Home
Mobile

రాబోయే నెల , జులై 2024 లో లాంచ్ కానున్న స్మార్ట్‌ఫోన్‌ల లిస్ట్! ఏ యే ఫోన్లు ఉన్నాయో చూడండి

మీరు జులై 2024 లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే, మీరు కొంచెం వేచి ఉండాలి. వాస్తవానికి, వచ్చే నెల జూలై 2024 లో చాలా స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్ కానున్నాయి. ఈ హ్యాండ్‌సెట్‌లు చాలా వరకు మధ్య-శ్రేణిలో వస్తాయి. దీనితో పాటు, ఇందులో కొన్ని ఫోల్డబుల్స్ కూడా ఉంటాయి. Samsung తన తదుపరి తరం Galaxy Z ఫోల్డ్ మరియు Galaxy Z ఫ్లిప్ సిరీస్‌లను కూడా పరిచయం చేస్తుంది. Xiaomi తన నాల్గవ తరం ఫోల్డ్ అలాగే దాని మొదటి క్లామ్‌షెల్ ఫోల్డబుల్‌ను లాంచ్ చేయబోతోంది.

ఇది కాకుండా, నథింగ్ సబ్-బ్రాండ్ CMF తన మొదటి స్మార్ట్‌ఫోన్‌ను కూడా విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. అదే సమయంలో, Realme కూడా ఒక ఫ్లాగ్‌షిప్‌ ఫోన్ ను లాంచ్ చేయబోతోంది. కాబట్టి ఈ ఫోన్‌ల ధర మరియు ఇందులో ఉన్న అన్ని ఫీచర్ల గురించి ముందుగానే తెలుసుకుందాం.

Upcoming Smartphones In July 2024 List

Red Magic 9S Pro సిరీస్
రెడ్ మ్యాజిక్ 9ఎస్ ప్రో సిరీస్ జూలై 3న చైనాలో లాంచ్ కాబోతోంది. ఈ ఫోన్ రెడ్ మ్యాజిక్ 9 ప్రో సిరీస్‌లో బడ్జెట్ ధర ఫోన్ గా రాబోతోంది. ఈ సిరీస్ లో రెడ్ మ్యాజిక్ 9ఎస్ ప్రో మరియు రెడ్ మ్యాజిక్ 9ఎస్ ప్రో ప్లస్‌లను పరిచయం చేస్తారు.

CMF ఫోన్ 1
CMF కూడా జూలై 8న ఒక ఈవెంట్‌ను నిర్వహిస్తుంది. ఇందులో కంపెనీ CMF ఫోన్ 1 పేరుతో తన మొదటి స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేస్తుంది. ఈ పరికరం మీడియా టెక్ డైమెన్సిటీ 7300 SoC ప్రాసెసర్ తో వస్తుంది. భారతదేశంలో ఈ చిప్‌ తో వచ్చే మొదటి ఫోన్ ఇదే అని మీకు తెలియచేస్తున్నాము.

Samsung Galaxy Z Fold 6 మరియు Galaxy Z Flip 6
శాంసంగ్ గెలాక్సీ Unpacked ఈవెంట్ జూలై 10న జరగనుంది. ఈ సమావేశంలో కంపెనీ గెలాక్సీ Z ఫోల్డ్ 6 మరియు గెలాక్సీ Z ఫ్లిప్ 6 లను విడుదల చేయనుంది. ఈ రెండు పరికరాలు స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 మొబైల్ ప్లాట్‌ఫారమ్‌లో పని చేస్తాయి. అదే సమయంలో, గెలాక్సీ Z ఫ్లిప్ 6 కొత్త 50MP ప్రైమరీ కెమెరా మరియు పెద్ద 4000mAh బ్యాటరీని కలిగి ఉండవచ్చు.

Oppo Reno 12 సిరీస్
ఒప్పో రెనో 12 సిరీస్ జూలైలో భారతదేశంలో లాంచ్ కాబోతోంది.ఈ సిరీస్ లో రెనో 12 మరియు రెనో 12 ప్రో ఉంటాయి. ఈ రెండు పరికరాలు మీడియా టెక్ డైమెన్సిటీ 7300 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతాయి. దీనితో పాటు, 6.7-అంగుళాల FHD + 120Hz OLED డిస్ప్లేను కలిగి ఉన్నాయి. ఇంకా, 50MP ప్రధాన కెమెరా మరియు 8MP అల్ట్రావైడ్ యూనిట్‌ని కలిగి ఉంటాయి. అయితే, ప్రో వెర్షన్ 50MP 2x టెలిఫోటో స్నాపర్ మరియు 50MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది.

Honor 200 సిరీస్
జూలైలో భారతదేశంలో లాంచ్ కాబోతున్న మరో ఫోన్ Honor 200. రిపోర్టుల ప్రకారం హానర్ 200 మరియు హానర్ 200 ప్రో రెండు ఫోన్లు లాంచ్ కాబోతున్నాయి. వనిల్లా మోడల్‌లో స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్ మరియు ప్రో మోడల్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 SoC ఉన్నాయి. ఈ హ్యాండ్‌సెట్‌లు 6.7-అంగుళాల 1.5K కర్వ్ OLED డిస్‌ప్లే, 50MP (వైడ్ యాంగిల్) + 50MP (2.5x టెలిఫోటో) + 12MP (అల్ట్రావైడ్) ట్రిపుల్ కెమెరా సిస్టమ్ మరియు 5200mAh బ్యాటరీని కలిగి ఉంటాయి.

Tecno Spark 20 Pro 5G
ఈ ఫోన్ కూడా జులై లో భారతదేశంలో ప్రారంభించబడుతుందని అంచనా ఉంది. ఇది స్పార్క్ 20 సిరీస్‌లో 5G తో వస్తున్న ఏకైక స్మార్ట్‌ఫోన్. ఇది మీడియా టెక్ డైమెన్సిటీ 6080 చిప్‌సెట్ ద్వారా పనిచేస్తుంది. మరియు 6.78-అంగుళాల FHD+ 120Hz డిస్‌ప్లే (LCD)ని కలిగి ఉంది. ఇది 108MP ప్రధాన కెమెరా, 8MP సెల్ఫీ కెమెరా మరియు డ్యూయల్ స్టీరియో స్పీకర్లతో వస్తుంది. ఇది 5000mAh బ్యాటరీ నుండి శక్తిని తీసుకుంటుంది మరియు 33W వైర్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.

Best Mobiles in India

English summary
Upcoming Smartphones In July 2024 List Here. Samsung, CMF, Xiaomi, Honor, And More Brand Phones Launching
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X