అతి చిన్న ఫోన్ Jelly Pro రివ్యూ..

Written By:

ప్రపంచంలోనే అత్యంత చిన్నదైన ఫోన్ Jelly Proను గతవారం చైనా కంపెనీ Unihertz లాంచ్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అత్యంత తక్కువ సైజ్ లో ఈ ఫోన్ ఎంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. 2.45 అంగుళాల డిస్ ప్లేతో వచ్చిన ఈ ఫోన్ వినియోగదారులను ఇట్టే ఆకట్టుకుంటోంది. దీని ఫీచర్లు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. 1 జిబిర్యామ్ ఫోన్ 79 డాలర్లుగానూ, 2 జిబి ర్యామ్ ఫోన్ 92 డాలర్లగా ధర ఉంది. ఇక ఇవి మార్కెట్లోకి వస్తే 30 డాలర్లు పెరిగే అవకాశం ఉందని రిపోర్టులు తెలియజేస్తున్నాయి. ఇక రివ్యూ విషయానకొస్తే..

జియో ఉచిత వైఫై, వారికి మాత్రమే !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డిజైన్

ఇది అత్యంత చిన్నగా ఉండి మీ పాకెట్లో ఎక్కడైనా ఇట్టే ఇమిడిపోతుంది. ఫోన్ ఎక్కడ పెట్టుకోవాలన్న టెన్సన్ కు మీరు బైబై చెప్పేయవచ్చు. దీని చుట్టు కొలత కూడా చుట్టుకొలత 92.3 x 43 x 13.3మిల్లీమీటర్లు. ఈ ఫోన్ డిస్‌ప్లే సైజు కేవలం 2.45 అంగుళాలు మాత్రమే ఉంటుంది. ఫోన్ మొత్తం పొడవు 3.6 అంగుళాలు ఉంటుంది.

జెల్లీ ప్రో వర్సెస్ లార్జ్ స్క్రీన్ ఫోన్స్

ఈ బుడ్డ ఫోన్ స్క్రీన్ చూసేందుకు అచ్చం రెడ్ మి నోట్ 4 లాగానే ఉంటుంది. కాకుంటే సైజుల్లో తేడా అంతే. దీన్ని అతి చిన్న ఫోన్ అంటే ఇష్టపడేవారు వాడుకోవచ్చు.

డిస్ ప్లే

ఈ ఫోన్ డిస్‌ప్లే సైజు కేవలం 2.45 అంగుళాలు మాత్రమే ఉంటుంది. ఫోన్ మొత్తం పొడవు 3.6 అంగుళాలు ఉంటుంది. చుట్టుకొలత 92.3 x 43 x 13.3మిల్లీమీటర్లు.

హార్డ్ వేర్

MediaTek MT6735 SoC తో పాటు జెల్లీ స్మార్ట్‌ఫోన్ 1జీబి ర్యామ్ అలానే 8జీబి స్టోరేజ్ కెపాసిటీని కలిగి ఉంటుంది. ఇదే మయంలో జెల్లీ ప్రో మోడల్ ఫోన్ 2జీబి ర్యామ్ అలానే 16జీబి స్టోరేజ్ కెపాసిటీని కలిగి ఉంటుంది. 950mAh బ్యాటరీతో ఈ ఫోన్ ఫిట్ అయి వస్తోంది.

కెమెరా

కెమెరా విషయానికి వచ్చేసరికి ఈ ఫోన్ 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ అలానే 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలతో వస్తోంది. ఇతర ఫోన్లకు ధీటుగా మీరు ఫోటోలు తీసుకునే అవకాశం ఉంది. క్వాలిటీ కూడా అదే రేంజ్ లో ఉంటుంది.

HDR mode turned on

ఈ ఫీచర్ ఆన్ చేసినప్పుడు ఫోటో తీస్తే ఈ విధంగా ఉంటుంది.

HDR mode turned of

ఈ ఫీచర్ ఆఫ్ చేసినప్పుడు ఫోటో తీస్తే ఈ విధంగా ఉంటుంది.

సెల్ఫీ

ఈ ఫీచర్ ఆన్ చేసినప్పుడు సెల్ఫీ ఫోటో తీస్తే ఈ విధంగా ఉంటుంది.

beautification mode turned on

ఈ ఫీచర్ తో సెల్ఫీ దిగితే ఆ లుక్ ఏ విధంగా ఉంటుందో ఈ ఫోటోలో చూడవచ్చు.

సాఫ్ట్‌వేర్

ఫీచర్ ఫోన్ సైజులో కనిపిస్తోన్న ఈ స్మార్ట్‌ఫోన్ ఏకంగా ఆండ్రాయిడ్ నౌగట్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది.. సరిగ్గా అరచేతిలో ఇమిడిపోయే ఈ ఫోన్‌లో సమస్త ప్రపంచాన్ని వీక్షించే వీలుంటుంది.

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Unihertz Jelly Pro review: It's not just world's smallest 4G smartphone, but much more Read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot