ప్రపంచపు అతిచిన్ని 4జీ స్మార్ట్‌ఫోన్ (ఫోటో గ్యాలరీ)

షాంఘైకు చెందిన Unihertz అనే కంపెనీ Jelly Pro పేరుతో ప్రపంచపు అతిచిన్న స్మార్ట్‌ఫోన్‌ను రూపొందించి సరికొత్త రికార్డును నెలకొల్పింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

2.45 అంగుళాల డిస్‌ప్లే...

ఈ ఫోన్ డిస్‌ప్లే సైజు కేవలం 2.45 అంగుళాలు మాత్రమే ఉంటుంది. ఫోన్ మొత్తం పొడవు 3.6 అంగుళాలు ఉంటుంది. చుట్టుకొలత 92.3 x 43 x 13.3మిల్లీమీటర్లు.

చిన్న సైజు స్మార్ట్‌ఫోన్‌లను ఇష్టపడే వారి కోసం...

చిన్న సైజు స్మార్ట్‌ఫోన్‌లను ఇష్టపడే వారిని దృష్టిలో ఉంచుకుని, ఈ ప్రాజెక్టును ప్రారంభించినట్లు Unihertz కంపెనీ చెబుతోంది. జెల్లీ, జెల్లీ ప్రో పేర్లతో రెండు వేరియంట్‌లలో ఈ ఫోన్‌లు అందుబాటులో ఉంటాయి.

డ్యుయల్ సిమ్ సపోర్ట్...

Jelly Pro స్మార్ట్‌ఫోన్ రెండు GSM సిమ్ కార్డ్ స్లాట్‌లతో వస్తోంది. ఏకకాలంలో రెండు నెట్‌వర్క్‌లను సపోర్ట్ చేయగలిగే ఈ ఫోన్ తరచూ ప్రయణాలు చేసే వారికి ఈ బెస్ట్ ఛాయిస్.

ఆండ్రాయిడ్ నౌగట్ ఆపరేటింగ్ సిస్టం..

ఫీచర్ ఫోన్ సైజులో కనిపిస్తోన్న ఈ స్మార్ట్‌ఫోన్ ఏకంగా ఆండ్రాయిడ్ నౌగట్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది.. సరిగ్గా అరచేతిలో ఇమిడిపోయే ఈ ఫోన్‌లో సమస్త ప్రపంచాన్ని వీక్షించే వీలుంటుంది.

మన్నికైన ప్లాస్టిక్ బాడీతో...

మన్నికైన ప్లాస్టిక్ మెటీరియల్‌తో రూపుదిద్దుకున్న Jelly Pro స్మార్ట్‌ఫోన్ స్టర్డీ ఫీల్‌తో మంచి గ్రిప్‌ను ఆఫర్ చేస్తుంది. ఫోన్ బ్యాక్ ప్యానల్ కూడా రిమూవబుల్.

ముఖ్యమైన పోర్ట్స్ ఈ ఫోన్‌లో ఉన్నాయి...

Unihertz జెల్లీ ప్రో స్మార్ట్‌ఫోన్‌లో ఫ్రంట్ ఇంకా రేర్ ఫేసింగ్ కెమెరాలతో పాటు పవర్ బటన్, వాల్యుమ్ రాకర్, మైక్రో యూఎస్బీ పోర్ట్, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్ ఇంకా మూడు టచ్ కెపాసిటివ్ బటన్స్ ఉన్నాయి.

8 మెగా పిక్సల్ + 2 మెగా పిక్సల్

కెమెరా విషయానికి వచ్చేసరికి ఈ ఫోన్ 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ అలానే 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలతో వస్తోంది.

క్వాడ్-కోర్ సాక్

ఈ స్మార్ట్‌ఫోన్‌ 1.1గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్ పై రన్ అవుతుంది. లోపల వినియోగించిన చిప్‌సెట్ గురించి తెలియాల్సి ఉంది.

950mAh బ్యాటరీ

950mAh బ్యాటరీతో ఈ ఫోన్ ఫిట్ అయి వస్తోంది. ఈ బ్యాటరీ టాక్ టైమ్ అలానే స్టాండ్ బై టైమ్‌కు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

ర్యామ్, స్టోరేజ్

జెల్లీ స్మార్ట్‌ఫోన్ 1జీబి ర్యామ్ అలానే 8జీబి స్టోరేజ్ కెపాసిటీని కలిగి ఉంటుంది. ఇదే మయంలో జెల్లీ ప్రో మోడల్ ఫోన్ 2జీబి ర్యామ్ అలానే 16జీబి స్టోరేజ్ కెపాసిటీని కలిగి ఉంటుంది.

ధర ఇంకా అందుబాటు

మార్కెట్లో Unihertz జెల్లీ స్మార్ట్‌ఫోన్ 1జీబి ర్యామ్ + 8జీబి స్టోరేజ్ వేరియంట్ ధర 79 డాలర్లు వరకు ఉండొచ్చు. 2జీబి ర్యామ్ + 16జీబి స్టోరేజ్ వేరియంట్ ధర 95 డాలర్లు వరకు ఉండొచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడేEnglish summary
Unihertz Jelly Pro: A Lilliput that is rich in features [in-pictures]. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting