మీ ఫోన్ భద్రత కోసం బడ్జెట్లో రూ.15 కోట్లు కేటాయింపు, మీకోసం పూర్తి వివరాలు !

By Hazarath
|

మీరు మీ మొబైల్ పోయిందని బాధపడుతున్నారా..అందులో విలువైన సమాచారం ఇతరులు దొంగిలించే అవకాశం ఉందా.అయితే ఇకపై అలాంటి బాధ లేకుండా పోయిన ఫోన్ ను మీరు తిరిగి తెచ్చుకునే అవకాశం ఉందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నిన్న బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. ఫోన్ కోల్పోవడమేనేది కేవలం వ్యక్తికి జరిగిన నష్టంగానే కాకుండా దేశ భద్రతకు సంబంధించిన అంశంగా దీన్ని గుర్తించామని జైట్లీ బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. ఇందుకుగాను 15 కోట్ల రూపాయలు కూడా బడ్జెట్ లో కేటాయించామని తెలిపారు.

 

ఈ సోప్ ఖరీదు ఐఫోన్ 8తో సమానం, జస్ట్ రూ. 55వేలు మాత్రమే, ఫ్లిప్‌కార్ట్ నుంచి డెలివరీ !ఈ సోప్ ఖరీదు ఐఫోన్ 8తో సమానం, జస్ట్ రూ. 55వేలు మాత్రమే, ఫ్లిప్‌కార్ట్ నుంచి డెలివరీ !

ఐఎంఈఐ నెంబర్ ద్వారా ట్రాకింగ్

ఐఎంఈఐ నెంబర్ ద్వారా ట్రాకింగ్

మొబైల్ ఫోన్ చేజార్చుకున్నా, దొంగతనానికి గురైన సమీపంలోని పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు. ఆ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు సంబంధిత ఫోన్ ఐఎంఈఐ నెంబర్ ద్వారా ట్రాకింగ్ లో ఉంచుతారు. దాంతో ఎవరైనా వ్యక్తి ఆ ఫోన్‌లో తన సిమ్ కార్డు వేసుకుని వాడినట్టయితే పోలీసులకు ఫోన్ వాడుతున్న అడ్రస్ వెంటనే తెలిసిపోతుంది. దాంతో చోరీకి , లేదా మిస్సింగ్ అయిన ఫోన్ ను గుర్తించవచ్చని అరుణ్ జైట్లీ తెలిపారు.

సరైన విధివిధానాలు లేక..

సరైన విధివిధానాలు లేక..

అయితే ఇప్పటికే ఈ విధానం అందుబాటులో ఉంది కానీ సరైన విధివిధానాలు లేక పోలీసులు సతమతమవుతున్నారని, ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో తగిన నిధులు కేటాయించి దీని పటిష్టతకు సెంట్రల్‌ ఎక్వి‌ప్‌మెంట్స్‌ ఐడెంటిఫై రిజిస్టర్‌ (సీఈఐఆర్‌) పేరుతో టెలికం శాఖ (డీవోటీ) ఆధ్వర్యంలో చర్యలు చేపట్టిందని అన్నారు.

ఫిర్యాదు చేసే సమయంలో..
 

ఫిర్యాదు చేసే సమయంలో..

అయితే ఫిర్యాదు చేసే సమయంలో పోలీసులకు ఫోన్ యొక్క ఐఎంఈఐ నంబర్‌ను చెబితే సరిపోతుందని ఆయన అన్నారు. కాగా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే మొబైల్స్‌పై Customs dutyని 20శాతానికి పెంచుతున్నట్లు బడ్జెట్లబ ప్రకటించిన సంగతి తెలిసిందే.

ముందస్తు జాగ్రత్తలను పాటించటం ద్వారా..

ముందస్తు జాగ్రత్తలను పాటించటం ద్వారా..

పలు ముందస్తు జాగ్రత్తలను పాటించటం ద్వారా అపహరణకు గురైన ఫోన్‌ను సునాయాసంగా వెతికిపట్టచుకోవచ్చు. అవేంటో ఓ స్మార్ట్ లుక్కేద్దామా..

వివరాలు భద్రపరుచుకోండి:

మీ ఫోన్‌కు సంబంధించిన వివరాలను రికార్డు రూపంలో భద్రపరచుకోవటం మంచిది. ఫోన్ ప్రమాదాలకు గురైన సమయాల్లో ఈ వివరాలు ఉపయోగపడతాయి. భద్రపరచాల్సిన వివరాలు: - ఫోన్ నెంబరు - మోడల్ నెంబరు - రంగు ఇతర గుర్తుల సమాచారం, - పిన్ లేదా సెక్యూరిటీ లాక్ కోడ్, - ఐఎమ్ఈఐ నెంబరు.

