కొత్త స్మార్ట్‌ఫోన్.. రెండు వారాల బ్యాటరీ బ్యాకప్

Posted By:

అత్యాధునిక ఫీచర్లతో నేటి యువత వినియోగిస్తోన్న వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లు బ్యాటరీ బ్యాకప్ సమస్యతో నిరాశకు లోను చేస్తున్నాయి. ఉదయం పెట్టిన ఛార్జింగ్ సాయంత్రం అయ్యే సరికి క్రమంగా తగ్గిపోతోంది. ముఖ్యంగా పెద్దతెర స్మార్ట్‌ఫోన్‌లలో బ్యాటరీ బ్యాకప్ సమస్య వేధిస్తోంది. ఇందుకు కారణం ఆయా ఫోన్‌లలోని ఫీచర్లు ఇంకా ఇతర అప్లికేషన్‌లు అధిక మోతదులు శక్తిని తీసుకోవటమే.

కొత్త స్మార్ట్‌ఫోన్.. రెండు వారాల బ్యాటరీ బ్యాకప్

ఈ నేపధ్యంలో పోలాండ్‌కు చెందిన ప్రముఖ ఇబుక్ రీడర్ల తయారీ కంపెనీ Onyx తెరపైకి MIDIA InkPhone పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకువచ్చింది. ఈ ఫోన్ సింగిల్ చార్జ్ పై రెండు వారాల ఖచ్చితమైన బ్యాటరీ బ్యాకప్‌ను ఇవ్వగలదట. ఇ-ఇంక్ డిస్‌ప్లేను కలిగి ఉండే ఈ స్మార్ట్ మొబైలింగ్ డివైస్ సాధారణ డిస్‌ప్లేలతో పోలిస్తే తక్కువ శక్తిని ఖర్చుచేస్తుందట.

MIDIA InkPhone కీలక ఫీచర్లను పరిశీలించినట్లయితే:

4.3 అంగుళాల ఇ-ఇంక్ డిస్‌ప్లే,
1గిగాహెట్జ్ ప్రాసెసర్,
512ఎంబి ర్యామ్,
1800ఎమ్ఏఎహెచ్ బ్యాటరీ.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot