Home
Mobile

Upcoming Smartphones అక్టోబర్‌లో విడుదల కానున్న స్మార్ట్‌ఫోన్‌లు.. స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు పూర్తి వివరాలు.!

సెప్టెంబర్ నెలలో భారత్‌ మార్కెట్‌లో అనేక స్మార్ట్‌ఫోన్‌ విడుదల అయ్యాయి. ఐఫోన్‌ 16 సిరీస్‌, మోటోరోలా Razr 50 సహా ఇతర బ్రాండ్‌లకు చెందిన అనేక హ్యాండ్‌సెట్‌లు లాంచ్‌ అయ్యాయి. అక్టోబర్‌ నెలలో విడుదల అయ్యేందుకు వివిధ సంస్థల స్మార్ట్‌ఫోన్‌లు (Smartphones To Launch in October 2024) సిద్ధంగా ఉన్నాయి. ఈ జాబితాలో శాంసంగ్‌, వన్‌ప్లస్‌, ఐకూ, లావా, ఇన్ఫినిక్స్‌ బ్రాండ్‌లు ఉన్నాయి. త్వరలో ఆ జాబితాలోకి మరిన్ని స్మార్ట్‌ఫోన్‌లు చేరే అవకాశం ఉంది.

శాంసంగ్‌ గెలాక్సీ S24 FE :
ఈ స్మార్ట్‌ఫోన్‌ను (Samsung Galaxy S24 FE) ఇటీవలే ఆవిష్కరించారు. అక్టోబర్ 3 నుంచి సేల్‌ ప్రారంభం కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 6.7 అంగుళాల FHD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ విక్టస్‌ రక్షణను కలిగి ఉంది. IP68 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా విడుదల అయింది. అల్యూమినియం ఫ్రేమ్‌ను కలిగి ఉంది. 4700mAh బ్యాటరీతో పనిచేస్తుంది.

samsung-galaxy-s24-fe

ఈ స్మార్ట్‌ఫోన్‌ Exynos 2400e చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. 8GB ర్యామ్‌, 256GB స్టోరేజీతో జతచేయబడి ఉంది. ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత OneUI 6.0 ను కలిగి ఉంది. మరియు AI ఫీచర్‌లతో విడుదల అయింది. 50MP వైడ్‌ యాంగిల్‌ కెమెరా, 12MP అల్ట్రావైడ్‌ యాంగిల్‌, 8MP టెలిఫోటో కెమెరాలను కలిగి ఉంటుంది. మరియు 10MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

వన్‌ప్లస్‌ 13 :
వన్‌ప్లస్‌ 13 స్మార్ట్‌ఫోన్ (OnePlus 13) అక్టోబర్‌ నెలలో చైనాలో విడుదల కానుంది. ఈ హ్యాండ్‌సెట్‌ స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 4 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 100W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 6000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. అయితే ఈ హ్యాండ్‌సెట్‌ భారత్‌లో ఎప్పుడు విడుదల కానుందనే సమాచారాన్ని వన్‌ప్లస్‌ వెల్లడించలేదు.

samsung-galaxy-s24-fe

ఐకూ 13 :
ఐకూ 13 (iQOO 13) చైనాలో అక్టోబర్‌లో విడుదల కానుంది. క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 4 ప్రాసెసర్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. 16GB ర్యామ్‌, 512GB స్టోరేజీతో జతచేయబడుతుందని తెలుస్తోంది. 144Hz రీఫ్రెష్‌ రేట్ 6.7 అంగుళాల 2K అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 100W ఫాస్ట్‌ ఛార్జింగ్‌తో 6,150mAh బ్యాటరీతో పనిచేస్తుంది. IP68 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌తో అందుబాటులోకి రానుంది.

లావా అగ్ని 3 :
లావా అగ్ని 3 స్మార్ట్‌ఫోన్ (Lava Agni 3) భారత్‌లో అక్టోబర్‌ 4వ తేదీన విడుదల కానుంది. ఈ హ్యాండ్‌సెట్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.78 అంగుళాల FHD+ డిస్‌ప్లేతో అందుబాటులోకి రానుంది. మీడియాటెక్‌ డైమెన్సిటీ 7300 చిప్‌సెట్‌ తో పనిచేస్తుంది. 8GB ర్యామ్‌, 256GB స్టోరేజీతో జతచేసి ఉంటుంది. ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత లావా OS ను కలిగి ఉంది.

కెమెరా విభాగం పరంగా నాలుగు కెమెరాలతో విడుదల కానుందని తెలుస్తోంది. 64MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్‌, 2MP మ్యాక్రో, 2MP డెప్త్‌ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు 66W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ధర సహా ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.

ఇన్ఫినిక్స్‌ జీరో ఫ్లిప్‌ :
ఇన్ఫినిక్స్‌ జీరో ఫ్లిప్‌ స్మార్ట్‌ఫోన్‌ (infinix Zero Flip) 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.9 అంగుళాల LTPO అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. 3.64 అంగుళాల అమోలెడ్‌ ఇన్నర్‌ డిస్‌ప్లేతో లాంచ్‌ కానుంది. మీడియాటెక్‌ డైమెన్సిటీ 8020 చిప్‌సెట్‌తో విడుదల కానుంది. Mali G77 MC9 GPU ప్రాసెసర్‌, 8GB ర్యామ్, 512GB స్టోరేజీతో జతచేయబడి ఉంది.

కెమెరాపరంగా 50MP ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరాలను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌తో 32MP కెమెరాలను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ అక్టోబర్‌ నెలలోనే విడుదల కానుంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర సహా ఇతర వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

Best Mobiles in India

English summary
Upcoming Smartphone launches in october 2024 here is the list and specifications
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X