ముకున్న ఉదంతమిది. ఫలితంగా క్రమినల్ శిక్షలను అనుభవిస్తున్నారు. చైనా మీడియా వెల్లిండిచిన వివరాల మేరకు..... చైనాలోని షాంగై ప్రాంతానికి చెందిన యువ దంపతులు మిస్ జాంగ్, మిస్టర్ టెంగ్‌లు తమకు జన్మించిన బేబి పసికందును ఆన్‌లైన్ మార్కెట్లో 50,000 యువాన్‌లకు అమ్మకానికి ఉంచారు. ఈ చర్యను తీవ్రంగా పరిగణించిన షాంగై పోలీసులు ఆరోపణలకు ఎదుర్కొంటున్న దంపతులు మానవ అక్రమ రవాణా కేసులను బనాయించి విచారిస్తున్నారు. పసికందును విక్రయించటం ద్వారా వచ్చిన సొమ్ముతో ఆ దంపతులు యాపిల్ కొత్తవర్షన్ ఐపోన్, లగ్జరీ బూట్లతో పాటు ఇతర ఖరీదైన వస్తువులను కొనుగోలు చేసినట్లు చైనా మీడియా పేర్కొంది. చైనాలో ఈ తరహా సంఘటనలు కొత్తేమి కాదు.

 

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ఐప్యాడ్ కోసం కిడ్నీ అమ్ముకున్న ఘనుడు!!

గడిచిన ఏడాది టెక్ ప్రపంచంలో చోటుచేసుకున్న ఓ సంచలనాత్మక ఘటనకు సంబంధించి ఐదుగురు వ్యక్తులను చైనా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలు కింది విధంగా ఉన్నాయి. చైనాకు చెందిన ఓ 15ఏళ్ల యువకుడు ఆపిల్ ఐప్యాడ్-2 కోసం తన కిడ్నీని అమ్మకున్నాడు. అక్రమ కిడ్నీల వ్యాపారంలో ప్రమేయమున్న ఐదుగురు వ్యక్తులు ఇతగాడికి $35,000 చెల్లించి సర్జరీ ద్వారా కిడ్నీని వేరు చేశారు. పాపం!! జరగాల్సిదంతా జరిగపోయింది. టెక్నాలజీ పై వెంపర్లాట ఆ యువకుడిని ప్రాణ సంకటంలో పడేసింది.

సర్జరీ అనంతరం అనారోగ్యానికి గురైన సదరు యువకుడు జరిగిన విషయాన్ని తల్లిగి పూసగుచ్చినట్లు వివరించాడు. లబో దిబో మన్నా లాభమేముంది చెప్పండి. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు కిడ్నీ కోనుగోలులో ప్రమేయమున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన సూత్రదారైన హీ వై‌ను పోలీసులు విచారిస్తున్నారు. ఇప్పుడు ఐప్యాడ్-2 ధర సగానికి సగం పడిపోయింది. అమ్ముకున్న ఆ కిడ్నీ తిరిగి వస్తుందా..?, ఆ యువకుడి ఆరోగ్యం కుదటపడుతుందా..?, ఆలోచించండి ఇతర సుఖాల కోసం అవయువాలను అమ్ముకోవద్దు.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X