దేశీయ జీఎస్‌ఎం రంగంలో తన కంటూ ఓ ప్రత్యేకతను నిలుపు కున్న ‘యునినార్’ మాన్‌సూన్ హంగామా పేరుతో కొత్త ఆఫర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భాగంగా ఈ నెల 31లోగా రూ.198 విలువగల రీచార్జ్ వోచర్‌ను కొనుగోలు చేసిన వినియోగదా రులకు పలు బహుమతులు అందించేందుకు సిద్దమైంది. దీనితోపాటు నెలరోజుల వ్యాలిడిటీగల 42,000 లోకల్ సెకన్లు, యునినార్ నుంచి యునినార్‌కు 1,20,000 లోకల్ సెకన్ల టాక్‌టైం లభిస్తుందని యుని నార్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ బిజినెస్ హెడ్ సతీష్‌కుమార్ కన్నన్ తెలిపారు. బహుమతుల్లో భాగంగా ఎల్సీడీ టీబీలు, రిఫ్రిజిరేటర్లు, డిజటల్ కెమెరా లు, ఐపాడ్స్, తదితర బహుమతులు ఉంటాయని కన్నన్ వెల్లడించారు.