చైనా కంపెనీలకు పోటీగా కొత్త ఫోన్‌లు

లావా మొబైల్స్ అంతర్జాతీయ బ్రాండ్‌లకు ధీటుగా ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లను లాంచ్ చేస్తూ తనదైన శైలిలో దూసుకుపోతోంది.

|

వేగంగా అభివృద్ధి చెందుతోన్న స్మార్ట్‌ఫోన్ మార్కెట్లలో ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ ఒకటి. ముఖ్యంగా బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లకు భారత్‌లో మంచి డిమాంగ్ ఉంది. ఈ గిరాకీని ఇప్పటికే క్యాష్ చేసుకున్న షియోమీ, లెనోవో, హానర్, వివో, ఒప్పో వంటి చైనా కంపెనీలు మరింత దూకుడుగా ముందుకు సాగుతున్నాయి.

ఆధిపత్యానికి తెరదించే క్రమంలో...

ఆధిపత్యానికి తెరదించే క్రమంలో...

భారత్‌లో చైనా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌ల ఆధిపత్యానికి తెరదించే క్రమంలో లావా, ఇంటెక్స్, మైక్రోమాక్స్, స్వైప్ వంటి లోకల్ బ్రాండ్‌లు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. నోట్ల రద్దు తరువాత చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఇండియన్ బ్రాండ్‌లు మార్కెట్‌ను మరింత సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది.

లావా మొబైల్స్ నుంచి..

లావా మొబైల్స్ నుంచి..

ముఖ్యంగా లావా మొబైల్స్ అంతర్జాతీయ బ్రాండ్‌లకు ధీటుగా ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లను లాంచ్ చేస్తూ తనదైన శైలిలో దూసుకుపోతోంది. మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌ను టార్గెట్ చేస్తూ ఈ బ్రాండ్ నుంచి మరికొద్ది రోజుల్లో లాంచ్ కాబోతున్న లావా జెడ్25, లావా జెడ్10 స్మార్ట్‌ఫోన్‌లు అటు ధర పరంగా, ఇటు స్పెసిఫికేషన్స్ పరంగా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. లావా, ప్రతిష్టాత్మకంగా లాంచ్ చేయబోతోన్న ఈ ఫోన్‌లకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను ఇప్పుడు చూద్దాం..

ప్రీమియమ్ డిజైన్, స్టర్డీ ఫినిష్
 

ప్రీమియమ్ డిజైన్, స్టర్డీ ఫినిష్

లావా జెడ్10, లావా జెడ్25స్మార్ట్‌ఫోన్‌లు ప్రీమియమ్ డిజైన్ ఇంకా స్టర్డీ ఫినిషింగ్‌తో వస్తున్నాయి. మెటల్ బిల్డ్ ఇంకా యాంటీ స్ర్కేప్ బాడీ కారణంగా ఈ రెండు ఫోన్‌లు మరింత ధృడత్వాన్ని సంతరించుకుని ఉంటాయి. సిల్కీ మెటాలిక్ ఫినిష్ చేతుల్లో స్మూత్ ఫీల్‌ను కలిగిస్తుంది. ఫోన్‌కు సంబంధించిన స్పీకర్ స్లాట్స్, చార్జింగ్ పోర్ట్, వాల్యుమ్ రాకర్స్‌ను ఆపరేటింగ్‌కు అనువుగా సరైన స్థానాల్లో జాగ్రత్తగా అమర్చారు.

సినిమా వ్యూవింగ్ ఎక్స్‌పీరియన్స్‌తో హెచ్‌డి స్ర్కీన్

సినిమా వ్యూవింగ్ ఎక్స్‌పీరియన్స్‌తో హెచ్‌డి స్ర్కీన్

లావా జెడ్25, లావా జెడ్10 స్మార్ట్‌ఫోన్‌లలో అమర్చిన 5 ఇంచ్ అలానే 5.5 ఇంచ్ హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లేలు 720X1280 పిక్సల్ రిసల్యూషన్ కెపాసిటీతో సినీమాటిక్ వ్యూవింగ్ ఎక్స్‌పీరియన్స్‌ ను ఆఫర్ చేస్తాయి. ఈ ఫోన్‌లకు సంబంధించి డిస్‌ప్లే క్రింది భాగంలో ఏర్పాటు చేసిన మూడు టచ్ కెపాసిటివ్ బటన్స్ ఫోన్ ఆపరేటింగ్‌ను మరింత సులభతరం చేస్తాయి.

పవర్ ప్యాకుడ్ హార్డ్‌‌వేర్ ఇంకా సాఫ్ట్‌వేర్

పవర్ ప్యాకుడ్ హార్డ్‌‌వేర్ ఇంకా సాఫ్ట్‌వేర్

ఈ రెండు ఫోన్‌లకు సంబంధించి హార్డ్‌‌వేర్ అంశాలను పరిశీలించినట్లయితే.. లావా జెడ్10 ఫోన్ 1.3గిగాహెర్ట్జ్ క్లాక్ వేగంతో కూడిన మీడియాటెక్ MT6750 క్వాడ్‌కోర్ చిప్‌సెట్‌తో వస్తోంది. ఇదే సమయంలో లావా జెడ్25, 1.5గిగాహెర్ట్జ్ క్లాక్ వేగంతో కూడిన మీడియాటెక్ MT6750 ఆక్టా కోర్ చిప్‌సెట్‌తో వస్తోంది.

