ఇండియాలో ఈ నెలలో విడుదల అయ్యే కొత్త స్మార్ట్‌ఫోన్‌లు ఇవే...

|

స్మార్ట్‌ఫోన్‌లు అనేవి ఇప్పుడు మనిషి యొక్క జీవితంలో ఒక భాగం అయ్యాయి. ఎంతలా అంటే స్మార్ట్‌ఫోన్‌ లేనిదే మనిషి బయటకు వచ్చేది లేనంతగా. చాలా రకాల సంస్థలు తమ తమ కొత్త బ్రాండ్లతో స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తున్నారు. సెప్టెంబర్ నెల మొత్తం స్మార్ట్‌ఫోన్ లాంచ్‌లతో చాలా బిజీగా ఉంది. అయితే ఈ నెల అంటే అక్టోబర్ లో కూడా ఇంకా ఎక్కువ స్మార్ట్‌ఫోన్‌ల లాంచ్ లైనప్ ఉంది. రియల్‌మి, పోకో, వివో, శామ్‌సంగ్, మోటరోలా, గూగుల్ వంటి వివిధ బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్‌లు ఈ నెలలో భారత్‌లో తమ కొత్త బ్రాండ్ లను లాంచ్ చేయనున్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఇండియాలో కొత్త స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్

ఇండియాలో కొత్త స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్

భారతదేశంలో అక్టోబర్ నెలలో కొత్తగా ప్రారంభించే స్మార్ట్‌ఫోన్‌లు ఎక్కువగా ఉన్నాయి. వీటిలో బడ్జెట్ ధరల నుండి మిడ్-రేంజ్ ధరల ఫోన్లు కూడా ఉన్నాయి. అలాగే వీటితో పాటు మోటో రేజర్ 5G ఫోల్డబుల్ ఫోన్ కూడా లాంచ్ కానున్నది. పోకో X3 ను లాంచ్ చేసిన కొద్దికాలానికే పోకో ఇప్పుడు తన కొత్త C3 స్మార్ట్‌ఫోన్‌ను అక్టోబర్ 6 న విడుదల చేయనుంది. రియల్‌మి తన IoT ఈవెంట్‌ను మరుసటి రోజు హోస్ట్ చేస్తోంది. ఇక్కడ రియల్‌మి 7i స్మార్ట్‌ఫోన్‌తో సహా తన కొత్త పరికరాల సమూహాన్ని విడుదల చేస్తుంది.

Also Read:Vivo V20 లాంచ్ త్వరలోనే!! ఆండ్రాయిడ్ 11, 48MP సెల్ఫీ కెమెరా ఫీచర్లతో Also Read:Vivo V20 లాంచ్ త్వరలోనే!! ఆండ్రాయిడ్ 11, 48MP సెల్ఫీ కెమెరా ఫీచర్లతో

Moto Razr 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ వివరాలు

Moto Razr 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ వివరాలు

మోటరోలా యొక్క రెండవ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ మోటో రేజర్ 5G మద్దతు ఇవ్వడమే కాకుండా మెరుగైన ఫీచర్లతో వస్తుంది. ఇది 8GB RAM మరియు 256GB స్టోరేజ్ తో పాటు క్వాల్కమ్ యొక్క స్నాప్‌డ్రాగన్ 765G ప్రాసెసర్ తో రన్ అయ్యే చిప్ సెట్ తో జతచేయబడి ఉంటుంది. మోటో రేజర్ 5G 48 మెగాపిక్సెల్ రియర్ కెమెరా మరియు 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఫీచర్లతో ఇండియాలో సుమారు రూ.1,03 లక్షల ధర వద్ద విడుదల కానున్నది.

Poco C3 స్మార్ట్‌ఫోన్ లాంచ్ వివరాలు

Poco C3 స్మార్ట్‌ఫోన్ లాంచ్ వివరాలు

పోకో C3 స్మార్ట్‌ఫోన్ బడ్జెట్ విభాగం వద్ద ఇండియాలో లాంచ్ కానున్నది. ఈ ఫోన్ యొక్క టీజర్ ఆధారంగా పోకో C3 ఫోన్ 13 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, డెప్త్ సెన్సార్ మరియు మాక్రో సెన్సార్లు గల ట్రిపుల్ కెమెరా సెటప్ ను కలిగి ఉంటుంది. పోకో C3 అనేది రెడ్‌మి C3 యొక్క రీబ్రాండెడ్ వెర్షన్‌గా భావిస్తున్నారు.