ఐఎమ్ఈఐ (IMEI)నెంబర్:

ఐఎమ్ఈఐ (IMEI)నెంబర్:

ప్రతి మొబైల్ లేదా స్మార్ట్‌ఫోన్‌కు ఐఎమ్ఈఐ (IMEI)నెంబర్ తప్పనిసరిగా కేటాయించటం జరుగుతుంది. ‘*#06#'కు డయిల్ చేయటం ద్వారా 15 అంకెలతో కూడిన మీ ఫోన్ ఐఎమ్ఈఐ నెంబరును తెలుసుకోవచ్చు. భవిష్యత ఉపయోగం కోసం ఈ నెంబరును భద్రపరుచటం మంచిది. ఫోన్ వెనుక భాగంలో అంటే బ్యాటరీ క్రింది ప్రదేశంలో ఈ నెంబర్‌ను మీరు చూడవచ్చు. ఫోన్ అపహరణకు గురైన సమయంలో పోలీసులను ఆశ్రయించాల్సి వస్తే తప్పనిసరిగా సదరు మొబైల్ ఐఎమ్ఈఐ (IMEI)నెంబర్‌ను ఎఫ్ఐఆర్ పత్రంలో పొందుపరచాల్సి ఉంటుంది. మొబైల్‌ను కనుగొనటంలో ఐఎమ్ఈఐ నెంబర్ కీలక పాత్ర పోషిస్తుంది.

అవాస్త్ మొబైల్ సెక్యూరిటీ ( Avast! mobile security):

అవాస్త్ మొబైల్ సెక్యూరిటీ ( Avast! mobile security):

ఈ సెక్యూరిటీ అప్లికేషన్ మీ స్మార్ట్‌ఫోన్‌కు రెండు విధాలుగా రక్షణ కల్పిస్తుంది. మొబైల్‌లోకి వైరస్ ప్రవేశించికుండా నివారించటమే కాకుండా మొబైల్ ట్రాకింగ్ వంటి రక్షణ వ్యవస్థను ఈ యూప్ ఏర్పరుస్తుంది. ఈ యూప్‌లో పొందుపరిచిన యాంటీ-తెఫ్ట్ కాంపోనెంట్ ఫోన్ అపహరణకు గురైన సందర్భంలో ఆచూకీకి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు సందేశాల రూపంలో అందిస్తుంది.

మొబైల్ చేజ్ లోకేషన్ ట్రాకర్ (Mobile chase-location tracker):

మొబైల్ చేజ్ లోకేషన్ ట్రాకర్ (Mobile chase-location tracker):

ఈ అత్యుత్తమ అప్లికేషన్ అపహరణకు గురైన ఫోన్‌లను చేధించటంలో కీలకంగా వ్యవహరిస్తుంది. సదురు మొబైల్ ఫోన్‌ను దొంగిలించిన వ్యక్తి సిమ్ కార్డ్ మార్చినా లేక కొత్త సిమ్ నెంబర్ ద్వారా సందేశం పంపినా తక్షణమే మీకు సమాచారాన్ని ఈ అప్లికేషన్ స్టోర్ చేసుకుంటుంది

సెక్యూరిటీ మార్క్ తప్పనిసరి:

సెక్యూరిటీ మార్క్ తప్పనిసరి:

అల్ట్రా వైలెట్ పెన్‌ను ఉపయోగించి ఫోన్ ఇంకా బ్యాటరీ పైన మీ అడ్రస్ వివరాలను రాయండి. ఒకవేళ మీ ఫోన్ ఎవరికైనా దొరికినట్లయితే మిమ్మల్ని కాంటాక్ట్ చేసేందుకు ఆస్కారం ఉంటుంది.సెక్యూరిటీ లాక్ కోడ్ లేదా పిన్ కోడ్ ఫీచర్‌ను తప్పనిసరిగా ఉపయోగించుకోవాలి (Use the security lock code, or PIN feature, to lock your phone): సెక్యూరిటీ లాక్ కోడ్ లేదా పిన్ కోడ్ ఫీచర్‌ను ఉపయోగించటం ద్వారా అపహరణకు గురైన మీ ఫోన్‌లోని డేటాను ఎవరు చూడలేరు.

స్మార్ట్ లుక్ (Smart look):

స్మార్ట్ లుక్ (Smart look):

ఈ సాఫ్ట్‌వేర్, మీ మొబైల్ దొంగిలించిన వ్యక్తి ఫోటోను క్యాప్చర్ చేసి వెనువెంటనే మీ ఈ-మెయిల్‌కు చేరవేస్తుంది. అంతేకాదండోయ్ ఈ యూప్‌లో పొందుపరిచన కంటిన్యూస్ జీపీఎస్ ట్రాకింగ్ సిస్టం గూగుల్ మ్యాప్ సాయంతో ఫోన్ ఆచూకీని చేధించగలదు.

తీఫ్ ట్రాకర్ (Thief tracker):

ఈ అప్లికేషన్ సాయంతో ఫోన్ దొంగను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవచ్చు. మీ మొబైల్‌ను ఎవరైనా అన్‌లాక్ చేయడానికి ప్రయత్నించినట్లయితే తీఫ్ ట్రాకర్ ఆ వ్యక్తికి తెలియకుండానే ఫ్రంట్ కెమెరా ద్వారా అతని చిత్రాన్ని క్యాప్చర్ చేసి ఈ-మెయిల్‌కు పంపుతాయి. అయితే కొన్ని పరిమితులు లేకపోలేదు.

 

Best Mobiles in India

English summary
Union Budget 2018: Govewrnment allots Rs 15 cr for mobile phone tracking system More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X