వేగవంతమైన మల్టీ టాస్కింగ్‌

వేగవంతమైన మల్టీ టాస్కింగ్‌

అంతరాయంలేని పనితీరుతో పాటు వేగవంతమైన మల్టీ టాస్కింగ్‌ను అందించే క్రమంలో లావా జెడ్25లోని ఆక్టా‌కోర్ చిప్‌సెట్‌లకు 4జీబి ర్యామ్‌తో పాటు 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్‌ను లావా జత చేసింది. మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశాన్ని కల్పించారు.

ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం

ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం

ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా అభివృద్ధి చేసిన స్టార్ ఓఎస్ 3.3 ప్లాట్‌ఫామ్ పై రన్ అవుతాయి. ఈ కస్టమ్ యూజర్ ఇంటర్‌ఫేస్‌ను విభిన్నమైన యూజర్ ఎక్స్‌పీరియన్స్‌‌ను ఆఫర్ చేస్తుంది.

బ్యాటరీ విషయానికి వచ్చేసరికి...

బ్యాటరీ విషయానికి వచ్చేసరికి...

బ్యాటరీ విషయానికి వచ్చేసరికి లావా జెడ్10 మోడల్ 2,650mAh బ్యాటరీతో, లావా జెడ్25 మోడల్ 3,050mAh బ్యాటరీలతో వస్తున్నాయి. బ్యాటరీ సేవింగ్ మోడ్ ద్వారా వీటి బ్యాకప్‌ను మరింతగా పెంచుకోవచ్చు.

కెమెరా విషయానికి వచ్చేసరికి

కెమెరా విషయానికి వచ్చేసరికి

లావా జెడ్25 మోడల్ 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాతో పాటు 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కలిగి ఉంది. 13 ఎంపీ కెమెరాలో ఏర్పాటు చేసిన Sony Exmor RS సెన్సార్, PDAF,f/2.0 aperture, స్పాట్‌లైట్ ఫోకస్ వంటి ఫీచర్లతో సుప్రీమ్ క్వాలిటీ ఫోటోలను క్యాప్చుర్ చేసుకోవచ్చు. స్పాట్ లైట్ ఫోకస్ ఫీచర్ ద్వారా తక్కు వెళుతురు కండీషన్స్ లోనూ హైక్వాలిటీ ఫోటోలను చిత్రీకరించుకోవచ్చు. ఈ కెమెరా ద్వారా 1080 పిక్సల్ రిసల్యూషన్ క్వాలిటతో లాంగ్ వీడియోలను రికార్డ్ చేసుకోవచ్చు.

బెస్ట్ క్వాలిటీ సెల్ఫీ..

బెస్ట్ క్వాలిటీ సెల్ఫీ..

8 ఎంపీ ఫ్రంట్ కెమెరాలో ఏర్పాటు చేసిన PDAF,f/2.0 aperture, స్పాట్‌లైట్ ఫ్లాష్ వంటిన ఫీచర్లతో హైక్వాలిటీ సెల్ఫీలను చిత్రీకరించుకునే వీలుంటుంది. హెచ్‌డీఆర్, బ్యూటి-ఫై, ఎక్స్ ట్రీమ్ బ్యూటీ, బోకెహ్, నైట్ ప్రో, కంటిన్యూ షాట్ వంటి అనేక రకాల కెమెరా మోడ్‌లను లావా జెడ్25 ఫోన్‌లో యూజర్ పొందవచ్చు. లావా జెడ్10 కెమెరా విషయానికి వచ్చేసరికి, ఈ డివైస్ లో 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాతో పాటు 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలను లావా పొందుపరిచింది.

"ultra fast" ఫింగర్ ప్రింట్ సెన్సార్

లావా జెడ్25 ఫోన్‌కు "ultra fast" ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరో ప్లస్ పాయింట్‌గా చెప్పుకోవచ్చు. ఈ స్కానర్ ఫోన్ సెక్యూరిటీని మరింత బలోపేతం చేస్తుంది. ఈ ఫింగర్ ప్రింట్ సెక్యూరిటీ ఫీచర్ ద్వారా లాక్ చేసి ఉన్న ఫోన్‌ను కేవలం 0.16 సెకన్ల వ్యవధిలో అన్‌లాక్ చేయవచ్చు.

 

కనెక్టువిటీ ఫీచర్లు...

కనెక్టువిటీ ఫీచర్లు...

హైబ్రీడ్ డ్యుయల్ సిమ్ స్లాట్, 4జీ VoLTE, కస్టమైజిడ్ గెస్ట్యర్స్, ఫ్లిప్ టు మ్యూట్, స్మార్ట్ గెస్ట్యర్స్, డేటా ప్రొటెక్షన్ వంటి ఫీచర్లు లావా జెడ్25 ఫోన్‌కు మరింత హైలైట్‌గా నిలుస్తాయి.

Best Mobiles in India

English summary
Upcoming Lava smartphones set to create some stir in Indian market. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X