Realme 7i స్మార్ట్‌ఫోన్ లాంచ్ & ధరల వివరాలు

Realme 7i స్మార్ట్‌ఫోన్ లాంచ్ & ధరల వివరాలు

రియల్‌మి సంస్థ ఇప్పటికే రియల్‌మి 7, రియల్‌మి 7ప్రోలను భారత్‌లో విడుదల చేసింది. ఇండోనేషియాలో లాంచ్ చేసిన తరువాత ఇది ఇప్పుడు రియల్‌మి 7i ని ఇండియాలో కూడా విడుదల చేస్తున్నది. ఇది రియల్‌మి 7 సిరీస్‌లో అత్యంత సరసమైన ఫోన్. రియల్‌మి 7i ఫోన్ 6.5-అంగుళాల HD + డిస్ప్లే, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్, 8GB RAM మరియు 128GB స్టోరేజ్‌ వంటి అద్భుతమైన ఫీచర్లతో వస్తుంది. ఇందులో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ గల క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉన్నాయి.

Also Read:Google పిక్సెల్ ఫోన్‌లకు అందుబాటులో ఎక్స్‌ట్రీమ్ బ్యాటరీ సేవర్ ఫీచర్....Also Read:Google పిక్సెల్ ఫోన్‌లకు అందుబాటులో ఎక్స్‌ట్రీమ్ బ్యాటరీ సేవర్ ఫీచర్....

Samsung Galaxy F41 స్మార్ట్‌ఫోన్ 64 మెగాపిక్సెల్ సెన్సార్

Samsung Galaxy F41 స్మార్ట్‌ఫోన్ 64 మెగాపిక్సెల్ సెన్సార్

శామ్సంగ్ గెలాక్సీ F41 స్మార్ట్‌ఫోన్ ను కంపెనీ ఇండియాలో మిడ్-రేంజ్ విభాగంలో విడుదల చేయనున్నది. ఈ స్మార్ట్‌ఫోన్ 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 6,000mAh బ్యాటరీ, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ వంటి ఫీచర్లను కలిగి ఉన్నట్లు నిర్ధారించబడింది. ఇది sAMOLED ఇన్ఫినిటీ-యు డిస్‌ప్లేను కూడా కలిగి ఉంటుంది. గెలాక్సీ ఎఫ్ 41 ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ అమ్మకం సమయంలో లభిస్తుంది.

Vivo V20 series ఇండియా లాంచ్

Vivo V20 series ఇండియా లాంచ్

వివో సంస్థ తన కొత్త V20 సిరీస్‌ లాంచ్ టీజర్ ను విడుదల చేసింది. కాని ఇది లాంచ్ తేదీని ఇంకా ధృవీకరించలేదు. అయితే ఇది అక్టోబర్ 12 న రెండు కొత్త ఫోన్లతో లాంచ్ అవుతుందని అంచనాలు ఉన్నాయి. వివో V20 సిరీస్‌లో V20, V20 ప్రో, V20 SEతో కలిపి మూడు ఫోన్లు ఉన్నాయి. స్మార్ట్ఫోన్ సిరీస్ 44 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, ట్రిపుల్ రియర్ కెమెరా మరియు 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో విడుదల కానున్నాయి.

Also Read:Reliance ఆర్బిక్ స్మార్ట్‌ఫోన్‌ యొక్క ఫీచర్స్ & ధరల వివరాలు ఇవే...Also Read:Reliance ఆర్బిక్ స్మార్ట్‌ఫోన్‌ యొక్క ఫీచర్స్ & ధరల వివరాలు ఇవే...

Google Pixel 4a ధరలు & ఇండియా లాంచ్

Google Pixel 4a ధరలు & ఇండియా లాంచ్

గూగుల్ పిక్సెల్ కొత్త లైనప్ నుండి భారతదేశంలో విడుదలయ్యే ఏకైక పిక్సెల్ ఫోన్ గూగుల్ పిక్సెల్ 4a. ఇది 5.8-అంగుళాల ఫుల్ ‌హెచ్‌డి + ఒఎల్‌ఇడి డిస్‌ప్లే, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 730 G ప్రాసెసర్, 6GB ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఫీచర్లతో వస్తుంది. అలాగే ఫోన్ వెనుక భాగంలో 12.2 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా మరియు 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ ఫ్రంట్ కెమెరా వంటి కెమెరా ఫీచర్లను కలిగి ఉన్నాయి. అయితే పిక్సెల్ 4a యొక్క ధర గురించి ఎటువంటి సమాచారం అందుబాటులో లేదు.

Best Mobiles in India

Read more about:
English summary
Upcoming New Smartphones Launching This October Month in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X