Home
Mobile

Upcoming Smartphones in August ఆగస్టులో విడుదల కానున్న స్మార్ట్‌ఫోన్‌లు.. స్పెసిఫికేషన్‌లు, లాంచ్‌ వివరాలు.!

భారత్‌ మార్కెట్‌ లో జులై నెలలో అనేక స్మార్ట్‌ఫోన్‌ లు విడుదల అయ్యాయి. ఆగస్టు నెలలోనూ విడుదల అయ్యేందుకు అనేక స్మార్ట్‌ఫోన్‌లు (Upcoming Smartphones in August 2024) సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటివరకు అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం ఈ జాబితాలో గూగుల్‌ పిక్సల్‌ 9 సిరీస్‌, వివో V40 సిరీస్‌, పోకో M6 ప్లస్‌, మోటోరోలా ఎడ్జ్‌ 50 స్మార్ట్‌ఫోన్‌లు ఆగస్టులో విడుదల కానున్నాయి. అయితే మరిన్ని హ్యాండ్‌సెట్‌ల వివరాలు త్వరలో తెలిసే అవకాశం ఉంది.

గూగుల్‌ పిక్సల్‌ 9 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌లు :
గూగుల్‌ పిక్సల్‌ 9 సిరీస్‌ (Google Pixel 9 Series) ఆగస్టులో విడుదల కానుంది. ఈ సిరీస్‌లో భాగంగా పిక్సల్‌ 9, పిక్సల్‌ 9 ప్రో, పిక్సల్‌ XL, పిక్సల్‌ 9 ప్రో ఫోల్డ్‌ హ్యాండ్‌సెట్‌లు లాంచ్‌ కానున్నాయి. అయితే గూగుల్‌ పిక్సల్‌ 9 ప్రో, పిక్సల్ 9 ప్రో ఫోల్డ్‌ భారత్‌లో విడుదల చేయనున్నట్లు గూగుల్ ధ్రువీకరించింది.

Smartphones confirmed to launch in August 2024

మోటో ఎడ్జ్‌ 50 స్మార్ట్‌ఫోన్‌ : ఈ స్మార్ట్‌ఫోన్‌ (Moto Edge 50 5G) ఆగస్టు 1న విడుదల కానుంది. ఈ హ్యాండ్‌సెట్‌ వివరాలను సంస్థ ధ్రువీకరించింది. 6.67 అంగుళాల pOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు స్నాప్‌డ్రాగన్‌ 7 జెన్‌ 1 చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది. దీంతోపాటు ఈ ఫోన్‌ 3 సంవత్సరాలపాటు OS, 4 సంవత్సరాలపాటు సెక్యురిటీ అప్‌డేట్‌లను పొందనుంది. MIL 810 మిలిటరీ గ్రేడ్‌ సర్టిఫికేషన్‌ను పొందనుంది.

వివో V40 సిరీస్‌ :
ఈ వివో V40 సిరీస్‌ (Vivo V40 series) విడుదలను ఇప్పటికే సంస్థ ధ్రువీకరించింది. ఈ సిరీస్‌లో భాగంగా V40 మరియు V40 ప్రో హ్యాండ్‌సెట్‌లు లాంచ్ కానున్నాయి. ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా సేల్‌ ప్రారంభం కానుంది. ఇప్పటికే BIS సర్టిఫికేషన్‌ను పొందింది. ఈ హ్యాండ్‌సెట్‌ ZEISS బ్రాండ్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. ఈ సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌లు 5500mAh బ్యాటరీలను కలిగి ఉండనున్నాయి.

Smartphones confirmed to launch in August 2024

పోకో M6 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ :

ఈ హ్యాండ్‌సెట్ (Poco M6 Plus 5G) బడ్జెట్‌ రేంజ్‌లో విడుదల కానుందని తెలుస్తోంది. ప్రధానంగా ఈ స్మార్ట్‌ఫోన్ 108MP ప్రైమరీ కెమెరా, 6.79 అంగుళాల LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుంది తెలుస్తోంది. దీంతోపాటు క్వాల్‌కాం స్నాప్‌ డ్రాగన్‌ 4 జెన్‌ 2 అడ్వాన్సడ్‌ ఎడిషన్‌ చిప్‌సెట్‌ ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత HyperOS ను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

గిజ్‌ బాట్‌ తెలుగు వెబ్‌ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌ కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరి కొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Upcoming Smartphones in August 2024 in india here is the list and launch details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X