మత్తెక్కిస్తున్న ఇటలీ అందం!!

ప్రముఖ మొబైల్ తయారీ బ్రాండ్ యునెక్టో ఇటలీ అందాలను రంగరించి ఉత్తమ క్వాలిటీ స్మార్ట్‌ఫోన్‌ను డిజైన్ చేసింది. డ్యూయల్ సిమ్ విశిష్టత కలిగిన ఈ స్మార్డ్ హ్యాండ్‌సెట్ పేరు ‘యునెక్టో క్వాట్రో’.అంతర్జాతీయ మార్కెట్లో త్వరలో లాంచ్ కానున్న ఈ డివైజ్ స్పెసిఫికేషన్‌ల పై ఓ లుక్ వేయండి...
యునెక్టో క్వాట్రో ప్రధాన ఫీచర్లు:
డ్యూయల్ సిమ్ స్లాట్,
4 అంగుళాల స్ర్కీన్ డిస్‌ప్లే,
5 మెగా పిక్సల్ కెమెరా,
వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
1400ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ఆండ్రాయిడ్ 2.3.5 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
సింగిల్ కోర్ 650 మెగాహెడ్జ్ మీడియా టెక్ 6573 ప్రాసెసర్.
నిక్షిప్తం చేసిన డ్యూయల్ సిమ్ స్లాట్ సౌలభ్యతతో యూజర్ ఏకకాలంలో రెండు నెట్‌వర్క్‌లను వినియోగించుకోవచ్చు. లోడ్ చేసిన ఆండ్రాయిడ్ 2.3.5 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం పనితీరును రెట్టింపు చేస్తుంది. 4 అంగుళాల స్ర్కీన్ ఉత్తమమైన డిస్‌ప్లే అనుభూతులను చేరువ చేస్తుంది. వెనుక భాగంలో అమర్చిన 5 మెగా పిక్సల్ కెమెరా ఉత్తమమైన ఫోటోగ్రఫీ విలువలను కలిగి ఉంటుంది. ముందు భాగంలో ఏర్పాటు చేసిన వీజీఏ కెమెరా ప్రత్యక్ష లైవ్ ఛాటింగ్‌కు ఉపకరిస్తుంది. జూన్ నాటికి ఈ డివైజ్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. భవిష్యత్‌లో ఈ హ్యాండ్‌సెట్‌కు ఆండ్రాయిడ్ 4.0 ఐసీఎస్ అప్‌డేట్‌ను ప్రకటించే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. ధర అంచనా రూ. 10,000 నుంచి 15,000.


Click it and Unblock the Notifications








