వదంతులు నమ్మవద్దు : యునినార్!

Posted By: Staff

వదంతులు నమ్మవద్దు : యునినార్!

 

న్యూఢిల్లీ: 2జీ స్కామ్‌కు సంబంధించి 122 లైసెన్సులు రద్దు చేస్తూ సుప్రీం ధర్మాసనం వెలువరించిన తీర్పు నేపధ్యంలో యునినార్ టెలికాం చిక్కుల్లో పడింది. ఈ పరిణామాలు కారణంగా సంస్థ పై వ్యక్తమవుతున్న వదంతులను యునినార్ వర్గాలు ఖండించాయి. ఉద్యోగులను తొలగిస్తున్నారంటూ, జీతాలు కదిస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేసింది. తమ సేవలు కొనసాగుతున్నాయని, 3.6 కోట్ల మంది వినియోగదారులకు సేవలను కొనసాగిస్తామని, 22 వేల మంది భాగస్వాములతో మార్కెట్లో ముందుకు సాగుతున్నామని యూనినార్ వివరించింది.

తీర్పు విషయమై ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవలసి ఉందని, భారత వినియోగదారులకు ప్రయోజనకరంగా ఉండేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోగలదని అంచనా వేస్తున్నామని పేర్కొంది. తమ కార్యకలాపాలను మూసేసిది లేదని కంపెనీ నొక్కి చెప్పింది. రియల్టీ దిగ్గజం యూనిటెక్, నార్వేకు చెందిన టెలినార్‌లు కలిసి యూనినార్ జాయింట్ వెంచర్(జేవీ)ను ఏర్పాటు చేశాయి. యూనినార్‌లో టెలినార్‌కు 67.25 శాతం వాటా ఉంది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting